Zomato: జొమాటోలో సింగిల్ ఆర్డర్‌ బిల్లు రూ.1.8 లక్షలు... 415 బాక్సుల డెలివరీ

Zomato | జైపూర్‌లో సింగిల్ ఆర్డర్‌లో ఒకేసారి రూ.1,84,760 బిల్లు కావడం విశేషం. మొత్తం 415 బాక్సుల్లో డెలివరీ చేసింది జొమాటో.

news18-telugu
Updated: April 10, 2019, 12:50 PM IST
Zomato: జొమాటోలో సింగిల్ ఆర్డర్‌ బిల్లు రూ.1.8 లక్షలు... 415 బాక్సుల డెలివరీ
Zomato: జొమాటోలో సింగిల్ ఆర్డర్‌ బిల్లు రూ.1.8 లక్షలు... 415 బాక్సుల డెలివరీ
  • Share this:
మీరు ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా ఫుడ్ ఆర్డర్ చేశారా? సింగిల్ ఆర్డర్‌కు బిల్లు ఎంతవుతుంది? వందల్లో అవుతుంది. లేదా కాస్త ఎక్కువ ఆర్డర్ చేస్తే బిల్లు వేలల్లో ఉంటుంది. కానీ... జొమాటోలో సింగిల్ ఆర్డర్‌లో రూ.1.8 లక్షల బిల్లు కావడం ఓ సంచలనం. ఈ విషయాన్ని జొమాటో స్వయంగా వెల్లడించింది. ఇటీవల 2018-19 ఆర్థిక సంవత్సరం నివేదిక విడుదల చేసిన జొమాటో... ఆ నివేదికలో ఈ అంశాన్ని వెల్లడించింది. జైపూర్‌లో సింగిల్ ఆర్డర్‌లో ఒకేసారి రూ.1,84,760 బిల్లు కావడం విశేషం. మొత్తం 415 బాక్సుల్లో డెలివరీ చేసింది జొమాటో. లక్నోలో ఓ వ్యక్తి ఒకే ఆర్డర్‌కు రూ.16,800 బిల్లు చెల్లించడం మరో విశేషం.

Zomato Single order, Zomato Rs.1.8 Lakh order, Zomato interesting facts, Zomato Annual Report, zomato orders, Zomato food order, జొమాటో ఆర్డర్, జొమాటో సింగిల్ ఆర్డర్, జొమాటో హిస్టరీ, జొమాటో రిపోర్ట్, జొమాటో ఫుడ్ ఆర్డర్, జొమాటో రూ.1.8 లక్షల ఆర్డర్
Zomato: జొమాటోలో సింగిల్ ఆర్డర్‌ బిల్లు రూ.1.8 లక్షలు... 415 బాక్సుల డెలివరీ (image: Zomato)


ఏడాది మొత్తంలో తమ బిజినెస్‌లో హైలైట్స్ అన్నీ కలిపి నివేదికలో వివరించింది జొమాటో. అబోహార్‌లో జొమాటో లాంఛ్ చేసిన తొలిరోజే 1000 ఆర్డర్లు వచ్చాయి. అల్వార్‌లో ఓ వ్యక్తి 48 వేర్వేరు రెస్టారెంట్ల నుంచి 292 పార్శిళ్లు తెప్పించుకోవడం మరో విశేషం. ముంబై కన్నా ఇండోర్‌లోనే మిడ్‌నైట్ డెలివరీలు ఎక్కువట. విజయవాడలో ఎక్కువగా బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్స్ వచ్చాయి. తునిలో ఎక్కువగా క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇక గువాహతిలో అయితే ఫుడ్ డెలివరీ చేయడానికి డెలివరీ బాయ్ ఏకంగా పడవలో బ్రహ్మపుత్ర నది దాటడం మరో విశేషం. ఇలా జొమాటో యాన్యువల్ రిపోర్ట్‌లో ఇలాంటి ఆసక్తికర అంశాలు ఎన్నో ఉన్నాయి.

Yamaha MT-15: యమహా కొత్త బైక్ ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

Election 2019: ఎన్నికల్లో ఓటు వేస్తే పెట్రోల్‌పై డిస్కౌంట్SBI Good News: గుడ్ న్యూస్... వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ

Twitter: ట్విట్టర్ సీఈఓ ఏడాది జీతం జస్ట్ రూ.97 మాత్రమే... ఎందుకో తెలుసా?
Published by: Santhosh Kumar S
First published: April 10, 2019, 12:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading