Gold Price Today:  స్వల్పంగా పెరిగిన వెండి ధరలు.. మరి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు

తాజాగా బంగారం స్వల్పంగా పెరిగింది. అదే బాటలోనే వెండి (silver) పయనిస్తోంది. వెండి ధర పెరిగింది. కిలోపై రూ.350 నుంచి 500 వరకు పెరిగింది. మంగళవారం ఉదయం నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    బంగారం (gold), వెండి (silver) ధరల్లో మార్పులను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయనే సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే మళ్లీ హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా బంగారం స్వల్పంగా పెరిగింది. అదే బాటలోనే వెండి (silver) పయనిస్తోంది. వెండి ధర పెరిగింది. కిలోపై రూ.350 నుంచి 500 వరకు పెరిగింది. మంగళవారం ఉదయం నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

    10 గ్రాముల బంగారం ధర రూ.43,350

    ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం (22 carrots gold) ధర 10 గ్రాములపై రూ.150 పెరిగి రూ.43,200 నుంచి రూ.43,350 ధరకు చేరుకుంది. ఇక స్వచ్ఛమైన బంగారం (pure gold) అయిన 24 క్యారట్ గోల్డ్ ధర 10 గ్రాములపై రూ.160 పెరిగి రూ.47,130 నుంచి రూ.47,290 ధరకు చేరుకుంది. వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ.600 పెరగడంతో ధర రూ.64,100 నుంచి రూ.64,700 ధరకు చేరుకుంది. కొంతకాలంగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బంగారం, వెండి ధర కొద్దిగా పెరిగింది.

    కిలో వెండి రూ. 64,400

    దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో కిలో వెండి ధర రూ.60,250 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లో రూ.60,250 ఉంది. అలాగే చెన్నై (Chennai)లో కిలో వెండి ధర రూ.64,400 ఉండగా, కోల్‌కతాలో రూ.60,250 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.60,250 ఉండగా, కేరళ (Kerala)లో రూ.64,400 ఉంది. హైదరాబాద్‌ (Hyderabad)లో కిలో వెండి ధర రూ.64,400 ఉంది. విజయవాడ (Vijayawada)లో కిలో వెండి ధర రూ.64,400 ఉండగా, విశాఖపట్నంలో రూ.64,400 ఉంది. నాసిక్​, నాగ్​పూర్​లలో రూ.60,250గానే కిలో వెండి ధర ఉంది. అయితే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు (changes) చోటు చేసుకుంటూనే ఉంటాయి. వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకోవడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు.

    బంగారం ధర (gold rates)ల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇది కూడా చదవండి: మనీ ప్లాంట్​తో డెంగీ వచ్చే ప్రమాదం.. జాగ్రత్త పడకపోతే దోమలకు నిలయమే
    Published by:Prabhakar Vaddi
    First published: