Home /News /business /

SLIGHTLY INCREASED GOLD PRICES TODAY AND SILVER PRICES REMAIN STABLE DO YOU WANT TO KNOW WHAT ARE THE GOLD PRICES IN TELUGU STATES PRV

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగానే వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణం అయింది.

ఇంకా చదవండి ...
    పండుగ సీజన్​ కావడంతో బంగారం (Gold) కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధర (gold price)లో హెచ్చుతగ్గులకు కారణం అయింది. ఇక తాజాగా సోమవారం (అక్టోబర్‌ 4)న 10 గ్రాముల బంగారం ధర (gold price Today) రూ.10 పెరిగింది. ఇక వెండి (silver) ధరల్లో మార్పు లేదు (No change). ఇక దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

    హైదరాబాద్‌ (Hyderabad)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470 ఉంది. విజయవాడ (Vijayawada)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,360 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,470 ఉంది.

    ఇతర ప్రాంతాల్లో బంగారం ధరలు..

    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,560 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,720 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,980 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,870 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,490 ఉంది.

    కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,870 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,570 ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470 ఉంది.

    వెండి ధరలు చూస్తే..

    హైదరాబాద్‌లో కిలో వెండి (silver)  ధర రూ.64,600 ఉండగా, విజయవాడలో రూ. 64,600 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.60,500 ఉండగా, చెన్నైలో రూ.64,600 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.60,500 ఉండగా, కోల్‌కతాలో రూ.60,500 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.60,500 ఉండగా, కేరళలో రూ.64,600 ఉంది

    బంగారం ధర (gold rates)ల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు (gold price) పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Gold price, Silver price

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు