Link PAN-Aadhaar: పాన్‌తో ఆధార్ లింక్ చేయలేదా? ఈ 4 టిప్స్ ఫాలో అవండి

Link PAN-Aadhaar | వెంటనే మీ పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్ చేయాలంటూ ట్విట్టర్‌లో కోరింది ఆదాయపు పన్ను శాఖ. అంతేకాదు... పాన్ కార్డుతో ఆధార్ నెంబర్‌ను ఎలా లింక్ చేయాలో టిప్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.

news18-telugu
Updated: March 31, 2019, 10:30 AM IST
Link PAN-Aadhaar: పాన్‌తో ఆధార్ లింక్ చేయలేదా? ఈ 4 టిప్స్ ఫాలో అవండి
PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్‌ లింకైందా? ఇలా తెలుసుకోండి
news18-telugu
Updated: March 31, 2019, 10:30 AM IST
మీరు మీ పాన్‌కార్డుతో ఆధార్ నెంబర్‌ను ఇంకా లింక్ చేయలేదా? మార్చి 31 వరకే గడువు విధించింది ఆదాయపు పన్నుశాఖ. ఈ గడువు పెంచే అవకాశం కూడా కనిపించట్లేదు. అందుకే ఇప్పటివరకు పాన్‌కార్డుతో ఆధార్ నెంబర్‌ను లింక్ చేయనివాళ్లు త్వరపడాలంటూ ఆదాయపు పన్ను శాఖ ప్రచారం చేస్తోంది. వెంటనే మీ పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్ చేయాలంటూ ట్విట్టర్‌లో కోరింది ఆదాయపు పన్ను శాఖ. అంతేకాదు... పాన్ కార్డుతో ఆధార్ నెంబర్‌ను ఎలా లింక్ చేయాలో టిప్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. వాటి ద్వారా ఈజీగా పాన్-ఆధార్ లింక్ చేయొచ్చు.


పాన్‌తో ఆధార్ లింక్ చేయడానికి 4 మార్గాలు




1. ఎస్ఎంఎస్
Loading...
మీరు మీ ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డుతో ఆన్‌లైన్‌లో లింక్ చేయొచ్చు. ఇందుకోసం మీరు 567678 లేదా 56161 నెంబర్లకు కింద సూచించిన ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలి.

UIDPAN<space><12 అంకెల ఆధార్><space><10 అంకెల పాన్>
ఉదాహరణ: UIDPAN 111122223333 AAAPA9999Q

2. ఆన్‌లైన్
incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లో పాన్-ఆధార్ నెంబర్లు లింక్ చేయొచ్చు. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు 'Linking Aadhaar' లింక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. కొత్త పేజీలో ఆధార్‌కార్డుపై ఉన్న మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి 'Link Aadhaar' పైన క్లిక్ చేస్తే మీ పాన్‌ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.

Read this: PAN Card: మీ దగ్గర రెండో పాన్ కార్డ్ ఉందా? ఇలా సరెండర్ చేయండి

3. ఐటీ రిటర్న్స్(ITR)
మీరు ఇ-ఫైలింగ్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో కూడా మీ పాన్-ఆధార్ లింక్ చేసే అవకాశం కల్పిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. NSDL (tin-nsdl.com), UTIITSL (utiitsl.com) వెబ్‌‌సైట్లల్లో ఐటీఆర్ ఫైలింగ్ చేసేప్పుడు పాన్-ఆధార్ లింక్ చేయాలి.

4. పాన్ కార్డ్ అప్లికేషన్
ఇక కొత్తగా పాన్ కార్డు తీసుకునేవాళ్లు, పాన్ కార్డులో మార్పులు చేయించేవాళ్లు దరఖాస్తులోనే ఆధార్ నెంబర్ వివరిస్తే సరిపోతుంది.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

ఇవి కూడా చదవండి:

RRB NTPC Jobs: మొత్తం 35,277 ఖాళీలు... దరఖాస్తుకు మార్చి 31 చివరి తేదీ

DRDO Jobs: బీటెక్ చదివారా? డీఆర్‌డీఓలో ఫెలోషిప్... జీతం రూ.25,000

Syndicate Bank Jobs: సిండికేట్ బ్యాంకులో 129 ఉద్యోగాలు... దరఖాస్తు ఇలా

 
First published: March 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626