Home /News /business /

Apple Launch Event: ఏప్రిల్ 20న ఆపిల్ లాంఛ్ ఈవెంట్‌.. ఈసారి విడుదల కానున్న సరికొత్త డివైజెస్​ ఏంటో తెలుసా?

Apple Launch Event: ఏప్రిల్ 20న ఆపిల్ లాంఛ్ ఈవెంట్‌.. ఈసారి విడుదల కానున్న సరికొత్త డివైజెస్​ ఏంటో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆపిల్ ఎట్టకేలకు తన తదుపరి ఈవెంట్​ తేదీని ప్రకటించింది. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆన్​లైన్​లోనే ఆపిల్​ ఈవెంట్​ను హోస్ట్ చేసేందుకు రెడీ అయింది.

ఆపిల్ ఎట్టకేలకు తన తదుపరి ఈవెంట్​ తేదీని ప్రకటించింది. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆన్​లైన్​లోనే ఆపిల్ లాంఛ్​ ఈవెంట్​ను హోస్ట్​ చేయనుంది. ఆపిల్​కు చెందిన వాయిస్ అసిస్టెంట్ సిరి సంస్థ ఆపిల్​ ఈవెంట్​ తేదీని వెల్లడించింది. సిరి పేర్కొన్న దాని ప్రకారం, ఆపిల్​ ఈవెంట్​ ఏప్రిల్​ 20న జరగనుంది. అయితే, ఆపిల్​ మాత్రం దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ.. సిరి మాత్రం లీక్​ ఇచ్చింది. మీరు సిరి వాయిస్​ అసిస్టెంట్​ని ఆన్​ చేసి ‘‘ఆపిల్ తదుపరి ఈవెంట్ ఎప్పుడు?” అని అడిగితే చాలు.. వెంటనే మీకు ఈవెంట్ ఖచ్చితమైన తేదీ, సమయం, ఈవెంట్​ జరిగే ప్రదేశాన్ని సిరి తెలియజేస్తుంది. ఈ కార్యక్రమం ఏప్రిల్ 20న ఉంటుందని వాయిస్ అసిస్టెంట్ మీకు చెప్తుంది. “ఆపిల్​ ప్రత్యేక కార్యక్రమం ఏప్రిల్ 20, మంగళవారం, కుపెర్టినో, కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్ వద్ద జరగనుంది. ఈ ఈవెంట్​కు సంబంధించిన అన్ని వివరాలను Apple.com లో పొందవచ్చు.” అని సిరి మీకు తెలియజేస్తుంది. అయితే, సిరి అందించిన లింక్‌పై మీరు క్లిక్ చేస్తే మాత్రం, మీకు వెబ్‌సైట్‌లో ఆపిల్ లాంఛ్ ఈవెంట్ గురించి సమాచారం లభించదు. ఆపిల్ సాధారణంగా ఈవెంట్​ జరిగే వారం ముందు యూజర్లకు ఈవెంట్ ఆహ్వానాలను పంపుతుంది. కాబట్టి, ఈవెంట్​కు ఇంకా వారం రోజుల సమయం ఉన్నందున ఒకటి లేదా రెండు రోజుల్లో అధికారికంగా యూజర్లు ఆహ్వానాలను పంపే అవకాశాలు ఉన్నాయి.




ఐపాడ్​ ప్రో మోడల్​ లాంచ్​ అవ్వనుందా?
ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని సిరి వెల్లడించినప్పటికీ, దీనిలో ఆపిల్ ఏయే పరికరాలను లాంఛ్ చేస్తుందన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే, ఈ ఈవెంట్​లో, ఆపిల్ కచ్చితంగా కొత్త సిరీస్ ఐప్యాడ్ లను విడుదల చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్​ 20న జరగనున్న ఈవెంట్​లో 12.9- అంగుళాలతో కూడిన ఐపాడ్​ ప్రో మోడల్‌ విడుదల కానుందని తెలుస్తోంది. ఆపిల్​ నుండి మినీ ఎల్‌ఈడీ స్క్రీన్‌తో విడుదలవుతున్న మొట్టమొదటి పరికరంగా ఆపిల్ ఐపాడ్ ప్రోను పేర్కొనవచ్చు. ప్రో మోడళ్లలో ఆపిల్ తన సొంత M1 ప్రాసెసర్లను వినియోగించనుంది.

ఈ ప్రాసెసర్​ A14X చిప్​తో శక్తినిస్తుంది. దీని కొత్త లైనప్‌లో అద్భుతమైన కెమెరా, మెరుగైన ఛార్జింగ్ వంటి ఫీచర్లను అందించనుంది. అయితే, లాంచింగ్​ ఈవెంట్​లో ఐపాడ్​ ప్రో మోడల్​ను విడుదల చేస్తున్నప్పటికీ, వీటి తయారీలో ఉపయోగించే మినీ- ఎల్ఈడి డిస్​ప్లేల కొరత కారణంగా వెంటనే విక్రయించే అవకాశాలు లేవని తెలుస్తోంది. బహిరంగ మార్కెట్​లో వీటి అమ్మకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం ఒక ప్రముఖ టిప్‌స్టెర్ కొత్తగా ఆపిల్​ విడుదల చేసయబోయే ఐపాడ్ చిత్రాలను లీక్ చేసింది. వీటిని పరిశీలిస్తే.. ప్రస్తుత ఐపాడ్​లు, రాబోయే ఐప్యాడ్‌ల డిజైన్​లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.


Published by:Sumanth Kanukula
First published:

Tags: Apple, Iphone, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు