ఏ కంపెనీలు అయినా సరే తమ ట్రేడ్‌మార్క్ నేమ్స్ (Trademark Name)ను మార్కెటింగ్ టూల్ గా ఉపయోగిస్తాయి. ప్రజలు ఫలానా కంపెనీ(Company) పేరును బట్టి అది తయారు చేసే వస్తువులు(Things) మంచివా? చెడ్డవా? వాటిని కొనుగోలు చేయాలా లేదా అనేది నిర్ణయించుకుంటారు. ఇలాంటి ట్రేడ్‌మార్క్ నేమ్స్ పై(Trademark Names) కంపెనీలకు(Companies) చాలా ప్రేమ ఉంటుంది. అయితే ఈ ట్రేడ్‌మార్క్ పేర్లను వేరే వ్యక్తులు లేదా కంపెనీలు ఉపయోగించుకుంటే కంపెనీలు ఏమాత్రం సహించవు. ట్రేడ్‌మార్క్ చట్టం (Trademark Act) కూడా ప్రజలు మోసపోకుండా లేదా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఏ రెండు కంపెనీలు ఒకే పేరును వాడకూడదని చెబుతోంది. అయితే ఇండియాలోని ఒక ఫుట్‌వేర్ షాప్ ఓనర్ ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్లు జపనీస్ కంపెనీ సోనీ (Sony) కార్పొరేషన్ ఆరోపిస్తోంది. అంతేకాదు, తమ ట్రేడ్‌మార్క్ పేరును ఉపయోగించి ట్రేడ్‌మార్క్ హక్కులను ఉల్లంఘించినందున ఈ ఓనర్ పై 1999లో ట్రేడ్‌మార్క్ దావా వేసింది. ఆ సమయం నుంచి సోనీ కంపెనీతో న్యాయ పోరాటం చేస్తున్నాడు సదరు ఫుట్‌వేర్ షాప్ ఓనర్.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్ సిటీ, తీన్ దర్వాజా సమీపంలోని ఓల్డ్ సిటీలో మహమ్మద్ ఇక్బాల్ పతంగియాకు (Mohammed Iqbal Patangiya) ఒక ఫుట్‌వేర్ షాప్ (Footwear Shop) ఉంది. ఇతడు తన షాప్ కి సోనీ ఫుట్‌వేర్ (Sony Footwear) అనే పేరు పెట్టుకున్నాడు. అయితే ఇది తమ కంపెనీ పేరని, దాన్ని ఉపయోగించడం చట్ట విరుద్ధమని జపనీస్ మల్టీ నేషనల్ కంపెనీ సంస్థ సోనీ కార్పొరేషన్ (Sony Corporation) ఫుట్‌వేర్ ఓనర్ మహమ్మద్ పై ట్రేడ్‌మార్క్ దావా (Trademark Suit) వేసింది. మార్చి, 1999లో ట్రేడ్‌మార్క్ దావా వేయగా.. ఆ సమయం నుంచి అంటే రెండు దశాబ్దాలుగా సోనీ కంపెనీతో న్యాయ పోరాటం చేస్తున్నాడు మహమ్మద్.
సోనీ (Sony) అనేది తన రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్ అని.. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రేడ్‌మార్క్ కింద బిజినెస్ చేస్తున్నామని.. అలాంటి ట్రేడ్‌మార్క్ ని ఎవరూ ఉపయోగించకూడదని జపనీస్ దిగ్గజం చెబుతోంది. ఈ వ్యవహారంలో నమోదైన కేసు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. అయితే ఫిర్యాది కంపెనీ (Plaintiff Company) అయిన సోనీ సాక్ష్యాలను చూపాలని డిసెంబర్ 2021లో మరోసారి కేసు నమోదయింది. కాగా ఈ అంశంపై తదుపరి విచారణ జూలైలో జరగనుంది.
ట్రేడ్ మార్క్స్ చట్టంలోని సెక్షన్ 29, 135 ప్రకారం, సోనీ ఫుట్‌వేర్ ఓనర్ తన హక్కులను ఉల్లంఘించాడని.. ఈ ట్రేడ్‌మార్క్ కింద బిజినెస్ కొనసాగించకుండా షాప్ ఓనర్ ని నిరోధించాలని కోరుతూ సోనీ ఒక సూట్ నమోదు చేసింది. మహమ్మద్ తరఫున నరేంద్ర తహిల్‌రమణి అనే న్యాయవాది వాదిస్తున్నారు. ఈ కేసుపై ఈయన మీడియాతో మాట్లాడుతూ, జపాన్‌కు చెందిన కంపెనీ ఈ కేసును దాఖలు చేసిందని, అయితే కోర్టును ఆశ్రయించినప్పుడు సోనీ కంపెనీ ఎలాంటి పాదరక్షల వస్తువుల (Footwear Merchandises)పై బిజినెస్ చేయడం లేదని ఆయన చెప్పారు.
ఇండియాలో Soni, Sony పేర్లు కామన్
ఇండియాలో సోని (Soni) లేదా సోనీ (Sony) పేరు అనేది వినిపించడం చాలా కామన్ అని మహమ్మద్ ఇక్బాల్ పతంగియా లాయర్ అంటున్నారు. "కోర్టులో కేసు వేసినప్పుడు సోనీ ఎలాంటి ఫుట్‌వేర్ ప్రొడక్ట్స్ అమ్మడం లేదు. అంతేకాకుండా, సోనీ లేదా సోనీ అనే పదం ఇక్కడ కామన్ పేరు. షాప్ పేరులో అలాంటి కామన్ వర్డ్ ని ఉపయోగించడం వల్ల, అతన్ని ట్రేడ్‌మార్క్ హక్కులను ఉల్లంఘించిన వ్యక్తిగా పేర్కొనలేం." అని లాయర్ నరేంద్ర అన్నారు.
Business Idea: ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్... రూ.70,000 పెట్టుబడి చాలు
కంపెనీ ట్రేడ్‌మార్క్ హక్కులను ఉల్లంఘించిందని ఆరోపించిన పదాన్ని కూడా ఒక నిర్దిష్ట సంఘం ఇంటిపేరుగా ఉపయోగిస్తుందని న్యాయవాది చెప్పారు. ఈ కేసు కారణంగా మహమ్మద్ తన ఫుట్‌వేర్ షాప్ కి ఇటీవల 'సోని (Soni)' అనే వర్డ్ తో కొత్త డిస్‌ప్లే బోర్డ్‌ను పెట్టుకున్నాడు. నిజానికి ఇండియాలో సోని అనేది స్వర్ణకారులు (Goldsmiths) తమ ఇంటిపేరు కోసం సాధారణంగా ఉపయోగించే ఇంటిపేరు. మరి ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.