రిటైర్మెంట్ (Retirement) తర్వాత క్వాలిటీ లైఫ్ కోసం కార్పస్ ఫండ్ క్రియేట్ చేయడం తప్పనిసరి. ఇందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేసేవారు ముందు హోమ్ లోన్ తీర్చేసి తర్వాత రిటైర్మెంట్ కోసం సేవింగ్స్ ప్లాన్ చేయాలా? లేదంటే లోన్స్‌తో పాటు రిటైర్మెంట్ సేవింగ్స్ (Retirement Savings) ఉండేలా ప్లాన్ చేయాలా? అనే దానిపై సరైన నిర్ణయం తీసుకోలేరు. రెండు రకాల విధానాలను గట్టిగా సమర్థించే వారు ఉన్నారు. నిజానికి రెండూ తప్పుకాదు. అన్ని లోన్లను తీర్చేసుకోవడం, ముఖ్యంగా హోమ్ లోన్స్(Home Loans) వంటి పెద్ద పెద్ద వాటిని ముందుకు వదిలించుకోవడం మంచి ఫీలింగ్‌ని, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అయితే వాటిని డబ్బు, లోన్ రీపేమెంట్‌లో ఉన్న లెక్కలకు మించి సమర్థించలేం.
SBI Multicap Fund: SBI మ్యూచువల్ ఫండ్ నుంచి మరో కొత్త ఫండ్ లాంచ్..ఎస్‌బీఐ మల్టీక్యాప్ ఫండ్ పేరుతో విడుదల..
లోన్స్‌ను ఎక్కువ కాలం ఉంచుకోవడం మంచిది కాదా? వీలైనంత త్వరగా తిరిగి చెల్లించడమే నయమా?
అలా అనుకోవడం సరికాదు. ఎక్కువగా వడ్డీ చెల్లించాల్సిన క్రెడిట్ కార్డు బిల్లులు, పర్సనల్ లోన్స్ (Personal Loan) ఉంటాయి. అలాంటివి ఆర్థికంగా భారమే. వీలైనంత త్వరగా వాటిని చెల్లించేయడమే మంచిది. కానీ దీర్ఘకాలికంగా, తక్కువ వడ్డీ రేట్లు ఉండే హోం లోన్స్ విషయంలో అలా ఆలోచించలేం. ఈ విషయంపై కొన్ని సూచనలు ఇచ్చారు StableInvestor.com సంస్థ ఫౌండర్ దేవ్ ఆశిక్. మనీకంట్రోల్ న్యూస్ ఏజెన్సీతో ఆయన పంచుకున్న విషయాలు చూద్దాం.
ఉదాహరణకు మీకు 30 ఏళ్ల వయసు ఉందనుకోండి. 25 ఏళ్ల పాటు తిరిగి చెల్లించేలా హోం లోన్ తీసుకొన్నారు అనుకొందాం. ఈ క్రమంలో రిటైర్మెంట్ సేవింగ్స్ చేయకుండా ఆ మొత్తాన్ని కూడా హోం లోన్ తీర్చడానికి వినియోగిస్తూ 25 ఏళ్లలో కాకుండా 15 ఏళ్లకే కట్టేశారు అనుకోండి.. మీరు కచ్చితంగా ప్రౌడ్ ఫీల్ అవుతారు. అయితే తక్కువగా వడ్డీరేట్లు ఉన్న హోంలోన్‌ను అంత త్వరగా తీర్చేయడం సరైనదేనా? అంటే కాదనే చెప్పాలి. మీరు ఆ మొత్తాన్ని సక్రమంగా ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లలో ఎక్కువనే సంపాదించవచ్చు. మీ ప్రావిడెంట్ ఫండ్ మీ రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు సరిపోదు. మీరు ఇంకా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి.
లోన్స్ చెల్లించడం, సేవింగ్స్ చేయడం.. రెండిట్లో దేన్ని, ఎలా ఎంచుకోవాలి?
మీకు ఎక్కువ లోన్స్ ఉన్న సందర్భంలో.. మీ కోసం కొన్ని సూచనలు..
మీకున్న హోం లోన్, పర్సనల్ లోన్, కార్‌లోన్‌కు సంబంధించిన ఈఎమ్‌ఐలు ఎప్పటికప్పుడు చెల్లించండి. అదే సమయంలో ప్రాపర్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోండి. తర్వాత సరిపడా ఎమర్జీన్సీ ఫండ్ ఉండేలా జాగ్రత్త పడండి. మరీ ఎక్కువ మొత్తంలో అవసరం లేదు. జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురై ఇన్‌కమ్ ఆగిపోయిన సమయంలో ఇబ్బంది పడకుండా, మరో అవకాశం దక్కే వరకు అవసరాలు తీర్చే అంత చాలు. ఇవన్నీ ప్లాన్ చేసుకోకపోతే మీరు ఎప్పుడు వచ్చిన డబ్బును అప్పుడే ఖర్చు చేస్తూ జీవిస్తున్నారని అర్థం. ఇది మీకు ఆర్థిక క్రమశిక్షణ లేదని తెలియజేస్తోంది.
Infosys Fresher Jobs: ఇన్ఫోసిస్‌లో ఫ్రెషర్స్‌కి 55,000 ఉద్యోగాలు... 12 వారాల ట్రైనింగ్
మీ దగ్గర సరిపడినంత అమౌంట్ ఉంటే ముందు క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించేయండి. ఆతర్వాత పర్సనల్ లోన్ గురించి ఆలోచించండి. ఇవన్నీ చేస్తూ.. హోంలోన్ ఈఎమ్‌ఐలు కూడా ఎప్పటికప్పుడు కట్టేయండి. తర్వాత ఓ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌ను సంప్రదించి రిటైర్మెంట్, పిల్లల చదువు తదితరాలకు ఎలా ఇన్వెస్టిమెంట్ ప్లాన్ చేయాలో తెలుసుకోండి.
మీ ఆర్థిక పరిస్థితి, అవసరాలను బట్టి, పిల్లల చదువుకు నెలకు రూ.20 వేలు, రిటైర్మెంట్ సేవింగ్స్‌కు నెలకు రూ.25 వేలు ఇన్వెస్ట్ చేయాలని అనుకొందాం. మిగతా అన్ని ఖర్చులుపోగా, ఈఎమ్‌ఐలు చెల్లించగా ఇంకా రూ.45 వేలు నెలకు మీవద్ద మిగులుతోంది అనుకోండి. మీరు చేయాల్సింది ఏంటంటే.. పిల్లల చదువులకు సంబంధించిన రూ.20 వేలు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. రిటైర్మెంట్ ప్లాన్‌లో భాగంగా రూ.25 వేలు కాకపోయినా తగ్గించి అయినా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటారా? మీరు ఇప్పటికే ఈపీఎఫ్, ఎన్‌పీఎస్ ద్వారా కొంత రిటైర్మెంట్ కోసం సేవ్ చేస్తున్నారు. కాబట్టి నెలకి రూ.15 నుంచి రూ.20 వేల వరకు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది.
ఇప్పుడు మీకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు మిగులుతుంది. ఇప్పుడు మీ హోంలోన్ త్వరగా తీర్చేసే పని అయినా చేయండి లేదా రిటైర్మెంట్ కోసం అయినా ఇన్వెస్ట్ చేసుకోండి. చివరికి మీరు ఇన్‌సెంటివ్స్, బోనస్‌లను కూడా హోంలోన్ త్వరగా తీర్చేందుకు వినియోగించుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.