Skoda Octavia RS245: ఈ కారుపై ఏకంగా రూ.8 లక్షల వరకు తగ్గింపు

Skoda Octavia RS245: ఈ కారుపై ఏకంగా రూ.8 లక్షల వరకు తగ్గింపు (Image source: Skoda)

Skoda Octavia RS245 | కొత్త కారు కొనాలనుకుంటున్నారా? స్కోడా కంపెనీ ఆక్టేవియా ఆర్ఎస్245 మోడల్‌పై ఏకంగా రూ.8 లక్షల డిస్కౌంట్ ప్రకటించింది.

  • Share this:
ప్రముఖ ప్రీమియం వాహన తయారీ సంస్థ స్కోడా... గతేడాది జరిగిన 2020 ఆటో ఎక్స్​పోలో తమ ఆక్టేవియా RS245 పెర్ఫార్మెన్స్​ కారును విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రారంభంలో కేవలం 200 యూనిట్లను మాత్రమే భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. అయితే, కరోనా కారణంగా ఈ కార్ల ఆర్డర్లు రద్దయ్యాయి. దీంతో, ఇవి ఆయా డీలర్​షిప్​ సెంటర్లలోనే మిగిలిపోయాయి. ఈ స్టాక్​ క్లియర్​ చేసుకునేందుకు ఇప్పుడు భారీ ఆఫర్​ను ప్రకటించింది స్కోడా కంపెనీ. ఆక్టేవియా ఆర్‌ఎస్‌ 245 వేరియంట్​పై రూ.8 లక్షల వరకు డిస్కౌంట్​ను ప్రకటించింది.

స్కోడా ఆక్టేవియా RS245 ఫీచర్లు


స్కోడా ఆక్టేవియా నుంచి వచ్చిన రెండో మోడల్​ ఆక్టావియా RS245. ఈ మోడల్​ 2017లో విడుదలైన RS230కు కొనసాగింపుగా భారత మార్కెట్​లోకి విడుదలైంది. అయితే, 2017 మోడల్‌తో పోలిస్తే, కొత్త RS245 వేరియంట్​లో అనేక మార్పులు చేసింది. దీనిలో పెద్ద చక్రాలు, అప్​గ్రేడ్​ ఇంజిన్​ను చేర్చింది. ఇది- 370Nm వద్ద 245 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కొత్త వేరియంట్​లో డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్, ఎలక్ట్రికల్లీ కంట్రోల్డ్​ లిమిటెడ్​ స్లిప్ డిఫరెన్షియల్​ని వంటి ఫీచర్లను కూడా అందించింది. దీనిలోని ట్రాక్షన్‌ ముందు చక్రాలకు 100 శాతం శక్తిని ప్రసారం చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ల కారణంగా 2017లో విడుదలైన RS230తో పోలిస్తే కొత్త ఆక్టేవియా RS245 మోడల్​ రూ .11 లక్షల అధిక ధరతో మార్కెట్​లోకి విడుదలైంది. ప్రస్తుతం స్కోడా ఆక్టేవియా RS 245 రూ.35.99 లక్షల (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది.

SBI offer: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? ఈ 5 ఆఫర్స్ పొందడానికి ఇంకొన్ని గంటలే గడువు

Air Cooler: కూలర్ కొంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే

రూ.8 లక్షల డిస్కౌంట్​


గత సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెట్టిన RS245.. లగ్జరీ సెడాన్​ కారుగా ప్రసిద్ధికెక్కింది. ఈ కారు లగ్జరీ సెడాన్​ విభాగంలోని మెర్సిడెస్​ బెంజ్​, బిఎమ్​డబ్ల్యూ వంటి ప్రీమియం బ్రాండ్స్​కు చెందిన ఎంట్రీ లెవరల్​ కార్లుకు పోటీగా మార్కెటోకి విడుదలైంది. అయితే, తొలుత భారత మార్కెట్​లోకి ఈ కార్లను కేవలం 200 యూనిట్లనే విడుదల చేసింది. అయితే, ఈ 200 యూనిట్లు 2020 ఏప్రిల్ నుండి అమ్మకానికి సిద్ధంగా ఉండగా, కరోనా మహమ్మారి కారణంగా కస్టమర్ల నుండి ఆర్డర్ రద్దు చేయబడ్డాయి. దీంతో ఆయా డీలర్​షిప్​లలో కార్లు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడం, దేశంలో లాక్‌డౌన్​ ఆంక్షలను ఎత్తివేయడంతో తమ డీలర్​షిప్​ సెంటర్లలో ఉన్న అమ్ముడుపోని ఈ కార్లపై రూ. 8 లక్షల విలువైన డిస్కౌంట్, ప్రయోజనాలను అందిస్తుంది. తద్వారా, స్టాక్​ క్లియర్ చేసుకోవాలని చూస్తోంది.

Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజాలో ఈ 18 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

Evaru Meelo Koteeswarulu: 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షోకి రిజిస్ట్రేషన్ కోసం ఈ స్టెప్స్ ఫాలో అవండి

త్వరలోనే న్యూ స్కోడా ఆక్టేవియా


ఆక్టేవియా ఆర్‌ఎస్ 245 స్టాక్​ క్లియర్​ చేసి.. ఈ నెలలోనే తమ కొత్త వేరియంట్​ నెక్స్ట్-జెన్ ఆక్టేవియాను భారత మార్కెట్​లోకి విడుదల చేయాలని స్కోడా యోచిస్తోంది. ఈ కారు పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది190 హెచ్‌పి, 2.0- లీటర్ టర్బో-పెట్రోల్ మిల్​,7 -స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. న్యూ ఆక్టేవియా ధరలు రూ .18- నుండి 24 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్-జెన్ ఎగ్జిక్యూటివ్ సెడాన్ మోడల్​ హ్యుందాయ్ ఎలంట్రాకు గట్టి పోటీగా నిలువనుంది.
Published by:Santhosh Kumar S
First published: