హోమ్ /వార్తలు /బిజినెస్ /

Sabarimala Trains: హైదరాబాద్, నర్సాపూర్ నుంచి శబరిమలకు మరో 14 ప్రత్యేక రైళ్లు

Sabarimala Trains: హైదరాబాద్, నర్సాపూర్ నుంచి శబరిమలకు మరో 14 ప్రత్యేక రైళ్లు

Sabarimala Trains: హైదరాబాద్, నర్సాపూర్ నుంచి శబరిమలకు మరో 14 ప్రత్యేక రైళ్లు
(ప్రతీకాత్మక చిత్రం)

Sabarimala Trains: హైదరాబాద్, నర్సాపూర్ నుంచి శబరిమలకు మరో 14 ప్రత్యేక రైళ్లు (ప్రతీకాత్మక చిత్రం)

Sabarimala Trains | దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) హైదరాబాద్, నర్సాపూర్ నుంచి శబరిమలకు మరో 14 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. శబరిమలలో మండల దీక్ష సందర్భంగా ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. నవంబర్ 16 నుంచి శబరిమలలో అయ్యప్ప మండల దీక్ష పూజలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. శబరిమలకు తెలుగు రాష్ట్రాలకు లక్షల సంఖ్యలో అయ్యప్ప భక్తులు వెళ్తుంటారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను (Special Trains) ప్రకటించింది. తాజాగా మరో 14 రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్, నాందేడ్ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు అయ్యప్ప భక్తుల కోసం అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్ల రూట్స్, టైమింగ్స్ తెలుసుకోండి.

రైలు నెంబర్ 07127 హైదరాబాద్ నుంచి కొల్లాం వరకు నవంబర్ 15, 22, 29 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి బుధవారం సాయంత్రం 6 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఇక రైలు నెంబర్ 07128 కొల్లాం నుంచి హైదరాబాద్‌కు నవంబర్ 16, 23, 30 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కొల్లాంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు బయల్దేరి శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

Railway Good News: రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పిన భారతీయ రైల్వే

హైదరాబాద్-కొల్లాం రూట్‌లో నడిచే ఆరు ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు , తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు , గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాల్‌ఘాట్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగన్‌చెరి, తిరువల్ల, చెంగన్నూర్, మవెలికెర, కన్యాకుళం, సాస్థాన్‌కోట స్టేషన్లలో ఆగుతాయి.

రైలు నెంబర్ 07129 నాందేడ్ నుంచి కొల్లాం రూట్‌లో నవంబర్ 17, 24 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గురువారం రాత్రి 11.45 గంటలకు నాందేడ్‌లో బయల్దేరి శనివారం మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు దారిలో ముద్ఖేడ్, ఉమ్రి, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, అకన్‌పేట్, వడియారం, మేడ్చల్, బొల్లారం, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సేడం, మల్ఖాయ్ రోడ్, సులేహల్లి, యాద్గిర్, రాయ్‌చూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప , రాజంపేట్, కోడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాల్‌ఘాట్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగన్‌చెరి, తిరువల్ల, చెంగన్నూర్, మవెలికెర, కన్యాకుళం, సాస్థాన్‌కోట స్టేషన్లలో ఆగుతుంది.

Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు తొలి వందే భారత్ రైలు... రూట్ ఇదే

ఇక రైలు నెంబర్ 07130 కొల్లాం నుంచి సికింద్రాబాద్ రూట్‌లో నవంబర్ 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కొల్లాంలో బయల్దేరి, సోమవారం అర్ధరాత్రి 12.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో సాస్థాన్‌కోట, కన్యాకుళం, మవెలికెర, చెంగన్నూర్, తిరువల్ల, చెంగన్‌చెరి, కొట్టాయం, ఎర్నాకుళం టౌన్, అలువా, త్రిసూర్, పాల్‌ఘాట్, కొయంబత్తూర్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పెట్టై, కాట్పాడి, రేణిగుంట, కోడూరు, రాజంపేట్, కడప, కమలాపురం, ఎర్రగుంట్ల, కొండాపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయ్‌చూర్, యాద్గిర్, సులేహల్లి, మల్ఖాయ్ రోడ్, సేడం, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి స్టేషన్లలో ఆగుతుంది.

రైలు నెంబర్ 07131 నర్సాపూర్ నుంచి కొల్లాం రూట్‌లో నవంబర్ 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సోమవారం సాయంత్రం 5.10 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి మంగళవారం సాయంత్రం 6.50 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఇక రైలు నెంబర్ 07132 కొల్లాం నుంచి నర్సాపూర్ రూట్‌లో నవంబర్ 22, 29 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మంగళవారం రాత్రి 8.45 గంటలకు కొల్లాంలో బయల్దేరి బుధవారం రాత్రి 10 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.

IRCTC Konark Tour: కోణార్క్ ఫెస్టివల్ వెళ్తారా? హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ

నర్సాపూర్-కొల్లాం రూట్‌లో నడిచే నాలుగు రైళ్లు దారిలో పాలకొల్లు, బీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ , తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాల్‌ఘాట్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగన్‌చెరి, తిరువల్ల, చెంగన్నూర్, మవెలికెర, కన్యాకుళం, సాస్థాన్‌కోట స్టేషన్లలో ఆగుతుంది.

First published:

Tags: Indian Railways, Sabarimala, Sabarimala Temple, South Central Railways, Special Trains