• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • SILVER LAKE TO INVEST ADDITIONAL RS 4565 CR IN JIO PLATFORMS FOR 0 93 PERCENT WILL NOW OWN 2 08 PERCENT STAKE BA

RelianceJio- SilverLake Deal | జియోలో మరో రూ.4565 కోట్లు పెట్టుబడులు పెట్టిన సిల్వర్ లేక్

RelianceJio- SilverLake Deal | జియోలో మరో రూ.4565 కోట్లు పెట్టుబడులు పెట్టిన సిల్వర్ లేక్

Silver Lake Jio Deal

రిలయన్స్ జియోలో గతంలో పెట్టుబడి పెట్టిన అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ సంస్థ అదనంగా ఇన్వెస్ట్ చేస్తోంది.

  • Share this:
    రిలయన్స్ జియోలో గతంలో పెట్టుబడి పెట్టిన అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ సంస్థ అదనంగా ఇన్వెస్ట్ చేయనుంది. ఈసారి రూ.4565 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. జియోలో 0.93 శాతం వాటాల కొనుగోలు కోసం సిల్వర్ లేక్ సంస్థ ఈ భారీ మొత్తాన్నిచెల్లించనుంది. సిల్వర్ లేక్ సంస్థ గతంలో రిలయన్స్ జియోలో రూ. 5,655.75 పెట్టుబడి పెట్టి 1.15 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇప్పుడు కలిపిన డీల్ కూడా కలిపితే మొత్తం సిల్వర్ లేక్ రిలయన్స్ జియోలో రూ.10,202.55 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు లెక్క. తాజా డీల్‌తో కలిపి సిల్వర్ లేక్ సంస్థ జియోలో 2.08 శాతం వాటాను కొనుగోలు చేసింది. తాజా డీల్‌తో కలపి ఇప్పటి వరకు రిలయన్స్ జియో ఏడు డీల్స్ చేసింది. అందులో సిల్వర్ లేక్ రెండుసార్లు. ఇప్పటి వరకు మొత్తం రూ.92,202.15 నిధులను గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల రూపంలో రాబట్టింది. రిలయన్స్ జియోలో ఇప్పటి వరకు ఫేస్ బుక్, సిల్వర్ లేక్ పార్ట్ నర్స్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబదాలా సంస్థలు పెట్టుబడులు పెట్టాయి.

    1. ఏప్రిల్ 22, 2020. రిలయన్స్ జియో - ఫేస్ బుక్ డీల్ విలువ రూ.43,573 కోట్లు. జియోలో 9.99 శాతం కొనుగోలు చేసిన ఫేస్ బుక్.

    2. మే 3, 2020. రిలయన్స్ జియోలో 1.15 శాతం వాటా కోసం రూ.5656 కోట్లు చెల్లించిన సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్.

    3. మే 8, 2020. రిలయన్స్ జియోలో 2.32 శాతం వాటా కోసం రూ.11367 కోట్లు చెల్లించిన విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్.

    4. మే 17, 2020. రిలయన్స్ జియోలో 1.34 శాతం వాటా కోసం రూ.6598 కోట్లు చెల్లించిన జనరల్ అట్లాంటిక్ సంస్థ రూ.6,598.38 పెట్టుబడి పెట్టి 1.34 శాతం వాటాను కొనుగోలు చేసింది.

    5. కేకేఆర్ సంస్థ రూ,11,367 కోట్లు ఇన్వెస్ట్ చేసి 2.32 శాతం వాటాను పొందింది.

    6. అబుదాబికి చెందిన ముబదాలా సంస్థ రూ.9093 కోట్లు పెట్టుబడి పెట్టి 1.85 వాటాను సొంతం చేసుకుంది.



    Published by:Ashok Kumar Bonepalli
    First published: