Bank Savings Account: ఈ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఎక్కువ లాభం

Bank Savings Account: ఈ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఎక్కువ లాభం (ప్రతీకాత్మక చిత్రం)

Bank Savings Account Interest Rates | బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ ద్వారా దాచుకునే డబ్బులకు వడ్డీ వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ సేవింగ్స్ అకౌంట్‌లో ఉండే డబ్బుకు కూడా బ్యాంకు నుంచి వడ్డీ వస్తుంది.

  • Share this:
    మీకు ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉందా? సేవింగ్స్ అకౌంట్‌లో మీరు దాచుకునే డబ్బులకు వడ్డీ వస్తుందన్న విషయం తెలుసా? ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అసలు ఎంత వడ్డీ వస్తుందో కూడా తెలియదు. ఈ వడ్డీ 2.7 శాతం నుంచి మొదలవుతుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ అయితే ఎక్కువ వడ్డీ వస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ 6 శాతం నుంచి మొదలవుతుంది. కానీ కొన్ని బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్‌లోని డబ్బులకు కూడా 6-7 శాతం వడ్డీ చెల్లిస్తుంటాయి. పెద్ద బ్యాంకులు కాకుండా చిన్న బ్యాంకులే సేవింగ్స్ అకౌంట్‌పై ఎక్కువ వడ్డీ అందిస్తుంటాయి. మరి ఏఏ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్‌పై ఎక్కువ వడ్డీ వస్తుందో తెలుసుకోండి.

    Bandhan Bank: బంధన్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లోని డబ్బుకు 6 శాతం వడ్డీ ఇస్తుంది.

    IndusInd Bank: ఇండస్‌ఇండ్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో రూ.1,00,000 వరకు 4 శాతం, రూ.1,00,000 నుంచి రూ.10,00,000 వరకు 5 శాతం, రూ.10,00,000 కన్నా ఎక్కువ ఉంటే 6 శాతం వడ్డీ ఇస్తుంది.

    Sukanya Samriddhi Yojana: ఎస్‌బీఐలో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయండి ఇలా

    SBI ATM: ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయొచ్చు... కానీ ఈ విషయం మర్చిపోవద్దు

    Utkarsh Small Finance Bank: ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో రూ.1,00,000 వరకు ఉంటే 5 శాతం, రూ.1,00,000 నుంచి రూ.25,00,000 వరకు ఉంటే 6 శాతం, అంతకన్నా ఎక్కువ బ్యాలెన్స్‌పై 7.25 శాతం వడ్డీ ఇస్తోంది.

    AU Small Finance Bank savings: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో రూ.1,00,000 వరకు 4 శాతం, రూ.1,00,000 నుంచి రూ.5,00,000 వరకు 5 శాతం, రూ.5,00,000 నుంచి రూ.10,00,000 మధ్య ఉంటే 6 శాతం, అంతకన్నా ఎక్కువ ఉంటే 7 శాతం వడ్డీ ఇస్తుంది.

    Kotak Bank: కొటక్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌కు 6 శాతం వడ్డీ ఇస్తోంది.

    DBS digibank: డీబీఎస్ డిజీబ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌కు 7 శాతం వరకు వడ్డీ ఇస్తోంది.

    SBI Mutual Fund: నెలకు రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు... ఎస్‌బీఐ కొత్త మ్యూచువల్ ఫండ్‌తో లాభాలివే

    Gold Price: గోల్డ్ రేట్ ఢమాల్... రికార్డ్ ధర నుంచి రూ.9,000 పతనం

    Yes Bank: యెస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌కు 6 శాతం వరకు వడ్డీ ఇస్తోంది.

    Equitas Small Finance Bank: ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌కు 7.25 శాతం వరకు వడ్డీ ఇస్తోంది.

    Jana Small Finance Bank: జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌కు 7.25 శాతం వరకు వడ్డీ ఇస్తోంది.

    Lakshmi Vilas Bank: లక్ష్మీ విలాస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌కు 6.50 శాతం వరకు వడ్డీ ఇస్తోంది.

    RBL Bank: ఆర్‌బీఎల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌కు 6.75 శాతం వరకు వడ్డీ ఇస్తోంది.

    సేవింగ్స్ అకౌంట్‌లోని డబ్బుకు ఎక్కువ శాతం వడ్డీ ఇస్తున్నవి చిన్న బ్యాంకులు మాత్రమే. అయితే చిన్న బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడం, డిపాజిట్లు చేయడం వ్లల కాస్త రిస్కు ఉంటుంది. చిన్న బ్యాంకుల్లోనే సంక్షోభాలు ఎక్కువగా వస్తాయని అనేక ఘటనలు చూస్తే తెలుస్తుంది. అందుకే ఈ బ్యాంకుల్లో డబ్బులు దాచుకునేముందు ఓసారి బ్యాంకు ట్రాక్ రికార్డ్ పరిశీలించడం మంచిది. అయితే కస్టమర్లు బ్యాంకులో దాచుకునే డబ్బుకు ప్రభుత్వం నుంచి ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. గతంలో రూ.1,00,000 ఉన్న బీమాను 2020 బడ్జెట్‌లో రూ.5,00,000 లకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. అంటే మీరు రూ.5,00,000 వరకు డబ్బు దాచుకుంటే బీమా ఉంటుంది. కానీ అంతకన్నా ఎక్కువ దాచుకుంటే బీమా రూ.5,00,000 మాత్రమే లభిస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published: