Skoda Auto India: కొత్త క్యాంపెయిన్​ను ప్రారంభించిన స్కోడా.. భారత్​లో సేవల విస్తరణ లక్ష్యంగా ప్రణాళికలు

ప్రతీకాత్మకచిత్రం

చెక్ రిపబ్లిక్​ కార్​ బ్రాండ్ స్కోడా ఇండియా కొత్త క్యాంపెయిన్​ను ప్రారంభించింది. కాస్ట్​ ఆఫ్​ ఓనర్​షిప్​, కస్టమర్​ రీచ్​, కన్వెన్స్ ఆఫ్​ ట్రాన్స్​పరెన్సీ కోసం 'పీస్ ఆఫ్ మైండ్' అనే కొత్త క్యాంపెయిన్​ను మొదలుపెట్టింది.

  • Share this:
చెక్ రిపబ్లిక్​ కార్​ బ్రాండ్ స్కోడా ఇండియా కొత్త క్యాంపెయిన్​ను ప్రారంభించింది. కాస్ట్​ ఆఫ్​ ఓనర్​షిప్​, కస్టమర్​ రీచ్​, కన్వెన్స్ ఆఫ్​ ట్రాన్స్​పరెన్సీ కోసం 'పీస్ ఆఫ్ మైండ్' అనే కొత్త క్యాంపెయిన్​ను మొదలుపెట్టింది. ఈ క్యాంపెయిన్​లో భాగంగా కస్టమర్లకు తక్కువ ఖర్చుతో కూడిన మెయింటెనెన్స్, ఇతర సేవలు అందించేందుకు కంపెనీ చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తుంది. ఈ క్యాంపెయిన్​ ద్వారా తన వినియోగదారులకు అద్భుతమైన యాజమాన్య అనుభవాన్ని అందించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇంజిన్​ ఆయిల్ ధరలు తగ్గడం, స్పేర్​ పార్ట్స్​ ధరల్లో మార్పులు చోటుచేసుకోవడంతో గత ఐదేళ్లలో కారు మెయింటెనెన్స్ ఛార్జీలు 21 శాతం తగ్గాయని పేర్కొంది.

రాబోయే కొద్ది నెలల్లో భారత్​లో తమ సేవలను విస్తరించేందుకు స్కోడా ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా భారత్​లోని టైర్​ 2, టూర్​ 3 నగరాలకు సైతం తమ నెట్​వర్క్​ను విస్తరించాలని యోచిస్తోంది. ఇందుకోసం ఇండియా 2.0 స్ట్రాటజీ కింద 185 కొత్త టచ్​ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. తద్వారా భారత్​లో మరింత వేగంగా తమ సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

దీనిపై స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ మాట్లాడుతూ, “మా కస్టమర్లకు కార్​ మెయింటెనెన్స్​ ఖర్చులను తగ్గించేందుకు, క్లాస్-లీడింగ్ వారెంటీని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తద్వారా కస్టమర్లలో మా ఉత్పత్తులు, సేవలపై మరింత విశ్వాసం పెరుగుతుంది. ఇటీవల మేం లాంచ్​ చేసిన కుషాక్‌ మోడల్​కు భారత మార్కెట్​లో అద్భుతమైన రెస్పాన్స్​ వస్తోంది. భవిష్యత్తులోనూ ఇదే జోరును కొనసాగిస్తాం. మా వినియోగదారులకు ఉత్తమ యాజమాన్య అనుభవాన్ని అందించడానికి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం" అని అన్నారు.

ఆ మోడల్‌కు మంచి రెస్పాన్స్
కాగా, గత నెలలో స్కోడా రూపొందించిన ఇండియా 2.0 స్ట్రాటజీలో భాగంగా తన మొట్టమొదటి మిడ్-సైజ్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన కుషాక్‌ ఎస్​యూవీని విడుదల చేసింది. వేరియంట్​ను బట్టి ఈ కారు ధర రూ. 10.49 లక్షల నుంచి రూ. 17.59 లక్షల మధ్య లభిస్తుంది. ఈ ఏడాది చివరిలోపు 30 వేలు, వచ్చే ఏడాదిలో 60 వేల యూనిట్ల అమ్మకాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు జాక్​ హోలిస్​ తెలిపారు.
Published by:Krishna Adithya
First published: