Home /News /business /

SILVER PRICES RISE AGAIN AND THE PRICE OF GOLD IS STABLE FIND OUT THE GOLD AND SILVER PRICES IN TELUGU STATES PRV

Gold Prices Today: మళ్లీ పెరిగిన వెండి ధరలు.. స్థిరంగానే బంగారం ధర.. తులం బంగారం ఎంత ఉందంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు మార్పులు చోటుచేసుకోలేదు. బంగారం ధ‌ర‌లు స్థిరంగానే ఉన్నాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణం అయింది.

ఇంకా చదవండి ...
    గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు మార్పులు చోటుచేసుకోలేదు. బంగారం ధ‌ర‌లు స్థిరంగానే ఉన్నాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణం అయింది. తాజాగా మంగళవారం (అక్టోబర్‌ 5)న హైదరాబాద్​లో 10 గ్రాముల బంగారం ధర రూ 43, 510 గా ఉంది. చాలా నగరాలలో బంగారం (gold) ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ, వెండి (Silver) ధర కిలోకి మాత్రం రూ. 200 వరకు పెరిగింది. ఆయా ప్రాంతాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలుగు రాష్ట్రాల్లో..

    హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (gold price) రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,470 ఉంది.

    హైదరాబాద్‌లో కిలో వెండి (silver) ధర రూ.64,800 ఉండగా, విజయవాడలో రూ. 64,800 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.60,500 ఉండగా, చెన్నైలో రూ.64,800 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.60,500 ఉండగా, కోల్‌కతాలో రూ.60,500 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.60,500 ఉండగా, కేరళలో రూ.64,800 ఉంది.

    ఇతర నగరాల్లో బంగారం ధరలు..

    ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,820 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,490 ఉంది.

    కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,700 ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470 ఉంది.

    బంగారం ధర (gold rates)ల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Gold price, Gold Prices Today, Silver price

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు