Home /News /business /

SIX CREDIT CARDS THAT CAN BE USED TO REDUCE YOUR GROCERY BILLS DETAILS HERE GH VB

Credit Cards: ప్రతినెలా Grocery కొనుగోలు చేస్తున్నారా..? మీ బిల్స్ ఆదా చేసే ఆరు క్రెడిట్‌ కార్డులు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ్రాసరీ షాపింగ్‌కి మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్‌ క్రెడిట్‌ కార్డులపై Paisabazaar సంస్థ రీసెర్చ్ చేసింది. ఆ సంస్థ చేసిన సూచనల ఆధారంగా మీకు సరిపోయే క్రెడిట్‌ కార్డును ఎంచుకోండి.

ప్రతి కుటుంబానికి గ్రాసరీ (Grocery) ఖర్చులు సాధారణం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ కారణాలతో ఇంటి సరుకుల కొనుగోలుకు అయ్యే ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ కొన్ని పద్ధతుల్లో నెలలో గ్రాసరీపై(Grocery) చేస్తున్న ఖర్చును తగ్గించుకోవచ్చు. గ్రాసరీ బిల్లులను చెల్లించడానికి మీరు సరైన క్రెడిట్‌ కార్డును(Credit Cards) వాడితే మనీ ఆదా అవుతుంది. ఇలాంటి వాటి కోసం ఆయా బ్యాంకులు స్పెషల్(Special) క్రెడిట్‌ కార్డులను అందిస్తున్నాయి. వీటితో స్పెషల్ డిస్కౌంట్లు(Discounts), ఆఫర్లు(Offers) అందిస్తున్నాయి. ఆఫ్‌లైన్‌ అయినా, ఆన్‌లైన్‌లో కొన్న గ్రాసరీస్‌కి అయినా మీరు ఈ క్రెడిట్‌ కార్డులను వినియోగించి బిల్లు చెల్లిస్తే మీ డబ్బు మిగులుతుంది.

మీకు ఏ బ్యాంకు అందిస్తున్న క్రెడిట్‌ కార్డు వినియోగిస్తే మేలు జరుగుతుందో, మీకు ఏ కార్డు సరిపోతుందో తెలుసుకోండి. గ్రాసరీ షాపింగ్‌కి మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్‌ క్రెడిట్‌ కార్డులపై Paisabazaar సంస్థ రీసెర్చ్ చేసింది. ఆ సంస్థ చేసిన సూచనల ఆధారంగా మీకు సరిపోయే క్రెడిట్‌ కార్డును ఎంచుకోండి.

MINI Cooper SE Electric: ఫుల్ ఛార్జ్ చేస్తేహైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లొచ్చు... మినీ కూపర్ ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది

ICICI Bank
ఐసీఐసీఐ బ్యాంకు Amazon Pay ICICI క్రెడిట్‌ కార్డు అందిస్తోంది. అమెజాన్‌ వెబ్‌సైట్‌లో గ్రాసరీ కొనే అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు 5 పర్సెంట్ డిస్కౌంట్‌ అందిస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లు కాని వారికి 3 పర్సెంట్ డిస్కౌంట్‌ లభిస్తుంది. అమెజాన్‌ వెబ్‌సైట్‌తో భాగస్వామ్యం ఉన్న వందకు పైగా వ్యాపార సంస్థలకు చెందిన వస్తువుల కొనుగోళ్లపై 2 పర్సెంట్ డిస్కౌంట్‌ ఉంది. ఇతర వస్తువులు కొన్నప్పుడు వినియోగదారులకు 1 పర్సెంట్ డిస్కౌంట్‌ అందిస్తోంది. ఇది లైఫ్‌ టైమ్‌ ఫ్రీ క్రెడిట్‌ కార్డు.

Axis Bank
యాక్సిక్‌ బ్యాంకు గ్రాసరీ షాపింగ్‌ కోసం Flipkart Axis Bank క్రెడిట్‌ కార్డును అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌, మింత్రలో కొన్నవాటిపై 5 పర్సెంట్‌ డిస్కౌంట్‌ అందుతుంది. క్లియర్‌ట్రిప్‌, పీవీఆర్‌, స్విగ్గీ, ఉబర్‌ వంటి వాటిపై 4 పర్సెంట్, ఇతర అన్ని కొనుగోళ్లపై 1.5 పర్సెంట్ క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. అదే విధంగా ఏడాదిలో ఒకసారి నాలుగు సార్లు ఉచితంగా రెస్టారంట్లకు వెళ్లవచ్చు. ఇండియాలోని 20 శాతానికి పైగా రెస్టారెంట్లలో ఈ అవకాశం ఉంది. ఈ కార్డుకు ఏడాదికి రూ.500 చెల్లించాలి.

