Airtel Rights Issue: ఎయిర్‌టెల్‌ రైట్స్ ఇష్యూలో 14 శాతం వాటాను సబ్‌స్క్రైబ్ చేసుకుంటాం.. ప్రధాన వాటాదారు సింగ్‌టెల్ ప్రకటన..

ప్రతీకాత్మక చిత్రం

ఎయిర్‌టెల్‌(Airtel)లో తమకు ఉన్న 14 శాతం వాటా మేరకు రైట్స్‌ ఇష్యూని సబ్‌స్క్రైబ్ చేసుకుంటామని సింగ్‌టెల్(Singtel) తాజాగా ప్రకటించింది. ఇందుకు 405 మిలియన్ డాలర్లు కేటాయించనున్నట్లు వెల్లడించింది. 

  • Share this:
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌(Bharti Airtel)లో సింగపూర్ కంపెనీ(Singapore Company) సింగ్‌టెల్‌కు (SINGTEL) వాటా ఉందనే సంగతి తెలిసిందే. ఈ సంస్థకు ఎయిర్‌టెల్‌లో 14 శాతం వరకు వాటా ఉంది. అయితే రూ.21,000 కోట్ల నిధులను సమీకరించేందుకు రైట్స్ ఇష్యూకు వెళ్లనున్నట్లు ఎయిర్‌టెల్(Airtel) గత నెలలో ప్రకటించింది. ఈ క్రమంలో ఎయిర్‌టెల్‌లో తమకు ఉన్న 14 శాతం వాటా మేరకు రైట్స్‌ ఇష్యూని సబ్‌స్క్రైబ్ చేసుకుంటామని సింగ్‌టెల్ తాజాగా ప్రకటించింది. ఇందుకు 405 మిలియన్ డాలర్లు కేటాయించనున్నట్లు వెల్లడించింది. రైట్స్ ఇష్యూను(rights issue) ఎయిర్‌టెల్‌ అక్టోబరు 5 నుంచి అక్టోబరు 21 మధ్య కాలంలో ఆమోదానికి అనుమతించనుంది. ఈ సంస్థ బోర్డు ఆగస్టు 29న నిధుల సేకరణకు ఆమోదం తెలిపింది. వాటాదారులకు ప్రతి 14 షేర్లకు ఒక షేర్‌ను రైట్ ఇష్యూలో కేటాయిస్తారు. రైట్స్ ఇష్యూలో జారీచేసే ఒక్కో షేర్ ధర రూ. రూ.535 చొప్పున ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది.

రైట్స్ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను ఎయిర్‌టెల్‌ 5జీ(Airtel 5G) సామర్థ్యాలపై పెట్టుబడులు పెట్టాలని, భారత్(India) లో డిజిటల్ వృద్ధికి (Digital) ఇది ఊతమిస్తుందని సింగ్ టెల్ విశ్వాసం వ్యక్తం చేసింది. డిజిటల్ ఎకానమీ(digital economy)కి శక్తినిచ్చే క్లిష్టమైన మౌలిక సదుపాయాల్లో తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు ఆస్తులను అన్ లాక్ చేయడాన్ని మల్టీ లోకల్ వ్యూహంగా ఈ సంస్థ భావిస్తోంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో డిజిటల్ ఎకో సిస్టమ్‌ను నిర్మించాలని మే నెలలోనే గుర్తించింది.
Airtel New Plans: ఎయిర్‌టెల్ నుంచి కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే


భారత్‌లో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్యలో ఊహించదగిన పెరుగుదల, బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్స్‌లో నెలనెలా పెరుగుతున్న స్థిరమైన వృద్ధిని దృష్టిలో ఉంచుకొని సింగ్‌టెల్‌.. ఎయిర్‌టెల్‌ 5జీ, హోం బ్రాడ్ బ్యాండ్, డేటా సెంటర్స్ లాంటి రంగాల్లో అవకాశాల కల్పనకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా క్లౌడ్ సేవలు, సైబర్ సెక్యూరిటీ విషయంలో ఉపాధి అవకాశాలను కల్పించనుంది.
Broadband Plans: జియో ఫైబర్ నుంచి యాక్ట్ వరకు.. తక్కువ ధరలోని బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు ఇవే..

రైట్స్ ఇష్యూ అంటే?
ఏదైనా కంపెనీ నిధుల సమీకరణ కోసం తన ప్రస్తుత షేర్ హోల్డర్లకు ప్రత్యేక ధరకు షేర్లను విక్రయించడాన్ని రైట్స్ ఇష్యూ అంటారు. ఈ విధానం ద్వారా నిధులు సేకరించి సంస్థ వృద్ధి కోసం పెట్టుబడులు పెడతారు.
Published by:Nikhil Kumar S
First published: