• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • SIMPLE ENERGY TO LAUNCH ELECTRIC SCOOTER ON 15TH AUGUST 2021 KNOW PRICE AND SPECIFICATIONS SS GH

Simple Energy: సింపుల్​ ఎనర్జీ నుంచి త్వరలోనే ఇ-స్కూటర్​... ప్రత్యేకతలివే

Simple Energy: సింపుల్​ ఎనర్జీ నుంచి త్వరలోనే ఇ-స్కూటర్​... ప్రత్యేకతలివే (image: Simple Energy)

Simple Energy | సింపుల్ ఎనర్జీ మార్క్ 2 పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆగస్ట్ 15న లాంఛ్ చేయనుంచి ఈ ఇ-స్కూటర్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి.

  • Share this:
పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరుగుతుండటంతో కాలుష్య రహిత ఎలక్ట్రిక్​ వాహనాలపై అందరి దృష్టి పడింది. దీంతో భారత మార్కెట్లో ఎలక్ట్రికల్​ వాహనాల డిమాండ్​ పెరుగుతోంది. ఈ డిమాండ్​ను అందిపుచ్చుకునేందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థలతో పాటు కొత్త స్టార్టప్​ సంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా, ఈ జాబితాలోకి బెంగళూరుకు చెందిన మరో స్టార్టప్ సంస్థ సింపుల్ ఎనర్జీ చేరింది. సింపుల్ ఎనర్జీ 2021 ఆగస్టు 15 భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున తన మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ ఇ-స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మార్క్ 2 పేరుతో విడుదల కానున్న ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో అనేక ప్రత్యేకతలున్నాయి. ఇది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. కేవలం 3.6 సెకన్లలో 0 నుండి 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

ఈ స్కూటర్​ నమూనాను విడుదల చేసింది సింపుల్ ఎనర్జీ. దీనిలో 4.8 కిలోవాట్ల లిథియం- అయాన్ బ్యాటరీని ఉపయోగిస్తున్నారు. ఇది 240 కిలోమీటర్ల ఎకో మోడ్‌లో పనిచేస్తుంది. సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మిడ్-డ్రైవ్ మోటారుతో పాటు రిమూవబుల్​ బ్యాటరీ, ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఉంటుంది. టచ్ స్క్రీన్, ఆన్-బోర్డు నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఫీచర్లను కూడా అందించారు. ఈ–స్కూటర్ ధర రూ .1,10,000 నుండి రూ. 1,20,000 వరకు ఉంటుందని సింపుల్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది.

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

Online Banking: ఆన్‌లైన్‌లో డబ్బులు పంపిస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

తొలుత బెంగళూరులో ప్రారంభం


ఈ సరికొత్త ఎలక్ట్రిక్​ వాహనంపై సింపుల్ ఎనర్జీ ఫౌండర్, సిఈఓ సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ, "భారత మార్కెట్​లో సరికొత్త ఎలక్ట్రిక్​ ఈ–స్కూటర్​ను విడుదల చేయనుండటం పట్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినోత్సవం రోజు ఈ స్కూటర్​ను లాంచ్​ చేయనున్నాం. ఆగస్ట్​ 15వ తేదీ కల్లా దేశంలో కరోనా ప్రభావం తగ్గుతుందన్న అంచనాలతో ఈ తేదీని ఎంచుకున్నాం. మా సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో చరిత్రను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం భారత్​లోనే కాదు గ్లోబల్ మార్కెట్లో సైతం మా సంస్థను విస్తరించాలని సంకల్పించాం" అని అన్నారు.

Realme 8 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర ఇప్పుడు రూ.13,999 మాత్రమే

Free Wifi at Railway Station: దేశంలోని 6,000 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై

సింపుల్ ఎనర్జీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ బెంగళూరులో ప్రారంభించనుంది. ఇక్కడే కంపెనీకి చెందిన ఆర్ అండ్ డి సెంటర్ కూడా ఉంది. అందువల్ల మొదటి ఫ్యాక్టరీని కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దశలో బెంగళూరులో ప్రారంభించి.. ఈ తర్వాత చెన్నై, హైదరాబాద్​ వంటి ప్రముఖ నగరాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్​ను లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. క్రమంగా ఇతర నగరాలకు కూడా దీన్ని విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది. దీని కోసం ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో15 మిలియన్​ డాలర్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. దీంతో పాటు బెంగళూరులో ఛార్జింగ్ స్టేషన్లను కూడా ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.
Published by:Santhosh Kumar S
First published: