హోమ్ /వార్తలు /బిజినెస్ /

Slice Credit Card: మార్కెట్లోకి కొత్త క్రెడిట్ కార్డ్... బెనిఫిట్స్ ఇవే

Slice Credit Card: మార్కెట్లోకి కొత్త క్రెడిట్ కార్డ్... బెనిఫిట్స్ ఇవే

Slice Credit Card: మార్కెట్లోకి కొత్త క్రెడిట్ కార్డ్... బెనిఫిట్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Slice Credit Card: మార్కెట్లోకి కొత్త క్రెడిట్ కార్డ్... బెనిఫిట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Slice Credit Card | మార్కెట్లోకి మరో కొత్త క్రెడిట్ కార్డ్ వచ్చింది. స్లైస్ క్రెడిట్ కార్డ్ ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఈ క్రెడిట్ కార్డ్ వివరాలు తెలుసుకోండి.

డిజిటల్‌ ఇండియా పథకం మొదలైనప్పుడే మన దేశంలో క్రెడిట్‌ కార్డులు, వ్యాలెట్‌ల వినియోగం బాగా పెరిగింది. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ వల్ల డిజిటల్‌ క్యాష్‌ పేమెంట్స్‌లో పెరుగుదల కనిపించిందట. ఇళ్లల్లో ఉండి అవసరమైన సరుకులు కొనుగోలు చేయడం లాంటి పనుల కోసం క్రెడిట్‌ కార్డులు, వ్యాలెట్‌లు ఎక్కువగా వాడుతున్నారు. తొలి రోజుల్లో క్రెడిట్‌ కార్డులు అంటే బ్యాంకులు మాత్రమే ఇచ్చేవి. దీని కోసం పెద్ద ప్రాసెసే ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. అంతా యాప్‌లోనే అయిపోతోంది. కార్డు పార్సిల్‌లో ఇంటికొచ్చేస్తోంది. అలాంటి సర్వీసుల్లో స్లైస్‌ ఒకటి. ఇది మామూలు క్రెడిట్‌ కార్డులకు సమానంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం, క్రెడిట్ కార్డు కంటే ఎక్కువ ఫీచర్లతో ఇది ఆకట్టుకుంటోంది.

ఈ క్రెడిట్‌ కార్డు కావాలంటే... స్లైస్‌ యాప్‌ను మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. యాప్‌ సూచించిన ప్రకారం అవసరమైన వ్యక్తిగత వివరాలు, పాన్‌ కార్డు లాంటి ఇతర సమాచారం ఇవ్వాలి. తర్వాత నిర్దేశిత పేజీలో సెల్ఫీ దిగితే... మొత్తం మీ పాన్‌ కార్డు వివరాలను విశ్లేషించి మీకు క్రెడిట్‌ లిమిట్‌ కేటాయిస్తారు. అలా వచ్చిన లిమిట్‌ అమౌంట్‌తో సాధారణ క్రెడిట్‌ కార్డు తరహాలోనే స్లైస్‌ క్రెడిట్‌ కార్డును వాడుకోవచ్చు. అయితే ఇందులో వచ్చే క్యాష్‌ బ్యాక్‌ మిగలిన కార్డులతో పోలిస్తే వేగంగా వస్తాయని సంస్థ చెబుతోంది.

Bank Account: ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? జూలై 1 నుంచి కొత్త రూల్స్

ATM Withdrawal Rules: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? ఈ 4 రూల్స్ గుర్తుంచుకోండి

ప్రస్తుతం స్లైస్‌ కార్డు వినియోగదారులకు అందుబాటులో క్యాష్ బ్యాక్‌, ఆఫర్లు చూస్తే... లింక్డ్‌ఇన్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ (₹800 కంటే ఎక్కువ) ఈ కార్డుతో తీసుకుంటే దానిపై ₹100 క్యాష్ బ్యాక్‌ ఇస్తారు. ఐఆర్‌సీటీసీ యాప్‌లో చేసే ₹500కుపైబడిన కొనుగోళ్లపై ఫ్లాట్‌ ₹75ల ఇన్‌స్టంట్‌ క్యాష్ బ్యాక్‌ ఉంటుంది. ఫోన్‌పేలో స్లైస్‌ కార్డులో చేసే కొనుగోళ్లపై ₹50 క్యాష్‌ బ్యాక్‌ ఇస్తున్నారు. అయితే కనీసం ₹400 కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లోనూ ₹250 క్యాష్‌ బ్యాక్‌ ఉంది. అయితే ఇది ₹1500 అంతకంటే ఎక్కువ కొనుగోళ్లకే వర్తిస్తుంది.

SBI New Charges: జూలై 1 నుంచి ఎస్‌బీఐ కస్టమర్లకు కొత్త ఛార్జీలు

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్... ఈపీఎఫ్ఓ తీసుకున్న 5 కీలక నిర్ణయాలు ఇవే


స్లైస్‌లో ఇచ్చే ఆఫర్ల గురించి తెలియజేయడానికి సంస్థ స్పార్క్‌ అనే ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ముఖ్యంగా యువతకు సంబంధించిన ఆఫర్ల వివరాలను వెల్లడిస్తారు. ఇందులో కొనుగోలు చేసే యువతకు ఎక్కువ మొత్తంలో లాభం చేకూర్చేలా చూస్తున్నాం అని స్లైస్‌ చెబుతోంది. స్లైస్‌ యాప్‌లో ఆఫర్ల రెడీమ్‌ చాలా సులభంగా ఉంటుంది. డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ ఫీచర్‌ ద్వారా సులభంగా రెడీమ్‌ చేసుకోవచ్చు.

First published:

Tags: Credit cards, Personal Finance

ఉత్తమ కథలు