RBI Warning: అలర్ట్... ఆ యాప్ వాడొద్దు... హెచ్చరిస్తున్న ఆర్‌బీఐ

 Standard Chartered Bank
స్టాండర్డ్‌ ఛార్టర్డ్ బ్యాంకు Standard Chartered DigiSmart క్రెడిట్‌ కార్డు అందిస్తోంది. గ్రోఫర్స్‌(ప్రస్తుతం Blinkit)లో, నెలకు ఐదుస్లార్లు జొమాటోలో 10 పర్సెంట్ డిస్కౌంట్‌ ఉంటుంది. మింత్రలో నెలకు ఒకసారి 20 పర్సెంట్ డిస్కౌంట్‌ దక్కుతుంది. యాత్ర వెబ్‌సైట్‌ ద్వారా డొమెస్టిట్‌ ఫ్లైట్‌ టిక్కెట్టు బుక్‌ చేస్తే 20 పర్సెంట్, ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌ బుక్‌ చేసుకొంటే 10 పర్సెంట్ డిస్కౌంట్‌ ఉంటుంది. మూడు నెలలకు ఒకసారి, అందులోనూ రూ.10 వేలకు పైగా ఉన్న ట్రాన్సాక్షన్స్‌పై ఈ డిస్కౌంట్‌ లభిస్తుంది. రూ.4 వేలకు మించి ఇండియాలోని హోటల్‌ బుక్‌ చేసుకొంటే మూడు నెలలకు ఓ సారి 25 పర్సెంట్ డిస్కౌంట్‌ యాత్ర నుంచి అందుతుంది. ఏడాదికి ఈ క్రెడిట్‌ కార్డుకు రూ.588 చెల్లించాలి.

ఇదే బ్యాంకు Standard Chartered Manhattan క్రెడిట్‌ కార్డుతో రూ.2 వేలకు పైగా వస్తువులు కొంటే సూపర్‌మార్కెట్లలో 5 పర్సెంట్, బిగ్‌బాస్కెట్‌లో రూ.150 డిస్కౌంట్‌ ఉంటుంది. అన్ని ట్రాన్సాక్షన్లపై 3 రెట్లు రివార్డు పాయింట్లు లభిస్తాయి. సంవత్సరానికి రూ.999 రూపాయలు కార్డుకు చెల్లించాలి.

SBI
ఎస్‌బీఐ బ్యాంకు అందిస్తున్న SBI Prime క్రెడిట్‌ కార్డు తీసుకొన్న వారికి ప్రారంభంలోనే రూ.3 వేల విలువైన ఈ-గిఫ్ట్‌ వోచర్లు లభిస్తాయి. డైనింగ్‌, గ్రాసరీ, డిపార్టమెంటల్‌ స్టోర్లు, సినిమా టిక్కెట్ల బుకింగ్‌ వంటి రూ.100 దాటిన ప్రతి ట్రాన్సాక్షనుకు 10 రివార్డు పాయింట్లు లభిస్తాయి. 8 ఇండియా, 4 విదేశాల్లోని ఎయిర్‌పోర్టులలో కాంప్లిమెంటరీ లాంజ్‌ యాక్సెస్‌ అందిస్తోంది. ఏడాదికి రూ.3 లక్షల విలువైన ట్రాన్సాక్షన్లు చేస్తే రెన్యువల్‌ ఫీజు ఉండదు. ఏడాదికి ఈ కార్డుకు రూ.2,999 చెల్లించాలి.

T+1 Settlement: రేపటి నుంచి షేర్ల ట్రేడింగ్​లో టీ+1 విధానం అమలు.. షేర్లు కొన్న 24 గంటల్లోనే డీమ్యాట్​ ఖాతాలో జమ..


Axis Bank
Axis Bank Select క్రెడిట్‌ కార్డుతో బిగ్‌బాస్కెట్‌లో రూ.2 వేలకు మించి వస్తువుల కొన్నప్పుడు 20 పర్సెంట్(నెలకు మ్యాక్సిమమ్‌ రూ.500) డిస్కౌంట్‌ ఉంది. స్విగ్గీలో నెలకు రెండు సార్లు అదీ రూ.400 మించిన ఆర్డరుపై 40 పర్సెంట్(రూ.200 మించకుండా) అందుతుంది. కార్డు తీసుకొన్న 90 రోజుల్లో మొదటి ట్రాన్సాక్షన్‌ చేస్తే రూ.2 వేల అమెజాన్‌ వోచర్‌, రూ.200 విలువై రిటైల్‌ షాపింగ్‌కు 2 రెట్లు రివార్డు పాయింట్లు, ఇండియాలోని ఒప్పంద రెస్టారెంట్లలో 20 పర్సెంట్ డిస్కౌంట్‌ లభిస్తుంది. ప్రతి ఏడాది 6 ఇంటర్నేషనల్‌ లాంజ్‌ కాంప్లిమెంటరీ యాక్సెస్‌ అందిస్తోంది. ఏడాదికి కార్డుకు రూ.3 వేలు చెల్లించాలి.

క్రెడిట్‌ కార్డు తీసుకొన్న తర్వాత సక్రమంగా వినియోగించడంపై దృష్టి పెట్టాలి. రివార్డు పాయింట్లు, యాన్యువల్‌ ఫీజు మినహాయింపు కోసం ఎక్కువగా కార్డును వినియోగించకూడదు. తిరిగి బిల్లు కట్టలేని సమయంలో దాదాపు 28 నుంచి 49 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
Published by:Veera Babu
First published:

Tags: Credit cards, Grocery, Online shopping

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు