Silver Price: వెండి కొన్నవారికి పండగే... రికార్డు ధర వైపు దూసుకెళ్తున్న సిల్వర్

Silver Price | మీరు గత మూడు నెలల్లో వెండి కొన్నారా? సిల్వర్‌పై ఇన్వెస్ట్ చేశారా? అయితే మీకు పండగే. వెండి రేట్లు దూసుకెళ్తున్నాయి.

news18-telugu
Updated: July 14, 2020, 9:19 AM IST
Silver Price: వెండి కొన్నవారికి పండగే... రికార్డు ధర వైపు దూసుకెళ్తున్న సిల్వర్
Silver Price: వెండి కొన్నవారికి పండగే... రికార్డు ధర వైపు దూసుకెళ్తున్న సిల్వర్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ప్రజలు ఎక్కువగా బంగారం ధరలపైనే దృష్టిపెడుతుంటారు. కానీ వెండి ధరలు కూడా బంగారాన్ని మించిపోయి దూసుకెళ్తున్నాయి. ఇటీవల కాలంలో బంగారం కంటే వెండి ధరే ఎక్కువగా పెరుగుతోంది. భారతదేశంలో ఏకంగా కిలో వెండి ధర రూ.52,500 చేరుకుంది. గత ఏడేళ్లలో పోలిస్తే ఇవే గరిష్ట ధరలు. గ్లోబల్ మార్కెట్‌లో ధరలు 10 నెలల గరిష్ట స్థాయికి చేరాయి. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలో కిలో వెండి ధర రూ.55,000-58,000 మధ్య ట్రేడ్ కావొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారాన్ని మించిపోయి వెండి ధరలు ఇంతలా పెరిగిపోవడానికి కరోనా వైరస్ సంక్షోభం, ఆ తర్వాత నిర్వహించిన లాక్‌డౌన్ కారణాలు. దీని వల్ల కోవిడ్ 19, లాక్‌డౌన్ సిల్వర్ మైనింగ్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. దీంతో వెండి సప్లై తగ్గింది. సప్లై తగ్గడంతో వెండికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా వెండి రేటు దూసుకెళ్లింది.

Gold Loan: ఇంటికి వచ్చి గోల్డ్ లోన్స్ ఇస్తున్న ముత్తూట్ ఫైనాన్స్... తీసుకోండి ఇలా

Covid 19: కరోనా నుంచి రక్షణ కోసం కొత్త పాలసీలొచ్చాయి... ప్రీమియం ఎంతంటే

గత మూడు నెలల్లో వెండి ధరలు 18 శాతం పెరిగాయి. గత ఏడాదిగా చూస్తే వెండి రేటు 36 శాతం పెరగడం విశేషం. కానీ ఈ ఏడాది మార్చిలో చూస్తే వెండి రేటు చాలా తక్కువగా ఉంది. 11 ఏళ్ల కనిష్ట స్థాయికి వెండి ధర చేరుకుంది. కానీ... మార్చిలో కనిష్ట స్థాయి నుంచి వెండి పుంజుకుంది. ఏకంగా 55 శాతం పెరిగింది. అంటే మార్చిలో కనిష్ట స్థాయిలో వెండిపై రూ.1,00,000 ఇన్వెస్ట్ చేసినట్టైతే నాలుగు నెలల్లో 55 శాతం రిటర్న్స్ వచ్చేవి. అంటే ఆ వెండి ధర ప్రస్తుతం రూ.1,55,000 ఉండేది. మరోవైపు బంగారం, వెండి ధరల్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు కాబట్టి వెండి ధర పెరుగుతోంది.

WhatsApp Banking: మీ బ్యాంకింగ్ సేవలు వాట్సప్‌లో పొందొచ్చు ఇలా

SBI: ఈ బ్యాంకింగ్ సేవలకు మిస్డ్ కాల్‌, ఎస్ఎంఎస్ చాలు

మరోవైపు 2013 నుంచి చూస్తే ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ కూడా డైలీ టర్నోవర్ రికార్డు స్థాయిలో ఉండటం విశేషం. ఐషేర్ సిల్వర్ ట్రస్ట్ 116,043 టన్నుల వెండిని సొంతం చేసుకుంది. వెండిని వస్తువులు, ఆభరణాల కోసమే కాదు పరిశ్రమల అవసరాలకు కూడా ఉపయోగిస్తారు. సోలార్ చిప్స్, కేబుల్స్ లాంటి తయారీలో వెండిని ఉపయోగిస్తుంటారు. దీంతో డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటి నుంచి 2030 వరకు 888 మిలియన్ ఔన్స్ వెండి అంటే 2,51,74,376 కిలోల వెండి డిమాండ్ ఉంటుందని ఓ అంచనా. ఈ ఏడాది సిల్వర్ మైన్ ప్రొడక్షన్ 5 శాతం అంటే 978.1 మిలియన్ ఔన్సులు తగ్గొచ్చని సిల్వర్ ఇన్‍స్టిట్యూట్ లెక్కలు చెబుతున్నాయి. పరిశ్రమల డిమాండ్ 7 శాతం తగ్గినా, ఫిజికల్ ఇన్వెస్ట్‌మెంట్ 16 శాతం పెరగొచ్చని అంచనా.
Published by: Santhosh Kumar S
First published: July 14, 2020, 9:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading