హోమ్ /వార్తలు /బిజినెస్ /

Six airbags for cars: వాహనదారులకు అలర్ట్.. ఇక అన్ని కార్లలో 6 ఎయిర్ బ్యాగ్ లు.. కేంద్రం కీలక నిర్ణయం

Six airbags for cars: వాహనదారులకు అలర్ట్.. ఇక అన్ని కార్లలో 6 ఎయిర్ బ్యాగ్ లు.. కేంద్రం కీలక నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ (Modi Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఎం1 కేటగిరి, ప్యాసింజర్‌ వాహనాల్లో ఆరు ఎయిర్ బ్యాగ్స్‌ (Airbags) తప్పకుండా ఉండాల్సిందేనని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది.

  దేశ వ్యాప్తంగా నిత్యం వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు (Accidents) చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ (Modi Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఎం1 కేటగిరి, ప్యాసింజర్‌ వాహనాల్లో ఆరు ఎయిర్ బ్యాగ్స్‌ (Airbags) తప్పకుండా ఉండాల్సిందేనని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ముసాయిదాకు మోదీ సర్కార్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే డ్రైవర్, కో- ప్యాసింజర్‌కు ఎయిర్‌ బ్యాగ్స్‌ తప్పకుండా ఉండాల్సిందేన్న నిబంధనను మోదీ సర్కార్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కో-ప్యాసింజర్‌కు కూడా ఎయిర్‌ బ్యాగ్స్‌ తప్పనిసరి చేసిన రూల్ ను ఈ జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక తాజాగా ఫోర్‌ వీలర్‌కు ఆరు ఎయిర్ బ్యాగ్స్‌ తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనకు మోదీ సర్కార్ ఆమోదం తెలిపింది కేంద్రం.

  Mahindra Offer: మహీంద్రా కార్లపై రూ.81,000 వరకు డిస్కౌంట్... ఏ మోడల్‌పై ఎంతంటే

  ఎనిమిది సీట్ల వరకు ఉండే రకరకాల కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులను తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ కు ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీంతో ఎంట్రీ లెవల్ కారులో కూడా ఆరు ఎయిర్ బ్యాగులు ఇక నుంచి తప్పనిసరి కానున్నాయి.

  Maruti Suzuki Celerio: 5 లక్షల లోపు కారు కోసం చూస్తున్నారా..అయితే బెస్ట్ మోడల్ మీకోసం...

  దీంతో కారులో ఏ సీటులో కూర్చున్నా ప్రయాణికులకు భద్రత లభించనుంది. అయితే కారులో ఆరు ఎయిర్ బ్యాగులు అమర్చడం అంత సులువైన విషయం కాదని తయారీ కంపెనీలు చెబుతున్నాయి. ఆరు ఎయిర్ బ్యాగులతో కార్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వారు అంటున్నారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Accident, Pm modi

  ఉత్తమ కథలు