SIP calculator: నెల నెల ఈ ఒక్క పనిచేస్తే రూ.5 కోట్ల భారీ మొత్తం మీ సొంతం..ఎలాగంటే...

ప్రతీకాత్మక చిత్రం

మ్యూచువల్ ఫండ్​లో ఇటీవల కాలంలో ఎక్కువ మంది పెట్టుబడులు పెడుతున్నారు. అందులోనూ సిప్​(Systematic Investment Plans)లో పెట్టుబడులు అధికమవుతున్నాయి. దీర్ఘకాలంలో ఎక్కువ రాబడులు అందించే ప్రణాళికల్లో సిప్​లు ముందువరుసలో ఉంటున్నాయి.

  • Share this:
మ్యూచువల్ ఫండ్​లోఇటీవల కాలంలో ఎక్కువ మంది పెట్టుబడులు పెడుతున్నారు. అందులోనూ సిప్​(Systematic Investment Plans)లో పెట్టుబడులు అధికమవుతున్నాయి. దీర్ఘకాలంలో ఎక్కువ రాబడులు అందించే ప్రణాళికల్లో సిప్​లు (Mutual fund ) ముందువరుసలో ఉంటున్నాయి. కొన్నిసార్లు నిర్దిష్ట కాలవ్యవధిలో ఎక్కువ రాబడులు పొందాలన్నా ఈ ఎస్ఐపీ మోడ్ ఇన్వెస్ట్​మెంట్లు బాగా ఉపకరిస్తున్నాయి (Mutual fund ). దీనికి సంబంధించి సోదాహరణంగా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. (Mutual fund )

15 ఏళ్లలో 5 కోట్ల రాబడి..
విజయ్ ఓ వర్కింగ్ ప్రొఫెషనల్. వయస్సు 45. నెలవారీగా ఆరెంకెల జీతాన్ని అందుకుంటున్నాడు.కెరీర్ ప్రారంభంలో తన వితంతు తల్లి, పెళ్లి కాని సోదరిని చూసుకోవాల్సి వచ్చింది. కాబట్టి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం విజయ్ ఎలాంటి పొదుపు చేయలేకపోయాడు. ఇప్పుడు ఆయన కుటుంబ బాధ్యతల నుంచి విముక్తి పొందాడు. పిల్లలు బాగా స్థిరపడ్డారు. గత నెలలో గృహరుణం కూడా ముగిసిపోయింది. తన పదవివీరమణ అనంతరం అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నాడు. అతని ఆర్థిక అవసరాలను తీరడానికి దాదాపు రూ.5 కోట్లు అవసరముతాయి. కాబట్టి విజయ్ 15 సంవత్సరాల్లో 5 కోట్లు సంపాదించగల పెట్టుబడి సాధనాల కోసం చూస్తున్నాడు.ఈ కేసులో విజయ్ తన లక్ష్యాన్ని సాధించాలంటే పెట్టుబడి ప్రణాళికను అస్సలు మిస్ చేయకూడదని ఆప్టిమా మనీ మేనేజెస్ సీఈఓ పంకజ్ మత్పాల్ అన్నారు. కాబట్టి అతడు ఎస్ఐపీ మోడ్ లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం లాభదాయకమని సలహా ఇచ్చారు. 15 ఏళ్ల దీర్ఘకాలంలో అతనికి 12 నుంచి 14 శాతం రిటర్నులు వస్తాయని స్పష్టం చేశారు. ఎవరైనా ఆదాయాన్ని పెంచాలంటే నెలవారీ ఎస్ఐపీని పెంచాలని తెలిపారు. కాబట్టి స్టెప్-అప్ ఎస్ఐపీ మోడ్ ను అనుసరించాలని, ఎందుకంటే ఇది పెట్టుబడిదారుని నెలవారీ ఎస్ఐపీని సాధ్యమైనంత తగ్గించడానకి సహాయపడుతుందని తెలిపారు.

Mutual Fund SIP: ప్రతీ నెలా జీతంలో కొంత పొదుపు చేస్తే రూ.47 లక్షల రిటర్న్స్


Mutual Fund: ప్రతీ నెలా కొంత పొదుపు చేస్తే రూ.51 లక్షల రిటర్న్స్


మ్యూచువల్ ఫండ్ క్యాలిక్యులేటర్..
విజయ్ తన 5 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి వార్షిక్ స్టెప్-అప్ సరిపోతుంది. ఇలా చేయడం ద్వారా నెలవారీ ఎస్ఐపీపై 12 శాతం రాబడి ఊహించి, ఎస్ఐపీ రిటర్న్ కాలిక్యులేటర్.. విజయ్ నెలకు కనీసం రూ.44 వేలు పెట్టుబడి చేయాలని సూచిస్తుంది. 15 సంవత్సర ముగింపులో అతను రూ. 5,00,39,132 లేదా దాదాపు రూ.5 కోట్లు మెచ్యూరిటీ మొత్తంగా పొందుతాడు. ఇది విజయ్ పదవీ విరమణ సమయంలో కోరుకునే మొత్తానికి సమానం. అయితే మ్యూచువల్ ఫండ్ వడ్డీరేటు 14 శాతం కంటే ఎక్కువ ఉంటే అతను రూ.5.69 కోట్లు మెచ్యురిటీ మొత్తాన్ని పొందుతాడు. కాబట్టి 15 ఏళ్ల తర్వాత 5 కోట్ల మొత్తాన్ని అందుకోవడానికి విజయ్ నెలకు 44 వేల రూపాయలను ఎస్ఐపీల్లో పెట్టుబడి పెట్టాలి.
Published by:Krishna Adithya
First published: