హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank FD Rates: గుడ్ న్యూస్.. రూ.లక్షకు రూ.2 లక్షలు అందిస్తున్న 2 బ్యాంకులు ఇవే! ఎలా అంటే?

Bank FD Rates: గుడ్ న్యూస్.. రూ.లక్షకు రూ.2 లక్షలు అందిస్తున్న 2 బ్యాంకులు ఇవే! ఎలా అంటే?

 Bank FD Rates: గుడ్ న్యూస్.. రూ.లక్షకు రూ.2 లక్షలు అందిస్తున్న 2 బ్యాంకులు ఇవే! ఎలా అంటే?

Bank FD Rates: గుడ్ న్యూస్.. రూ.లక్షకు రూ.2 లక్షలు అందిస్తున్న 2 బ్యాంకులు ఇవే! ఎలా అంటే?

Fixed Deposit | మీరు బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే శుభవార్త. ఈ రెండు బ్యాంకుల్లో అధిక వడ్డీ లభిస్తోంది. 8 శాతానికి పైగా రాబడి పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

FD Rates | రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులు (Banks), పోస్టాఫీస్ (Post Office) స్కీమ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే పోస్టాఫీస్ స్కీమ్స్ కన్నా కొన్ని బ్యాంకులు అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దిగ్గజ బ్యాంకుల కన్నా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అధిక వడ్డీని అందిస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారీ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. రెండు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 8 శాతానికి పైగా వడ్డీని అందిస్తున్నాయి. వీటిల్లో డబ్బులు దాచుకుంటే అదిరే రాబడి పొందొచ్చు. ఏ ఏ బ్యాంకుల్లో ఈ వడ్డీ లభిస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్తగా కారు కొనాలనుకునే వారికి షాక్.. బాదుడే బాదుడు!

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 366 రోజుల ఎఫ్‌డీ స్కీమ్‌ను అందిస్తోంది. ఇందులో సాధారణ కస్టమర్లకు 7.8 శాతం వడ్డీ లభిస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 8.3 శాతం వడ్డీ వస్తుంది. కాగా బ్యాంక్ ఇటీవలనే షాగున్ ఎఫ్‌డీ పథకాన్ని తెచ్చింది. ఇందులో కూడా ఆకర్షణీయ వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్ కేవలం ఈ నెల చివరి వరకే అందుబాటులో ఉంటుంది. అందువల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.

వావ్.. కార్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్ ఆఫర్లు.. ఏకంగా రూ.57 వేల తగ్గింపు!

అలాగే సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా అధిక వడ్డీని అందిస్తోంది. ఈ బ్యాంక్ ఎఫ్‌డీలపై 8.26 శాతం వడ్డీని వడ్డీని ఆఫర్ చేస్తోంది. 999 రోజుల ఎఫ్‌డీలకు ఈ రేటు వర్తిస్తుంది. సాధారణ కస్టమర్లకు 8.01 శాతం వడ్డీ వస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 8.26 శాతం వడ్డీ లభిస్తుంది. అంటే మీరు ఈ బ్యాంకులో రూ. లక్ష ఎఫ్‌డీ చేస్తే పదేళ్లలో మీ చేతికి రూ.2 లక్షలకు పైగా వస్తాయి. అయితే ఇక్కడ ఎఫ్‌డీ టెన్యూర్ అయిపోయిన తర్వాత రెన్యూవల్ చేసుకోవాలి. టెన్యూర్ మొత్తం 8.3 శాతం వడ్డీ రేటు ఉంటేనే ఈ రాబడి వస్తుంది.

అంతేకాకుండా ఈ బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ సర్వీసులు కూడా అందుబాటులో ఉంచింది. మీరు రూ.100 నుంచి కూడా ఈ ఆర్‌డీ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. 21 నెలలు, 24 నెలలు, 27 నెలలు, 30 నెలల టెన్యూర్ ఎంచుకుంటే 7.51 శాతం వరకు వడ్డీని పొందొచ్చు. ఈ కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 2 నుంచి అమలులోకి వచ్చాయి. ఒకేసారి డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలన్నా, లేదంటే ప్రతి నెలా కొంత మొత్తం దాచుకోవాలని ప్లాన్ చేస్తున్నా.. ఈ రెండు బ్యాంకులు బెస్ట్ అని చెప్పుకోవచ్చు.

First published:

Tags: Banks, FD rates, Fixed deposits, Money, Recurring Deposits

ఉత్తమ కథలు