Savings: పొదుపు పథకాల్లో డబ్బులు జమ చేస్తున్నవారికి ఊరట

Small savings schemes | పీపీఎఫ్ లాంటి పొదుపు పథకాల్లో డబ్బులు క్లెయిమ్ చేసుకునే నామినీలకు ఊరటనిచ్చింది డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్. కొత్త సర్క్యులర్ జారీ చేసింది.

news18-telugu
Updated: September 17, 2020, 5:02 PM IST
Savings: పొదుపు పథకాల్లో డబ్బులు జమ చేస్తున్నవారికి ఊరట
Savings: పొదుపు పథకాల్లో డబ్బులు జమ చేస్తున్నవారికి ఊరట (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సహా ఇతర చిన్న పొదుపు ఖాతా పథకాల్లో పెట్టుబడిదారులకు భారీ ఊరటనిచ్చింది పోస్టల్ డిపార్ట్‌మెంట్. పొదుపు ఖాతాల్లో పెట్టుబడి పెట్టి మరణించిన వ్యక్తికి చెందిన నామినీలు పాలసీ రిటర్న్స్ క్లెయిమ్ చేసుకునే సమయంలో ఇద్దరు సాక్షుల ఫిజికల్ ప్రజెన్స్ ఉండాలని తపాలా కార్యాలయాలు పట్టుబడుతున్నాయి. దీనిపై నామినీలు /హక్కుదారుల నుండి విజ్ఞప్తులు వెల్లువెత్తడంతో పోస్టల్ డిపార్ట్‌మెంట్ వారికి ఊరటనిస్తూ నూతన సర్క్యులర్ జారీ చేసింది. పాలసీ క్లెయిమ్ సందర్భంలో సాక్షుల ఫిజికల్ ప్రజెన్స్ అవసరం లేదని నూతన సర్క్యులర్ జారీ చేసింది. ఇది పిపిఎఫ్‌తో పాటు ఇతర పోస్టాఫీసు పొదుపు పథకాలకు వర్తిస్తుందని పేర్కొంది. ఇతర క్లెయిమ్ పత్రాలతో పాటు సంబంధిత సాక్షి యొక్క సంతకం, వారి ఐటి/అడ్రస్ ప్రూఫ్ల స్వీయ-ధృవీకరణ ఫోటోకాపీ ఉంటే సరిపోతుందని, సాక్షుల ఫిజికల్ ప్రజెన్స్ అవసరం లేదని పోస్టల్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది.

Gold Loan Vs Personal Loan: లోన్ తీసుకునే ముందు ఈ లెక్కలు మర్చిపోవద్దు

HDFC Bank: కస్టమర్లకు శుభవార్త... వడ్డీ రేటు తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని సిబిఎస్/ నాన్–సిబిఎస్ పోస్ట్ ఆఫీస్లతో సహా అన్ని పోస్టాఫీసుల్లో ఈ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. నూతనంగా జారీ చేసిన సర్క్యులర్లో సూచించినట్లుగా సాక్షుల ఐడి, అడ్రస్ ప్రూఫ్‌ను జతచేయాల్సి ఉంటుంది. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడి కార్డు, రేషన్ కార్డ్, పోస్ట్ ఆఫీస్ ఐడి కార్డు, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే పిఎస్‌యూ ఐడి కార్డు, రాష్ట్ర ప్రభుత్వ అధికారి సంతకంతో జారీ చేసిన జాబ్ కార్డు, పాన్ కార్డ్, గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుండి పొందిన చిరునామా సర్టిఫికెట్ జత చేయాలి.

Money Tips: ఒకేసారి మీ చేతికి రూ.28 లక్షలు... పొదుపు రూ.100 నుంచి ప్రారంభిస్తే చాలు

Fixed Deposit: ఏ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే లాభం?

ఇక అడ్రెస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడి కార్డు, రేషన్ కార్డు, చిరునామా ఉన్న ఫోటో ఐడెంటిటీ కార్డు (కేంద్ర ప్రభుత్వం/ పిఎస్యు లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు), గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుండి పొందిన చిరునామా సర్టిఫికెట్, ప్రస్తుత చిరునామాతో ఉన్న శాలరీ స్లిప్, పేరు, చిరునామా వివరాలను కలిగి ఉన్న జాతీయ జనాభా రిజిస్టర్ జారీ చేసిన లేఖ, విద్యుత్తు, టెలిఫోన్, పోస్ట్-పెయిడ్ మొబైల్, పైప్డ్-గ్యాస్, వాటర్ బిల్లు (2 నెలల్లోపు ఉన్నవి), ఆస్తి లేదా మున్సిపల్ టాక్స్ రిసిప్ట్, బ్యాంక్ లేదా పోస్ట్ పాస్బుక్ /చిరునామాతో ఉన్న స్టేట్మెంట్, పేరు, చిరునామా వివరాలను కలిగి ఉన్న జాతీయ జనాభా రిజిస్టర్ జారీ చేసిన లేఖ ఇవ్వొచ్చు.
Published by: Santhosh Kumar S
First published: September 17, 2020, 5:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading