హోమ్ /వార్తలు /బిజినెస్ /

Pharma Companies: ఫార్మా కంపెనీలకు భారీగా నష్టాలను మిగుల్చుతున్న కరోనా.. అసలు కారణం ఇదే..

Pharma Companies: ఫార్మా కంపెనీలకు భారీగా నష్టాలను మిగుల్చుతున్న కరోనా.. అసలు కారణం ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫార్మా కంపెనీల్లో పెద్ద మొత్తంలో కోవిడ్ మందుల స్టాక్‌ ఉండిపోయింది. ఆ స్టాక్‌ను ఏం చేయాలో తెలియని స్థితిలో ఫార్మా కంపెనీలు ఉన్నాయని న్యూస్18.కామ్ పరిశోధనలో తెలిసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం కోవిడ్-19 కేసులు నామమాత్రంగా నమోదవుతున్నాయి. కరోనా ప్రభావం కూడా చాలావరకు తగ్గింది. దీంతో వైరస్‌ను నిరోధించే మందుల వాడకం నిలిచిపోయింది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో వైరస్‌ను ఎదుర్కోవడానికి కొన్ని కంపెనీలు ప్రత్యేక మందులను తీసుకొచ్చాయి. వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో వీటికి డిమాండ్‌ అమాంతం పెరిగింది. వాటి కోసం ఆస్పత్రుల ముందు కిలోమీటర్ల మేర ప్రజలు కనిపించారు. కొందరు బ్లాక్‌ మార్కెట్‌లో కూడా వీటిని కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు వాటి అవసరాలు తగ్గడంతో, ఫార్మా కంపెనీల్లో పెద్ద మొత్తంలో స్టాక్‌ ఉండిపోయింది. ఆ స్టాక్‌ను ఏం చేయాలో తెలియని స్థితిలో ఫార్మా కంపెనీలు ఉన్నాయని న్యూస్18.కామ్ పరిశోధనలో తెలిసింది.

కోవిడ్-19 రోగుల చికిత్సకు ఫావిపిరవిర్ (Favipiravir), రెమిడిసివ్ (Remdesivir) మందులను ఎక్కువగా వినియోగించారు. 2021 ఆగస్టు వరకు వీటి సేల్స్‌ ఎక్కువగా జరిగాయి. ఆ తర్వాత బ్లాక్ ఫంగస్‌కు నివారణగా లిపోసోమల్ యాంఫోటెరిక్ B మందు వినియోగం పెరిగింది.

* కేసుల తగ్గుదలతో మారిన పరిస్థితులు

మహమ్మారి సమయంలో అవసరాలను తీర్చడానికి ఫార్మా పరిశ్రమలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. కానీ కోవిడ్ -19 కేసుల పతనం, ఈ మందుల డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో, ఫార్మా కంపెనీలు మందుల తయారీకి భారీగా పెట్టుబడి పెట్టాయి. ఇప్పుడు డిమాండ్‌ లేక మందులు, యంత్రాలు, ముడిపదార్థాలన్నీ నిరుపయోగంగా మారాయి. ఈ మందుల అమ్మకాలలో భారీ క్షీణతతో ఫార్మా కంపెనీలకు 5 కోట్ల రూపాయలకు పైగా విలువైన స్టాక్ తిరిగి వచ్చిందని సంస్థలు తెలిపాయి.

ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) సెక్రటరీ జనరల్ రాజీవ్ సింఘాల్ News18.comతో మాట్లాడుతూ.. ఇంతకుముందు రెమ్‌డిసివిర్ సరఫరాను ప్రభుత్వం నియంత్రించిందని తెలిపారు. తాము సెకండ్‌ వేవ్‌ చివరి దశ నుంచి Favipiravir, Remdesivir బ్రాండ్‌లను విక్రయిస్తున్నట్లు చెప్పారు. భారతదేశం అంతటా రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల విలువైన స్టాక్ రిటర్న్‌లను ఫార్మా కంపెనీలు అంగీకరించాయన్నారు. కంపెనీలు, కెమిస్ట్స్‌ మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా కొంత స్టాక్ ఇప్పటికీ మా వద్ద పెండింగ్‌లో ఉందని, ప్రధాన స్టాక్ తిరిగి పంపినట్లు వివరించారు.

* రూ.2,800 కోట్ల అమ్మకాలు

రెమ్‌డెసివిర్‌తో ఎటువంటి ఉపయోగం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీంతో విదేశాల నుంచి కూడా ఈ మందుకు గిరాకీ తగ్గింది. ఇప్పటికీ ఫావిపిరావిర్ ఎగుమతులకు అవకాశం ఉంది. రెమ్‌డిసివిర్ తయారు చేసిన ఫార్మాస్యూటికల్ కంపెనీలు, ఫావిపిరావిర్ ఉత్పత్తిలో పాల్గొన్న వాటి కంటే ఎక్కువ నష్టాలను నమోదు చేశాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 2020 జూన్ నుంచి గత సంవత్సరం వరకు, రెమ్‌డిసివిర్, ఫావిపిరావిర్.. ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న మెడిసిన్‌గా నిలిచాయి.

Car Offers: అదిరిపోయే ఆఫర్... రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ప్రకటించిన హ్యుందాయ్

Home Insurance: ఇంటికి బీమా తీసుకుంటే అనేక ప్రయోజనాలు... కవరేజీ గురించి తెలుసుకోండి

2020 జూన్ నుంచి 2021 ఆగస్టు వరకు మొత్తం 25 కోట్ల మాత్రలు, 50 లక్షల సీసాలు, రూ. 2,800 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. బ్లాక్ ఫంగస్ కోసం తయారు చేసిన రూ.22 కోట్ల విలువైన ఔషధాలు కంపెనీల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని రాజీవ్ చెప్పారు. ఈ మందుల్లో లిపోసోమల్ యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్లు, పోసాకోనజోల్ మాత్రలు, ముడి పదార్థాలు, ఎక్సిపియెంట్స్, ఇతర ముఖ్యమైన రసాయనాలు ఉన్నాయి.

* ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి

కరోనా ప్రారంభంలో ఈ ఔషధాలకు మూడు నెలల షెల్ఫ్ లైఫ్ ఇచ్చారని, అనంతరం షెల్ఫ్ జీవితాన్ని 15 నెలల వరకు పొడిగించారని రాజీవ్ సింఘాల్ చెప్పారు. తక్కువ ఎక్స్‌పైరీ టర్మ్ కారణంగా, రాబోయే కొద్ది నెలల్లో మెజారిటీ స్టాక్ గడువు ముగియనుందని వివరించారు. కోవిడ్-19 కేసులు ఇప్పటికీ వెలుగులోకి వస్తుండటంతో.. ప్రభుత్వం ఈ స్టాక్‌ను ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థలలో ఉపయోగించాలని పరిశ్రమ ఆశిస్తోంది. ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు ప్రారంభించలేదు. కోవిడ్ సంబంధిత డ్రగ్స్ విషయంలో GST కింద రివర్సల్‌ను మాఫీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతామని ఓ అధికారి చెప్పారు.

First published:

Tags: Coronavirus

ఉత్తమ కథలు