హోమ్ /వార్తలు /బిజినెస్ /

Money: ఒక్క షేరుకు 10 షేర్లు.. రూ.లక్షకు రూ.50 లక్షలు..

Money: ఒక్క షేరుకు 10 షేర్లు.. రూ.లక్షకు రూ.50 లక్షలు..

Money: ఒక్క షేరుకు 10 షేర్లు.. రూ.లక్షకు రూ.50 లక్షలు..

Money: ఒక్క షేరుకు 10 షేర్లు.. రూ.లక్షకు రూ.50 లక్షలు..

Multibagger Share | స్టాక్ స్ల్పిట్ వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది? అంటే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. భారీ లాభం ఎలా వస్తుందో అర్థం అవుతుంది. ఒక షేరు ఇన్వెస్టర్ల పంట పండించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Multibagger Stock | స్టాక్ మార్కెట్‌తో భారీ లాభం పొందొచ్చు. ఇందుకు చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. చాలా షేర్లు ఇన్వెస్టర్లకు లాభాల వర్షం కురిపించాయి. ఇప్పుడు మనం ఇలాంటి ఒక షేరు (Stock) గురించే మాట్లాడుకోబోతున్నాం. ఈ షేరు రూ.లక్షను ఏకంగా రూ. 50 లక్షలుగా మార్చేసింది. అంటే ఏ స్థాయిలో లాభాలు అందించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ షేరు ఏంటో? ఎంత కాలంలో ఈ మేర లాభాలు (Money) అందించిందో? ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్స్ షేరు ఇన్వెస్టర్ల తల రాతను మార్చేసింది. 2007లొ ఈ స్టాక్ ధర కేవలం రూ. 6.5 మాత్రమే. కానీ ఇప్పుడు ఈ షేరు ధర రూ. 32కు పైకి చేరింది. అంటే షేరు ధర 15 ఏళ్లలో 400 శాతం మేర పెరిగింది. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదే స్టాక్ స్ల్పిట్. 2010లో కంపెనీ స్టాక్ స్ల్పిట్ చేసింది. ఒక్కో షేరును పది షేర్లుగా విభజించింది.

ఒక్కసారి చార్జింగ్ పెడితే 320 కి.మి. వెళ్లొచ్చు.. టాప్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

అంటే 2007 నవంబర్ నెలలో ఈ స్టాక్‌లో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. 15,384 షేర్లు వచ్చేవి. 2010 స్టాక్ స్ల్పిట్ తర్వాత ఇవే షేర్లు 1,53,840గా మారి ఉంటాయి. ఇప్పుడు గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్స్ షేరు ధర రూ. 32కు పైగా ఉంది. దీని ప్రకారం చూస్తే.. 2007కు ముందు రూ. లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు రూ. 50 లక్షలకు పైగా వచ్చేవి. స్టాక్ స్ల్పిట్‌తో భారీ బెనిఫిట్ లభించిందని చెప్పుకోవచ్చు.

ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొంటే సంవత్సరంలోనే రూ.85,000 ఆదా.. ఎలానో తెలుసుకోండి!

గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్స్ అనేది ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ. ఇది కొత్త వ్యాపారాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. బిల్స్ డిస్కౌంటింగ్ బిజినెస్‌లోకి రావాలని ప్లాన్ రూపొందిస్తోంది. లోన్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించుకోవాలని చూస్తోంది. గోల్డ్ ఫైనాన్స్, రిటైల్ లెండింగ్‌లో కూడా దూసుకుపోవాలని ప్రయత్నిస్తోంది. అందువల్ల కంపెనీ రానున్న కాలంలో కీలక ప్రకటనలు చేయొచ్చు.

కాగా స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టే వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భారీ రిస్క్ ఉంటుంది. పెట్టిన డబ్బులు కూడా తిరిగా రాకపోవచ్చు. అందుకే ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహాలు తీసుకోవాలి. అంతేకాకుండా దీర్ఘకాలం వరకు వేచి ఉండాల్సి వస్తుంది. అప్పుడు మంచి రాబడి పొందగలం. అందువల్ల మార్కెట్‌లో డబ్బులు పెట్టాలని భావించే వారు ఈ విషయాలు అన్నింటినీ గుర్తించుకోవాలి. తర్వాతనే ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవ్వాలి. రిస్క్ ఉంటుందని మాత్రం అస్సలు మర్చిపోవద్దు.

First published:

Tags: Money, Multibagger stock, Share Market Update, Stock Market

ఉత్తమ కథలు