హోమ్ /వార్తలు /బిజినెస్ /

Money: ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే ఈ 6 మార్గాల్లో డబ్బు సంపాదించండి!

Money: ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే ఈ 6 మార్గాల్లో డబ్బు సంపాదించండి!

 ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే ఈ 6 మార్గాల్లో డబ్బు సంపాదించొచ్చు!

ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే ఈ 6 మార్గాల్లో డబ్బు సంపాదించొచ్చు!

Work From Home Jobs | ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండానే డబ్బులు సంపాదించాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఆరు ఉత్తమమైన మార్గాలు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Income | డబ్బు సంపాదించాలని భావిస్తున్నారా? అదనపు ఆదాయం పొందాలని చూస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటి వద్ద నుంచే అదనపు ఆదాయం పొందొచ్చు. దీని కోసం ఏ ఏ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. వీడియోలు రూపొందించి వాటి ద్వారా డబ్బు పొందొచ్చు. ఎన్నో రకాల వీడియోలు చేయొచ్చు. టిప్స్ అండ్ ట్రిక్స్, కుకింగ్, డ్యాన్స్, సింగింగ్, గేమింగ్, ఫుడ్ రివ్యూస్, ప్రొడక్టులు ఇలా చాలా వాటిపై వీడియోలు రూపొందించి, వీటిని యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. ఇలా ప్రతి నెలా ఆదాయం సొంతం చేసుకోవచ్చు.

శుభవార్త.. భారీగా తగ్గిన ఈ 11 నిత్యావసర వస్తువుల ధరలు!

అలాగే ఫ్రీల్యాన్సింగ్ కూడా చేయొచ్చు. కంటెంట్ రైటర్, వీడియో ఎడిటర్, డెవలపర్, గ్రాఫిక్ డిజైనర్ వంటి స్కిల్స్ ఉంటే ఫ్రీల్యానింగ్ చేయడం ద్వారా డబ్బులు పొందొచ్చు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండానే ప్రతి నెలా ఆదాయం లభిస్తుంది. ఎయిర్‌బీఎన్‌బీ హోస్టింగ్ ద్వారా డబ్బులు పొందొచ్చు. మీ ఇంట్లో ఖాళీ రూమ్స్ ఉంటే.. వీటిని ఎయిర్‌బీఎన్‌బీలో లిస్ట్ చేయొచ్చు. ట్రావెలర్స్ మీ రూమ్స్‌ను బుక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి.

ఇప్పుడు కొనండి.. వచ్చే ఏడాది నుంచి ఈఎంఐ కట్టండి! కంపెనీ అదిరే ఆఫర్

అలాగే ట్యూటరింగ్ ద్వారా కూడా డబ్బులు పొందొచ్చు. మీకు టీచింగ్ ఇష్టం అయితే ఈ పని చేయొచ్చు. ఒక సబ్జెక్ట్ లేదా ఇతర వాటిని టీచింగ్ చేయడం వల్ల ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ఎలా అయినా మీరు ఈ పని చేయొచ్చు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ క్లాస్‌లకు డిమాండ్ బాగా పెరిగింది. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. మంచి కంటెంట్ క్రియేటర్ అయ్యి ఉండి, వస్తువును విక్రయించడం తెలిస్తే.. పలు ఈకామర్స్ సైట్లు లేదా బ్రాండ్లకు పని చేస్తూ డబ్బులు పొందొచ్చు.

ఆన్‌లైన్ సపోర్ట్, కౌన్సిలింగ్ ద్వారా డబ్బులు పొందే వెసులుబాటు ఉంది. మెంటల్, రిలేషన్‌షిప్, లైఫ్ సంబంధిత సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. వీరికి కౌన్సిలింగ్ వంటివి ఇవ్వడం ద్వారా ఆదాయం పొందొచ్చు. మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఈ పని చేయొచ్చు. ఇలా ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండానే డబ్బులు సంపాదించొచ్చు. అయితే ఏ మార్గంలో అయినా డబ్బులు సంపాదించాలంటే ముందుగా అన్ని వివరాలను తెలుసుకోండి. లాభనష్టాలను బేరీజు వేసుకోండి. తర్వాతనే ఏ పని అయినా ప్రారంభించండి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

First published:

Tags: Earn money, Earn money online, Income, Money, Online

ఉత్తమ కథలు