Isha Ambani: అమెరికాలోని స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం బోర్డ్​ మెంబర్​గా ఇషా అంబానీ నియామకం.. భారత్​కు దక్కిన అరుదైన గౌరవం

Isha Ambani: అమెరికాలోని స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం బోర్డ్​ మెంబర్​గా ఇషా అంబానీ నియామకం.. భారత్​కు దక్కిన అరుదైన గౌరవం

Isha Ambani | అమెరికాలోని ప్రఖ్యాత స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్‌లో కొత్త సభ్యురాలిగా ఇషా అంబానీని (Isha Ambani) నియమించారు. ఆమెతో పాటు మరో ఇద్దరు నూతన సభ్యులుగా చేరారు. ఈ మ్యూజియం ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి.

  • Share this:
అమెరికాలో ప్రఖ్యాత స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్‌లో (Smithsonian's National Museum of Asian Art) నూతన సభ్యురాలిగా భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ (Isha Ambani) నియామకమైంది. ఆమెతో పాటు మరో కరోలినా బ్రేమ్, పీటర్ కిమ్మోల్ మన్ బోర్ట్ ఆఫ్ ట్రస్టీస్ లో నూతన సభ్యులుగా చేరారు. స్మిత్సోనియన్ బోర్డ్ ఆఫ్ రీజెంట్స్ నాలుగేళ్ల కాలానికి వీరిని నియమించింది. 2021 సెప్టెంబరు 23 నుంచి వీరి నియామకం అమల్లోకి వచ్చింది. దీంతో 17 మంది బోర్డు సభ్యుల్లో వీరు భాగమయ్యారు. అమెరికా ప్రధాన న్యాయమూర్తి, అమెరికా ఉపాధ్యాక్షులు, యూఎస్ సెనేట్ కు చెందిన ముగ్గురు సభ్యులు, యూఎస్ ప్రతినిధుల సభ నుంచి ముగ్గురు సభ్యులు, తొమ్మిది మంది పౌరులు ఈ బోర్డులో సభ్యులుగా ఉంటారు.

ఈ నూతన నియామకాలతో పాటు మ్యూజియం బోర్డు అధ్యక్షుడిగా ఆంటోయిన్ వాన్ అగ్ట్‌మేల్ ను 2023 వరకు పొడిగించారు. డాక్టర్ విజయ్ ఆనంద్ బోర్డు వైస్ ఛైర్మన్ గా ఎంపికయ్యారు. అంబాసిడర్ పమేలా హెచ్, బోర్డు కార్యదర్శిగా నియామితులయ్యారు. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్(asia.si.edu) 1923లో వాషింగ్టన్ లో ఫ్రియర్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ గా ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో అసాధారణ సేకరణలు, ప్రదర్శనలు, పరిశోధనలు, కళల పరిరక్షణను కొనసాగిస్తోంది. ఫలితంగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది.2023లో ఈ మ్యూజియానికి శతాబ్ది ఉత్సావాలు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మ్యూజియం ప్రభావాన్ని మరింత విస్తరింపజేసి, ఆన్ సైట్, ఆన్ లైన్ రెండింట్లోనూ లోతుగా తెలిసేలా చేయడానికి ఈ నూతన బోర్డు సభ్యులను తీసుకున్నారు. నూతన సభ్యుల గురించి తెలుసుకోండి.

ఇషా అంబానీ


రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్(జియో)కి డైరెక్టర్ గా ఇషా అంబానీ పదవీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా అనేక వ్యాపారాల్లో భాగమయ్యారు. భారత్ లో ఇంధనం, పెట్రో కెమిక్లస్, టెక్స్ టైల్స్, రిటైల్, డిజిటల్ సేవల్లో రిలయన్స్ దూసుకెళ్తోంది. 2011లో ఇంట్లో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గడాన్ని గమనించిన ఇషా వినూత్నంగా ఆలోచించి 2016లో అన్ని ఐపీ, ఆల్-4జీ వైర్లెస్ టెలికమ్యూనికేషన్ సేవలను అందించడానికి జియోను ప్రారంభించి భారత్ లో డిజిటల్ విప్లవానికి నాంది పలికారు. ఫలితంగా జియో నేడు ప్రపంచంలోనే ప్రముఖ డేటా మార్కెట్లలో ఒకటిగా నిలిచింది.

