బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే 6 శాతం లోపే వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు మాత్రమే కాస్త ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇక సేవింగ్స్ అకౌంట్ (Savings Account) విషయానికి వస్తే 3 శాతం లోపే వడ్డీ ఉంటుంది. కొన్ని బ్యాంకులు మాత్రమే 3 శాతం కన్నా ఎక్కువ వడ్డీ ఇస్తుంటాయి. ఇక కొన్ని ప్రైవేట్ బ్యాంకులైతే సేవింగ్స్ అకౌంట్లపై భారీ వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఏకంగా 6.75 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (Fixed Deposits) లభించే వడ్డీ కన్నా ఇది ఎక్కువ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల వడ్డీ రేట్లు పెంచడంతో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. ఆర్‌బీఐ వరుసగా రెండు నెలల్లో ఏకంగా 90 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ పెంచి 4.9 శాతానికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చిన్న ప్రైవేట్ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లపై 6.75 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. 2022 జూన్ 15 నాటికి ఏ బ్యాంకులో వడ్డీ ఎంతో BankBazaar సేకరించిన వివరాలివి.
DCB BANK: డీసీబీ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్‌పై 6.75 శాతం వడ్డీ ఇస్తోంది. ఇతర ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే డీసీబీ బ్యాంక్ ఎక్కువ వడ్డీ ఇస్తుండటం విశేషం. అకౌంట్‌ని బట్టి మినిమమ్ బ్యాలెన్స్ రూ.2,500 నుంచి రూ.5,000 మధ్య మెయింటైన్ చేయాలి.
Pension Scheme: మీ వయస్సు 40 ఏళ్ల లోపా? నెలకు రూ.5,000 పెన్షన్ కావాలా? ఈ స్కీమ్‌లో చేరండి
RBL Bank: ఆర్‌బీఎల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్‌పై 6 శాతం వడ్డీ ఇస్తోంది. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.2,500 నుంచి రూ.5,000 మధ్య మెయింటైన్ చేయాలి.
IDFC First Bank: ఐడీఎఫ్‌సీ బ్యాంక్ కూడా సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్‌పై 6 శాతం వడ్డీ ఇస్తోంది. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.10,000 మెయింటైన్ చేయాలి.
Bandhan Bank: బంధన్ బ్యాంక్ కూడా సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్‌పై 6 శాతం వడ్డీ ఇస్తోంది. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.5,000 మెయింటైన్ చేయాలి.
Yes Bank: యెస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్‌పై 5 శాతం వడ్డీ ఇస్తోంది. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.25,000 మెయింటైన్ చేయాలి.
Credit Cards: సినిమాలు ఎక్కువగా చూసేవారికి 5 క్రెడిట్ కార్డులు... మూవీ టికెట్స్ ఉచితం
చిన్న బ్యాంకులు, కొత్త ప్రైవేట్ బ్యాంకులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్‌పై ఎక్కువ వడ్డీ ఇస్తుంటాయి. ఈ వడ్డీ ప్రభుత్వ రంగ బ్యాంకులు, బడా ప్రైవేట్ బ్యాంకులు ఇచ్చే వడ్డీ కన్నా ఎక్కువ ఉంటుంది. అయితే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసేప్పుడు సేవింగ్స్ అకౌంట్‌పై ఇచ్చే వడ్డీని మాత్రమే పరిగణలోకి తీసుకోకూడదు. మంచి ట్రాక్ రికార్డ్, మంచి సర్వీస్ ప్రమాణాలు, బ్రాంచ్ నెట్వర్క్, ఏటీఎం సేవలు అందిస్తున్న బ్యాంకుల్లో మాత్రమే డబ్బులు దాచుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank account, BANK ACCOUNTS, Personal Finance, Reserve Bank of India, Saving account