SMALL LPG CYLINDERS WILL BE AVAILABE AT RATION SHOPS HERE IS THE DETAILS AK GH
Small LPG cylinders: త్వరలో రేషన్ దుకాణాల్లో చిన్న ఎల్పీజీ సిలిండర్ల అమ్మకం.. సబ్సిడీపై ఇవ్వనున్న కేంద్రం
ప్రతీకాత్మక చిత్రం
రేషన్ దుకాణాల్లో ఇప్పటి వరకు బియ్యం, పంచదార, కందిపప్పు ఇతర నిత్యవసర వస్తువులు మాత్రమే సబ్సిడీపై విక్రయిస్తుంటారు. అయితే, త్వరలో ఈ జాబితాలోకి చిన్న ఎల్పీజీ గ్యాస్ సిలీండర్ కూడా చేరనుంది. దీనితో పాటు ఇతర ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా అందుబాటులోకి రానున్నాయి.
రేషన్ దుకాణాల్లో ఇప్పటి వరకు బియ్యం, పంచదార, కందిపప్పు ఇతర నిత్యవసర వస్తువులు మాత్రమే సబ్సిడీపై విక్రయిస్తుంటారు.అయితే,త్వరలో ఈ జాబితాలోకి చిన్నఎల్పీజీ గ్యాస్సిలీండర్ కూడా చేరనుంది. దీనితో పాటు ఇతర ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా అందుబాటులోకి రానున్నాయి. చిన్న తరహా LPG సిలీండర్లతో పాటు ఆర్థిక సేవలను తీసుకురావాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లుబుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అవుట్ లెట్ల(సరస ధరల దుకాణాలు) ఆర్థిక సాధ్యతను పెంపొందించే చర్యల్లో భాగంగా ఈ ప్రణాళిక రూపొందించనున్నామని తెలిపింది. ఈ మేరకు ఫుడ్ సెక్రటిరీ సుధాన్షు పాండే రాష్ట్ర ప్రభుత్వాలతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం తర్వాత ఆహార, వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.
రేషన్ దుకాణాల ఆర్థిక సాధ్యతను పెంపొందించడానికి చురుకైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సమావేశానికి ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, ఫైనాన్స్, పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖల ప్రతినిధులు హాజరయ్యారు. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్(IOCL), భారత పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(HPCL)తో పాటు సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్(CSC) అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
చమురు మార్కెటింగ్ కంపెనీల(OMCలు) ప్రతినిధులు సరస ధరల దుకాణాలు(FPS) ద్వారా చిన్న LPG సిలీండర్ల విక్రయాల ప్రతిపాదనను అభినందించాయి. రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో సమన్వయంతో దీనికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని వారు చెప్పారు. FPS ద్వారా ఆర్థిక సేవలను అందించే ప్రతిపాదనపై ఆర్థిక సేవల విభాగానికి (DFS) చెందిన ప్రతినిధులు రాష్ట్రాలతో సమన్వయంతో అందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని తెలియజేశారు.
ఆర్థిక సేవలు కూడా అందుబాటులోకి..
అంతేకాకుండా మూలధన పెంపు కోసం ముద్రా రుణాలు(MUDRA loans) అందించాలని ప్రభుత్వం యోచిన్నట్లు ప్రకటనలో పేర్కొంది. FPS సామర్థ్యాన్ని పెంపొందించడం, ఈ కార్యక్రమాల అమల్లో వారికి తగిన సహాయం చేయడానికి వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేర్వేరు వర్క్ షాపులు లేదా వెబినార్లను నిర్వహించాలని ఆహార కార్యదర్శికి సీఎస్సీ సూచించారు. సరస ధరల దుకాణాలనే రేషన్ షాపులు అని కూడా పిలుస్తారు.ఈ కార్యక్రమాల ప్రయోజనాలపై FPS డీలర్లకు అవగాహన కల్పించేందుకు ఏకకాలంలో నిరంతర అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని కార్యదర్శి రాష్ట్రాలకు సూచించారు. రానున్న కాలంలో రేషన్ దుకాణాల్లో ఎల్పీజీ సిలీండర్లతో పాటు ఆర్థిక సేవలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.