news18-telugu
Updated: August 9, 2020, 11:10 PM IST
ప్రతీకాత్మకచిత్రం
లాక్ డౌన్ ప్రారంభరోజుల్లో హైదరాబాద్ రియాల్టీ మార్కెట్ అతలాకుతులం అయ్యింది. అయతే హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ మాత్రం మంచి మార్కెట్ ను సాధించాయి. నిజానికి కోవిడ్ -19 లాక్డౌన్ ద్వారా చాలా మంది కొనుగోలుదారులు కొత్త ఫ్లాట్ల కొనుగోలుకు దూరమయ్యారు. కానీ లగ్జరీ విల్లాస్ - 5 కోట్ల నుండి 12 కోట్ల రూపాయల ధరల రేంజు ఉన్న ప్రాపర్టీలు మాత్రం ఊపందుకున్నాయి. వీటిని ఎక్కువగా కొనుగోలు చేసిన వారిలో వైద్యులు, ఎన్నారైలు, వ్యాపారవేత్తలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. లాక్ డౌన్ పీరియడ్ లో మొత్తం నివాస అమ్మకాలు దశాబ్దపు కనిష్టానికి పడిపోయినట్లు రియల్టర్లు పేర్కొంటున్నారు. 2019 లో హైదరాబాద్ నగరంలో ఏప్రిల్ నుండి జూన్ వరకు 4,000 గృహాలు అమ్ముడుపోయాయి. అయితే తాజా మార్కెట్ నివేదికల ప్రకారం, ఇది 974 యూనిట్లకు పడిపోయింది. అయితే మరో వైపు ఏప్రిల్, జూన్ మధ్య హైదరాబాద్ సుమారు 100 ప్రీమియం లగ్జరీ యూనిట్లు అమ్ముడుపోయాయి. నగర శివార్లలోని గోపన్‌పల్లి, నార్సింగ్, గండిపేట - డ్యూప్లెక్స్ విల్లాస్ రూ. ఖర్చు: 10 కోట్ల నుంచి 12 కోట్లు.గా ఉంది. వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది.
ప్రసిద్ధ కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేసే ఒక సర్జన్ ఇలా అన్నారు. "నేను కొంతకాలం ఆస్తి కోసం వెతుకుతున్నాను. మహమ్మారితో, నగరం నుండి కొంచెం దూరంగా జీవించడం మంచిదని నేను గ్రహించాను. కాబట్టి, మేము G + 2 విల్లా కోసం వెతికామన్నారు. తన కుటుంబం త్వరలో నగర కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్సింగిలోని 6 కోట్ల రూపాయల కస్టమైజ్డ్-హోమ్‌లోకి మారుతున్నామని తెలిపారు. తమ విల్లా 5,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని తెలిపారు.
అలాగే అమెరికాకు చెందిన ఒక ఎన్నారై గత నెలలో మరో ఎనిమిది మందితో పాటు గోపన్‌పల్లిలో 9 కోట్ల రూపాయల ఆస్తిలో పెట్టుబడి పెట్టారు. ఆమె తిరిగి భారతదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ స్థిరపడాలని యోచిస్తోంది. "ఈ సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ విల్లాల్లో ప్రతిదానికి ఒక ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, పూర్తిస్థాయి కిచెన్, ఇతర టాప్-ఎండ్ ఫిచర్స్ ఉన్నాయి" అని లగ్జరీ ప్రాజెక్టు వ్యవహరిస్తున్న ప్రవీణ్ గునిగంటి అన్నారు. అలాగే ఆయన లగ్జరీ విల్లాలకు ప్రతిస్పందన చాలా బాగుందన్నారు. పైప్‌లైన్‌లో మాకు మరో మూడు ఒప్పందాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
మరోవైపు పెద్ద గృహాలకు డిమాండ్ పెరుగుతోందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ అధ్యక్షుడిగా ఉన్న హైదరాబాద్ రియల్టర్ సుమంత్ రెడ్డి అంగీకరిస్తున్నారు. వాటిని కొనుగోలు చేయగల కొనుగోలుదారులు, వారి కుటుంబాలు సురక్షితంగా సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు.
Published by:
Krishna Adithya
First published:
August 9, 2020, 11:10 PM IST