Silver Price: ఇక వెండి కూడా బంగారమేనా? రికార్డులు సృష్టిస్తున్న సిల్వర్ రేట్

Silver Price: ఇక వెండి కూడా బంగారమేనా? రికార్డులు సృష్టిస్తున్న సిల్వర్ రేట్ (ప్రతీకాత్మక చిత్రం)

Silver Price | బంగారంతో పోటీపడి మరీ వెండి ధరలు పెరుగుతున్నాయి. కిలో వెండి రేటు రూ.55,000 మార్క్ దాటింది.

  • Share this:
    ప్రజలు ఎక్కువగా బంగారం ధర ఎంత, గోల్డ్ రేట్ పెరిగిందా తగ్గిందా అని మాత్రమే ఆలోచిస్తుంటారు. లెక్కలేస్తుంటారు. కానీ వెండి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు వెండి కూడా రికార్డులు సృష్టిస్తోంది. వెండి ధర భారీగా పెరుగుతోంది. గత సెషన్‌లో కిలో వెండి ధర రూ.1150 పెరిగితే, ఇవాళ్టి సెషన్‌లో కిలో వెండి రూ.1,639 పెరిగింది. మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ ధర ఈ స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం రూ.55,644 దగ్గర ట్రేడ్ అవుతోంది. త్వరలో వెండి రూ.55,000 మార్క్ దాటి రూ.58,000 వైపు దూసుకెళ్తుందని నిపుణులు కొద్ది రోజుల ముందు అంచనా వేశారు. కానీ రూ.55,000 మార్క్ ఇంత వేగంగా తగ్గుతుందని ఊహించలేదు.

    Smartphone: కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఓ వారం రోజులు ఆగండి

    Personal Loan: లోన్ ఈజీగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవండి

    ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ 0.36 శాతం అంటే రూ.178 పెరిగి రూ.49,205 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. కానీ వెండి మాత్రం ఏకంగా 3 శాతం పైనే పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఏకంగా రూ.2,250 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.55,400. ఇక హైదరాబాద్‌లో 24 క్యారట్ బంగారం 10 గ్రాములపై రూ.130 పెరిగి రూ.51,370 ధరకు చేరుకుంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం 10 గ్రాములపై రూ.140 పెరిగి రూ.47,090 ధరకు చేరుకుంది.

    Gold Loan: నెలకు 64 పైసల వడ్డీకే బంగారంపై రుణాలు.. కెనెరా బ్యాంక్ ఆఫర్

    Jan Dhan Account: ప్రభుత్వ పథకాల కోసం జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేయండి ఇలా

    ఇక్కడే కాదు గ్లోబల్ మార్కెట్‌లో కూడా వెండి రేటు 2016 సెప్టెంబర్ స్థాయికి వెళ్లింది. కరోనా వైరస్ వ్యాక్సిన్లపై పాజిటీవ్ న్యూస్ వస్తుండటం, ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల్లో కార్యకలాపాలు మళ్లీ గాడిలో పడుతుండటం లాంటి కారణాలతో వెండి ధర పెరుగుతుందని అంచనా. మరోవైపు బంగారం ధర భారీగా పెరిగిపోతుండటం, ఇతర అసెట్స్‌పై పెట్టుబడులు రిస్క్ అని భావిస్తున్న ఇన్వెస్టర్లు తమ పెట్టుబడికి వెండి సురక్షితమనుకుంటున్నారు. అందుకే వెండి ధర భారీగా పెరుగుతోంది. గత కొంతకాలంగా బంగారం ధరలతో పోటీపడి మరీ వెండి ధరలు పెరుగుతున్నాయి. ఐషేర్స్ ఈటీఎఫ్‌లో సిల్వర్ హోల్డింగ్స్ 118.78 టన్నులు పెరిగి మొత్తం 16379.08 టన్నులతో రికార్డు స్థాయికి చేరుకుంది.
    Published by:Santhosh Kumar S
    First published: