SIP: నెలకు రూ.4,500 పెట్టుబడి పెట్టండి... కోటీశ్వరులు అవ్వండి... ఇలా చెయ్యండి

మధ్యస్థాయి వ్యాపారం... కష్టపడితే మంచి లాభాలు (ప్రతీకాత్మక చిత్రం)

SIP: కోటీశ్వరులు అవ్వడం అనేది ఒకప్పుడు కల. ఇప్పుడు ఎవరికైనా సాధ్యమే. కాకపోతే... దానికి ఎంతో ఫైనాన్షియల్ క్రమ శిక్షణ ఉండాలి. అలాగే... సరైన ప్లాన్ వేసుకోవాలి. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం.

  • Share this:
    SIP: ఈ రోజుల్లో చట్టబద్ధంగా డబ్బు సంపాదించడానికి ఎక్కువ మంది ఎంచుకుంటున్న మార్గం మ్యూచువల్ ఫండ్స్. అందులోనూ సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) అనేది చిన్న చిన్న మొత్తాలతోనే కోటీశ్వరులు అయ్యేలా చేస్తోంది. అందుకే చిన్న ఇన్వెస్టర్లు కూడా ఇలాంటి వాటిపై ఆసక్తి చూపిస్తూ... మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకుంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ ‌అయినా SIP విధానమైనా... 1 సంవత్సరానికో, 2 ఏళ్లకో... భారీగా రిటర్న్స్ రావు. కనీసం 15 నుంచి 20 ఏళ్లపాటూ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడాలి. అలా జరగాలంటే ఎంతో పట్టుదల, క్రమశిక్షణ అవసరం. నిజంగా అలా పెట్టుబడి పెట్టగలిగితే... తక్కువ పెట్టుబడికే మీరు ఊహించనంత అమౌంట్ పొందగలరు.

    SIP ఎందుకు?
    సిప్‌లో పెట్టుబడి పెట్టేందుకు డైలీ, వీక్లీ, నెలవారీ ఇలా ఆప్షన్లు ఉంటాయి. చాలా మంది నెలవారీ ఆప్షన్ ఎంచుకుంటారు. వారికి ఏ నెలకు ఆ నెల... మొత్తం పెట్టుబడిపై చక్రవడ్డీ లాంటిది (compounding benefits) కలుస్తుంది. అందువల్ల నెల నెలా పెట్టుబడి మొత్తం పెరుగుతూ ఉంటుంది. తద్వారా... కాంపౌండింగ్ బెనెఫిట్స్ కూడా పెరుగుతాయి. ఫలితంగా సంవత్సరాలు గడిచే కొద్దీ... రిటర్న్ అమౌంట్ మరింతగా పెరుగుతూ ఉంటుంది.

    ఇది కూడా చదవండి


    దీర్ఘకాలంలో ఎంత లాభం వస్తుంది?
    15 నుంచి 20 ఏళ్లు పెట్టుబడి పెట్టేవారికి... దీర్ఘ కాలంలో 15 శాతం దాకా రిటర్న్స్ వస్తాయి. కాబ్టట్టి ఇన్వెస్టర్లు దీర్ఘ కాలానికి 15 శాతం దాకా రిటర్నులను ఆశించవచ్చు.

    రూ.4,500తో ఎలా కోటీశ్వరులు అవుతారు?
    పైన చెప్పుకున్నట్లు 15 శాతం రిటర్నుతో లెక్కేసుకంటూ... నెలకు రూ.4,500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ పోతే... 20 ఏళ్లలో మొత్తం పెట్టుబడి రూ.10,80,000 అవుతుంది. అదనంగా వచ్చేది రూ.57,41,797 అవుతుంది. అందువల్ల మొత్తం అయ్యేది రూ.68,21,797.387

    ఇది కూడా చదవండి: Viral video: వామ్మో... ఆటో... షాక్ ఇచ్చిందిగా... వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్న నెటిజన్లు

    మరి కోటీశ్వరులు అవ్వడం ఎలా?
    ఇక్కడో ట్రిక్ ఉంది. దాని ద్వారా కోటీశ్వరులు అవ్వొచ్చు. ఎలాగంటే... ఇన్వెస్టర్... ప్రతి సంవత్సరం ముగిశాక... మొదటి నెల జనవరిలో అదనంగా మరో రూ.500 పెట్టుబడి పెట్టాలి. ఇలా ప్రతి సంవత్సరం ఓ రూ.500 అదనంగా పెట్టుబడి పెడితే చాలు... అంటే... 19 ఏళ్లపాటూ... అదనంగా సంవత్సరానికి రూ.500 పెట్టుబడి పెట్టినట్లు అవుతుంది. ఈ మొత్తం రూ.9,500 అవుతుంది. కానీ... ఈ కొద్దిపాటి పెట్టుబడితోనే... 20 ఏళ్ల తర్వాత పొందే మొత్తం అమౌంట్ రూ.1,07,26,921.405 అవుతుంది.
    Published by:Krishna Kumar N
    First published: