హోమ్ /వార్తలు /బిజినెస్ /

Airbags: కార్లలో 6 ఎయిర్ బ్యాగ్స్.. కేంద్రం కీలక నిర్ణయం!

Airbags: కార్లలో 6 ఎయిర్ బ్యాగ్స్.. కేంద్రం కీలక నిర్ణయం!

 కారు కొనాలనుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్.. కొత్త రూల్స్!

కారు కొనాలనుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్.. కొత్త రూల్స్!

Cars | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కారులో ఎయిర్ బ్యాగ్స్‌ తప్పనిసరి అంశంపై కీలక ప్రకటన చేసింది. ఆరు ఎయిర్ బ్యాగ్స్ నిర్ణయాన్ని వచ్చే ఏడాది నుంచి అమలులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. సాాధారణంగా ఈ రూల్ అక్టోబర్ 1 నుంచి అమలులోకి రావాల్సి ఉంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Nitin Gadkari | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్యాసింజర్ కార్లకు (Cars) ఆరు ఎయిర్ బ్యాగ్స్ (Airbags) తప్పనిసరి నిబంధన అమలును మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. 2023 అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సాధారణంగా ఈ రూల్ ఈ అక్టోబర్ 1 నుంచే అమలులోకి రావాల్సి ఉంది. అయితే దీన్ని ఏడాది పాటు పొడిగించారు.

  కారు ధర, వేరియంట్‌తో సంబంధం లేకుండా వాహనాలలో ప్రయాణించే ప్యాసింజర్ల అందరి భద్రతకే అధిక ప్రధాన్యం ఇస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం ఆటో పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిమితులు, గ్లోబల్ సరఫరా అడ్డంకులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ప్యాసింజర్ కార్లలో (ఎం-1 కేటగిరీ) కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌ల తప్పనిసరి ప్రతిపాదనను 2023 అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.

  భారీగా పడిపోయిన వెండి.. బంగారం ధర ఇలా!

  కేంద్ర ప్రభుత్వం 2022 జనవరి 14న ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఎం1 కేటగిరి వాహనాలకు 2022 అక్టోబర్ 1 నుంచి ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి అని పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ రూల్‌ను మరో ఏడాది పాటు పొడిగించింది. కేంద్ర ప్రభుత్వపు ఈ నిర్ణయం వల్ల కార్ల ధరలు పైకి కదిలే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

  కస్టమర్లకు ఎయిర్‌టెల్ షాక్? వొడాఫోన్ ఐడియా యూజర్లకు బ్యాడ్ న్యూస్?

  ఇకపోతే చాలా కార్ల కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేసే కార్లలో కచ్చితంగా ఆరు ఎయిర్ బ్యాగ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే దేశంలో విక్రయించే వాటికి మాత్రం ఈ రూల్‌ను అనుసరించడం లేదు. మధ్యతరగతి ప్రజలు, అందుబాటు ధర వంటి అంశాలు ఇందుకు కారణం కావొచ్చు. దీనిపై నితిన్ గడ్కరీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకని కంపెనీలు ప్రజల ప్రాణాలను పట్టించుకోవడం లేదన్నారు. అయితే వచ్చే ఏడాదిలో మాత్రం అన్న కార్లలోనూ ఆరు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. కాగా ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్ట్రీ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఎయిర్ బ్యాగ్స్ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Airbags, Cars, Nitin Gadkari

  ఉత్తమ కథలు