Oppo స్మార్ట్‌ఫోన్‌లు బాగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. మన భారతదేశంలో అనేక మంది Oppo స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే.. ఒప్పో ఈసారి కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టనుంది. Oppo భారతదేశంలో 2023 మరియు 2024లో OPPO Electric Scooterను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అంటే ఈ స్కూటర్ ఎప్పుడు విడుదలవుతుందనేది అంశంపై ఇంకా పూర్తి సమాచారం రాలేదు. అయితే 2023లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) ను లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర దాదాపు రూ.60,000 ఉండబోతోందని మార్కెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర లక్షలకు పైగా పలుకుతోంది.
ఇంత తక్కువ ధరకు ఒప్పో నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైతే వాటికి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సామాన్యులకు ఈ స్కూటర్ మరింతగా చేరువయ్యే అవకాశం ఉంది. ఒప్పో ఇప్పటికే బ్యాటరీలు మరియు ఇతర భాగాల కోసం తయారీదారులతో చర్చలు ప్రారంభించిందని తెస్తుంది. వీటిలో కొన్ని కంపెనీలు టెస్లా వంటి బ్రాండ్‌లకు విడిభాగాలను సరఫరా చేస్తున్నాయి. ఏది ఏమైనా ఒప్పో నుంచి వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ రానున్న రోజుల్లో మార్కెట్లో సంచలనం సృష్టించే అవకాశం ఉందని చర్చలు సాగుతున్నాయి.
Ola Electric: ఓలా నుంచి మరో సంచలనం.. ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లపై కీలక ప్రకటన
చైనీస్ ఒప్పో సంస్థకు ఈవీ రంగంలో అనుభవం లేదనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సవాలును ఎలా తీసుకోవాలనుకుంటుందో అనేది ఆసక్తిరంగా ఉంటుంది. ఒప్పో ఇప్పటికే దాని ఎలక్ట్రిక్ వాహనాల కోసం తయారీ ప్రణాళికలపై పని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆ కంపెనీ సీఈఓ (CEO) టోనీ చాన్... టెస్లా కోసం బ్యాటరీలను తయారు చేసే, ఇతర భాగాలను సరఫరా చేసే కంపెనీలను కలిశారని వార్తలు వెలువబడ్డాయి. ఈ నేపథ్యంలో ఈవీ రంగంలో ఒప్పో తన ప్రభావాన్ని ఏ మేరకు చూపుతుందో, పూర్తి స్థాయిలో ఈ రంగంలోకి ఎప్పుడు ప్రవేశిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Okaya e-Scooter: తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్... ఒకాయా ఫ్రీడమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది
ఇతర సంస్థలు సైతం..
ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ లక్ష్యంగా చేసుకున్న మొదటి, ఏకైక నాన్-ఆటోమోటివ్ కంపెనీ ఒప్పో (Oppo) మాత్రమే కాదని విషయాన్ని గమనించాలి. వివిధ రకాల కొత్త స్టార్టప్ లు అలాగే షియోమీ, యాపిల్, హువావే వంటి ఇతర స్మార్ట్ ఫోన్ తయారీదారులు సైతం ఈ రంగంలో తమ వాటాను సంపాదించుకోవడానికి కృషి చేస్తున్నాయి. గూగుల్, యాపిల్, షియోమీ, హువావే వంటి కంపెనీలు కూడా తమ సొంత ఎలక్ట్రిక్ వాహనాలపై పనిచేస్తున్నాయి. అయితే వారి ఎలక్ట్రిక్ వెహికిల్స్ లాంచ్ టైమ్ లైన్ ల గురించి వివరాలు చాలా తక్కువగానే ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Bikes, Electric Vehicle, New electric bike, Oppo