హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Rules: వాహనదారులకు అలర్ట్.. ఆ రూల్స్ మారబోతున్నాయ్.. ఇకపై..

New Rules: వాహనదారులకు అలర్ట్.. ఆ రూల్స్ మారబోతున్నాయ్.. ఇకపై..

వాహనదారులకు అలర్ట్.. ఆ రూల్స్ మారబోతున్నాయ్.. ఇకపై..

వాహనదారులకు అలర్ట్.. ఆ రూల్స్ మారబోతున్నాయ్.. ఇకపై..

Vehicles | వాహనదారులకు ముఖ్యమైన అలర్ట్. రానున్న కాలంలో కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం టోల్ చార్జీల చెల్లింపు విధానంలో కొత్త పాలసీని అమలు చేయబోతోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Toll Charges | వాహనదారులకు అలర్ట్. కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్ల (Toll Gate) వద్ద చార్జీల అంశంపై రూల్స్ మార్చడానికి రెడీ అవుతోంది. కొత్త రూల్స్ అమలులోకి వస్తే.. టోల్ చార్జీల లెక్కింపు విధానం మారుతుంది. ప్రస్తుతం టోల్ చార్జీలను స్థిరమైన దూరం ప్రకారం వసూలు చేస్తున్నారు. అయితే కొత్త రూల్స్ ప్రకారం అయితే వెహికల్ (Vehicles) సైజ్, రోడ్డు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఎంత ఒత్తిడిని కలిగిస్తోందనే పలు అంశాల ప్రాతిపదికన టోల్ చార్జీల లెక్కింపు ఉండనుంది.

  కేంద్రం ప్రస్తుత టోలింగ్ పాలసీలో మార్పులు చేయాలని భావిస్తోంది. రోడ్లపై ప్రయాణించే నిర్ణీత దూరం ఆధారంగా ప్రస్తుతం టోల్ చార్జీలను వసూలు చేస్తున్నారు. అయితే ఈ టోలింగ్ విధానంలో మార్పులు రానునాయి. వెహికల్స్ హైవేలపై ఉన్న వాస్తవ సమయం, దూరం ఆధారంగా టోల్ చార్జీల వసూలు చేసే అవకాశం ఉంటుంది.

  శుభవార్త.. భారీగా తగ్గిన ఈ 11 నిత్యావసర వస్తువుల ధరలు!

  అలాగే వాహనాల పరిమాణం, వాటి బరువు ఆధారంగా కూడా టోల్ చార్జీలను నిర్ణయించనున్నారు. ఇప్పుడు ప్రస్తుతం యాక్సిల్స్ సంఖ్యపై ఆధారంగా కూడా చార్జీలను వసూలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ విధానం ఉండకపోవచ్చు. వాహనం ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుంది, రహదారులపై ఎంత బరువును కలిగిస్తుందనే అంశాల ఆధారంగా టోల్ వసూలు చేయాలనే ఆలోచన కూడా కేంద్రానికి ఉంది. ఈ అంశాల ఫలితంగా రోడ్లు త్వరగా పాడవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు.

  ఇప్పుడు కొనండి.. వచ్చే ఏడాది నుంచి ఈఎంఐ కట్టండి! కంపెనీ అదిరే ఆఫర్!

  కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనలపై చర్చలు జరుపుతోందని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం త్వరలోనే ఈ ప్రతిపాదన అమలు చేసే అవకాశం ఉంది. ఈ కొత్త విధానాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయొచ్చని తెలుస్తోంది. త్వరలో అందుబాటులోకి రానున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుల్లో ఈ ప్రతిపాదనలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందువల్ల రానున్న కాలంలో టోల్ చార్జీల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు.

  కొత్త విధానం అమలుకు రంగం సిద్ధం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే వివిధ రకాల వాహనాలకు సంబంధించిన తాజా ప్యాసింజర్ కార్ యూనిట్ (పీసీయూ)ని లెక్కించాలని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని (వారణాసి) కోరింది. ప్యాసింజర్ కార్ యూనిట్ అనేది హైవే కెపాసిటీని లేదా వాహనం ఎంత రోడ్ కెపాసిటీని ఎంత సేపు ఉపయోగిస్తుందనే అంశాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే వాహన యూనిట్. కాగా ఫాస్టాగ్ విధానం కాకుండా రానున్న కాలంలో జీపీఎస్ ఆధారిత టోల్ చెల్లింపు విధానం అమలులోకి రావొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: FASTag, Gps, Toll plaza, Vehicles

  ఉత్తమ కథలు