• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • SLOWDOWN FITCH CUTS INDIA GDP FORECAST FOR FY20 TO 4POINT9 ON WEAK DEMAND MK

GDP: భారత జీడీపీ వృద్ధి రేటు 4.9 శాతమే...అంచనాలు తగ్గించిన ఫిచ్‌

GDP: భారత జీడీపీ వృద్ధి రేటు 4.9 శాతమే...అంచనాలు తగ్గించిన ఫిచ్‌

ప్రతీకాత్మకచిత్రం

GDP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికవృద్ధి అంచనాను ఫిచ్ సొల్యూషన్స్ 4.9 శాతానికి తగ్గించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా బలహీనమైన దేశీయ డిమాండ్, సప్లయ్ చైన్ అంతరాయం, అలాగే మాన్యుఫాక్చరింగ్ రంగం ఒత్తిడి కారణంగా ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించినట్లు పేర్కొంది.

  • Share this:
    GDP: మార్చి31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికవృద్ధి అంచనాను ఫిచ్ సొల్యూషన్స్ 4.9 శాతానికి తగ్గించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా బలహీనమైన దేశీయ డిమాండ్, సప్లయ్ చైన్ అంతరాయం, అలాగే మాన్యుఫాక్చరింగ్ రంగం ఒత్తిడి కారణంగా ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించినట్లు పేర్కొంది. జీడీపీ వృద్ధి 2020-21లో (ఏప్రిల్ 2020 నుండి మార్చి 2021 వరకు) కొద్దిగా 5.4 శాతానికి కోలుకుంటుందని అంచనా వేసింది. ఫిచ్ సొల్యూషన్స్ ఏజెన్సి దేశానికి సంబంధించిన నిజమైన జిడిపి వృద్ధిని 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ 4.9 శాతానికి తగ్గించింది. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటును 5.4 శాతంగా అంచనాను సవరించింది. గతంలో దీన్ని 5.9 శాతంగా ఏజెన్సీ తెలిపింది.

    మూడవ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) దేశపు వాస్తవ జిడిపి వృద్ధి 4.7 శాతానికి క్షీణించగా, రెండవ త్రైమాసికంలో 5.1 శాతం పైకి సవరించారు, ఎందుకంటే ప్రభుత్వ వినియోగం మందగించడం, స్థూల స్థిర మూలధన సమీకరణలో మందగమనం, నికర ఎగుమతుల్లో క్షీణత నమోదు అయ్యింది. కాగా పారిశ్రామిక రంగానికి సహాయాన్ని అందించడంలో 2020-21 కేంద్ర బడ్జెట్ వైఫల్యం, అలాగే నాన్-బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీల పతనం, క్రెడిట్ డిమాండ్ తగ్గడంతో పాటు, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న పారిశ్రామిక రంగం కూడా జీడీపీ అంచనాలను తగ్గించడానికి కారణమైనట్లు ఫిచ్ తెలిపింది. వాహన, గృహ కొనుగోలు కోసం వినియోగదారులు రుణాలు పొందేందుకు కీలకమైన ఎన్‌బిఎఫ్‌సిలు తీవ్ర ఒత్తిడికి గురికావడం కూడా డిమాండ్ పై ప్రభావం చూపుతోంది.

    అలాగే చైనాలో కొనసాగుతున్న కోవిడ్ -19 వ్యాప్తితో ఆటోమోటివ్ మరియు ఎలక్ట్రానిక్స్ సరఫరా చెయిన్ అంతరాయం ఏర్పడింది. దీంతో విస్తృత సేవల రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. జూన్ నుండి వైరస్ వ్యాప్తి తగ్గితే వచ్చే ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధిలో తేలికపాటి పెరుగుదల ఉంటుందని ఫిచ్ అంచనా వేసింది. ఉత్పాదక (జిడిపిలో 14 శాతం) వృద్ధి సమీప కాలంలో బలహీనంగా ఉంటుందని మేము ఆశిస్తున్నామని క్యూ 2 లో తయారీ రంగంలో వృద్ధి క్యూ 3 లో 0.2 శాతానికి కొద్దిగా తగ్గిందని, ఇది క్యూ 2 లో 0.4 శాతం నుండి తగ్గిందని పేర్కొంది.

    అలాగే, మొత్తం వాహన అమ్మకాలలో నిరంతర తగ్గుదల, ఆటోమోటివ్ పరిశ్రమ దృక్పథం బలహీనంగా ఉందని సూచిస్తుంది, రాబోయే నెలల్లో మొత్తం వాహన డిమాండ్ బలహీనంగా ఉంటుందని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేసింది. మొత్తం జిడిపికి ఆటో పరిశ్రమ 7.5 శాతం వాటాగా ఉంది. అలాగే ఉత్పాదక జిడిపిలో సగం వాటా దీనిదే కావడం గమనార్హం. చైనాలో ప్రారంభమైన కోవిడ్ -19 కారణంగా సప్లై చైన్ అంతరాయాలు ఏర్పడి, ఆటో మొబైల్ విడి భాగాల కొరత కారణంగా ఆటోమోటివ్ మరియు ఎలక్ట్రానిక్స్ అంతటా తయారీ కార్యకలాపాలను తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉన్నట్లు తేలింది. చైనాలో కరోనావైరస్ వ్యాప్తి దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో వివిధ రకాల లాక్ డౌన్ లు అమలు అవుతోంది. జనవరిలో ఫ్యాక్టరీల్లో పని ఆగిపోవడం, ఎగుమతులు క్షీణించడం, కార్మికుల కొరత, ప్రపంచవ్యాప్తంగా సరఫరా మార్గాలను తీవ్రంగా దెబ్బతీసింది" అని ఇది తెలిపింది.

    భారతదేశం ఆటోమోటివ్ తయారీలో ఉపయోగించే ఆటోమోటివ్ భాగాలలో 10-30 శాతం మధ్య చైనా సరఫరా చేస్తుంది. భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి, టెలివిజన్లలో ఉపయోగించే భాగాల మొత్తం విలువలో 75 శాతం, స్మార్ట్‌ఫోన్‌లు, మొబైల్ డిస్ప్లేలు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, మెమరీ ఎల్‌ఇడి చిప్‌ల నుండి ఎయిర్ కండిషనర్ కంప్రెషర్‌, వాషింగ్ మెషీన్‌కు భాగాలను 85 శాతం చైనా నుంచి సరఫరా అవుతున్నాయి.
    Published by:Krishna Adithya
    First published: