మాజీ ప్రధాని దేవెగౌడను వెన్నుపోటు పొడిచింది సోనియానే...

యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని పడగొట్టి, జేడీఎస్ అధినేత దేవెగౌడను ప్రధాని పదవి నుంచి తొలగించి సోనియాగాంధీ ఆయనకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.

news18-telugu
Updated: April 9, 2019, 11:00 PM IST
మాజీ ప్రధాని దేవెగౌడను వెన్నుపోటు పొడిచింది సోనియానే...
నరేంద్ర మోదీ
  • Share this:
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ బెంగుళూరులో భారీ బహిరంగసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్ణాటకలోని జెడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారని, కర్ణాటక నుంచి పోటీచేయవచ్చు కదా అని విమర్శించారు. అంతే కాదు జేడీఎస్ అధినేత దేవెగౌడను ప్రధాని పదవి నుంచి తొలగించి సోనియాగాంధీ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారస్వామి కాంగ్రెస్ పార్టీకి ఒక పంచ్ బ్యాగ్ లా మారారని మోదీ అన్నారు. అలాగే నాడు సోనియా చేసిన ద్రోహానికి ఎక్కడ జేడీఎస్ ప్రతీకారం తీర్చుకుంటుందో అనే అనుమానంతోనే రాహుల్ గాంధీ కర్ణాటక నుంచి కాకుండా కేరళ నుంచి పోటీకి దిగుతున్నట్లు మోదీ తెలిపారు. అంతే కాదు కాంగ్రెస్ అధ్యక్షుడు పోటీ చేస్తున్న స్థానంలో ఓటమికి భయపడుతున్నారంటే ఆ పార్టీ ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవాలని మోదీ అన్నారు.

1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించడంతో ఏడాది కూడా గడవక ముందే దేవెగౌడ ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే  ప్రస్తుతం ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

First published: April 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>