జియో నేడు 440 మిలియన్లకుపైగా సబ్ స్క్రైబర్లను కలిగి ఉంది. భారత్ లో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ గా అవతరించింది.ఇది మాత్రమే కాకుండా ఇషా.. రిలయన్స్ రిటైల్, జియో కస్టమర్ సపోర్ట్ మార్కెటింగ్, ఫ్యాషన్ పోర్టల్ Ajio.com ప్రారంభించి వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఈ-కామర్స్ వెంచర్ జియోమార్ట్ ద్వారాఈ-కామర్స్ శక్తిని బయటకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతదేశ సంస్కృతిని రక్షించడానికి, ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు. వారసత్వ, భారతీయ కళలను ఉన్నతీకరించి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.

కరోలిన్ బ్రేమ్


2008 నుంచి కరోలినా బ్రేమ్ స్మిత్సోనియన్ మ్యూజియంతో సన్నిహితంగా ఉంటున్నారు. 40 ఏళ్లకు పైగా కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్, లెక్చరర్ గా గుర్తింపు పొందారు. ప్రపంచదేశాలతో సంబంధాలు, పబ్లిక్ పాలసీ, అంతర్జాతీయ వ్యాపారంలో అనుభవం ఆమెకు ఉంది. అంతేకాకుండా ఆమె తన కెరీర్లో ఫార్చ్యూన్ 100 కంపెనీల్లో రెండింటిలో పనిచేశారు. లాభాపేక్ష లేకుండా పలు సంస్థలకు సలహాలిచ్చారు. బ్రేమ్ గ్లోబల్ వెంచర్స్ కు వ్యవస్థాపకులే కాకుండా సీఈఓగానూ బాధ్యతలు నిర్వర్తించారు. కమర్షియల్ డిప్లమసీ, ప్రభుత్వ వ్యవహారాలు, పొలిటికల్ రిస్క్ లాంటి అంశాలపై లెక్చర్లు ఇచ్చారు. అంతేకాకుండా అంధత్వాన్ని తొలగించడానికి హాంకాంగ్ కు చెందిన ఆర్బీస్ అనే ఎన్జీఓ తో కలిసి పనిచేశారు.

పీటర్ కిమోల్మాన్


పీటర్ వార్టన్ స్కూల్, హార్వార్డ్ లా స్కూల్ నుంచి గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. 1979లో పీటర్ అసెట్ మెనేజ్మెంట్ LLCని స్థాపించారు. అంతేకాకుండా రెండు జపనీస్ ఆర్థిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించారు. రిపబ్లిక్ ఎక్జిగ్యూటీవ్ కమిటీ , నేషనల్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ సభ్యులుగా, HSBC డైరెక్టర్ గా దాదాపు 32 ఏళ్లు పనిచేశారు. గత 25 సంవత్సరాలుగా వరల్డ్ మోనుమెంట్స్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ ఏజింగ్ రీసెర్చ్ గా పనిచేశారు. అంతేకాకుండా పీటర్ నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ ట్రస్టీస్ కౌన్సిల్, అమెరికన్ ఫెడరేషన్ ఫర్ ది ఆర్ట్స్ మాజీ సభ్యులు.

స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ గురించి


వాషింగ్టన్, D.C లోని నేషనల్ మాల్‌లో ది ఫ్రీర్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ మరియు ఆర్థర్, M. సాక్లర్ గ్యాలరీ, స్మిత్సోనియన్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ ఉన్నాయి. అద్భుతమైన కళాఖండాలులను నేషనల్ ఆర్ట్ మ్యూజియంలో ప్రదర్శిస్తారు. దాదాపు 45 వేల కంటే ఎక్కువ అసాధారణ సేకరణలు ఇక్కడ ఉన్నాయి. నియోలిథిక్ కాలం నుంచి నేటి వరకు ఉపయోగించిన వస్తువులు ఇక్కడ భద్రపరిచారు. చైనా, జపాన్,కొరియా, దక్షిణ మరియు ఆగ్నేయాసియా, పురాతన నియర్ ఈస్ట్, ఇస్లామిక్ ప్రపంచానికి చెందిన ఐకానిక్ వస్తువులను ఇక్కడ ఉంచారు.
Published by:Santhosh Kumar S
First published: