Home /News /business /

Electric vehicles: "స్మార్ట్‌"గా క‌న్నేస్తున్నాయి... ఈవీ మార్కెట్‌పై మొబైల్ కంపెనీల దృష్టి

Electric vehicles: "స్మార్ట్‌"గా క‌న్నేస్తున్నాయి... ఈవీ మార్కెట్‌పై మొబైల్ కంపెనీల దృష్టి

ప్ర‌తీకాత్మ‌క చిత్రం (image: ola electric)

ప్ర‌తీకాత్మ‌క చిత్రం (image: ola electric)

Electric vehicles: ఇండియన్ మార్కెట్‌లో Electric స్కూటర్లకు డిమాండ్ గణనీయంగా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టుగా కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓలా Electric , సింపుల్ ఎనర్జీ, బ‌జాన్‌ వంటి కొత్త బ్రాండ్లు ఇటీవల ఈ విభాగంలోకి ప్రవేశించాయి. తాజాగా స్మార్ట్ ఫోన్ కంపెనీ దిగ్గ‌జాలు సైతం ఈ మార్కెట్‌లోకి ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
    ఇండియన్ మార్కెట్‌లో Electric స్కూటర్లకు డిమాండ్ గణనీయంగా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టుగా కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓలా Electric , సింపుల్ ఎనర్జీ, బ‌జాన్‌ వంటి కొత్త బ్రాండ్లు ఇటీవల ఈ విభాగంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం గ్లోబల్ సెమీ కండక్టర్ (Semiconductor) కొరత కారణంగా, ఈ-స్కూటర్ల ఉత్పత్తి, డెలివరీ కొంతకాలం పాటు పెద్ద సవాలుగా ఉండ‌నుంది. అయితే ఈ నేప‌థ్యంలో ఎల‌క్ట్రిక్ వెహికిల్ మార్కెట్‌పై స్మార్ట్ ఫోన్ (Smart Phone) కంపెనీలు క‌న్నేశాయి. న‌వంబ‌ర్ నెల‌ ప్రారంభంలో ఒప్పో (OPPO) తన సహ బ్రాండ్లు అయిన రియల్ మీ (RealMe), వివోతో కలిసి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తులను దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

    వెహికిల్ ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు..
    ఎల‌క్ట్రిక్ వెహికిల్ లాంచ్‌పై ఎక్కువ‌గా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీలు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. దేశంలో మంచి మార్కెట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ దిగ్గ‌జం ఒప్పో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం. 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభించాలని ఒప్పో కంపెనీ యోచిస్తోంద‌ని మార్కెట్ వ‌ర్గాలు అనుకుంటున్నాయి. అధికారికంగా ఇంకా ఎటువంటి స‌మాచారం లేదు.

    JP Morgan Jobs: జేపీ మోర్గాన్ హైదరాబాద్ బ్రాంచ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌


    ఒప్పో ఎలక్ట్రిక్ వెహికల్ ప్ర‌వేశ‌పెట్ట‌నుంద‌ని చాలా కాలంగా వార్త‌లు వ‌స్తున్నా.. కంపెనీ ఎప్పుడు స్పందించాలేదు. అయితే ఈ సారి లక్ట్రిక్ వాహనాల ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తులను దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంత నిజ‌ముందో తెలియాలి.

    10 మిలియ‌న్ మార్కెట్‌కు షియోమి య‌త్నం..
    దేశంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఉన్న కంపెనీ షియోమీ అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సంస్థ కూడా 2024 మొదటి అర్ధభాగంలో తన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొని రావాలని యోచిస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఈవీ మార్కెట్లోకి ప్రవేశించి, రాబోయే 10 ఏళ్లలో ఈ వ్యాపారంలో 10 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని షియోమీ తన ప్రణాళికల గురుంచి ప్రకటించింది.

    iPhone: మీరు ఈ మోడ‌ల్ యాపిల్ ఫోన్ వాడుతున్నారా.. అయితే ఉచింగా రిపేర్ చేస్తారు


    ఇది గత నెలలో తన ఎలక్ట్రిక్ వాహన వ్యాపారం కోసం షియోమీ ఈవీ ఇంక్ పేరును కూడా నమోదు చేసింది.

    యాపిల్ కూడా..
    ప్ర‌ముఖ మొబైల్ త‌యారీ దిగ్గ‌జం ఎల‌క్ట్రిక్(Electric) వాహ‌నాల త‌యారీ రంగంలోకి ప్ర‌వేశించ‌నుందా.. దీనిపై ప్రముఖ నోబెల్(Nobel) బహుమతి గ్రహీత అకిరా యోషినో గ‌తంలోనే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న రాయిట‌ర్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆపిల్(Apple) ఈ ఏడాది చివ‌రి క‌ల్లా ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ రంగంలోకి అడుగు పెట్ట‌నుంద‌ని వెల్ల‌డించారు.

    ఇప్పటికే భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో బలమైన ఉనికి కలిగి ఉన్న ఒప్పో, రియల్ మీ, షియోమీ వంటి కంపెనీలు ఈవీ మార్కెట్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాయి. యాపిల్ కూడా ఈవీ బిజినెస్‌పై దృష్టి పెట్టింది. అయితే భారతీయ మార్కెట్‌లో ఏది రాణిస్తుందో చూడాల‌ని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Apple, Electric vehicle, Oppo, Realme, Redmi, Smart phone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు