హోమ్ /వార్తలు /బిజినెస్ /

US Stocks: అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్ షేర్లను మనం కూడా కొనొచ్చు.. ఎలాగో తెలుసా..?

US Stocks: అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్ షేర్లను మనం కూడా కొనొచ్చు.. ఎలాగో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

US Stocks: NSE IFSC త్వరలోనే ఎనిమిది కంపెనీల నుంచి దాదాపు 50 వరకు పెంచే అవకాశం ఉంది. తర్వాత US ఎక్స్ఛేంజీల నుంచి టాప్ 300 స్టాక్‌లను, లేదా ఎక్కువ సంఖ్యలో యాడ్ చేయవచ్చు.

భారతీయులు సైతం అమెరికాకు చెందిన కంపెనీ షేర్లను కొనుగోలు చేసే అవకాశం దక్కింది. మార్చి 3వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల 45 నిమిషాల మధ్య అమెరికాకు చెందిన ఎనిమిది కంపెనీలలో భారతీయులు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌(NSE)లో ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ సెంటర్‌(IFSC) ద్వారా షేర్లు కొనుగోలు చేయవచ్చు.మొదటగా Amazon, Apple, Alphabet (Google), Tesla, Meta Platforms (Facebook), Microsoft, Netflix,Walmart షేర్లలో పెట్టుబడులు చేసేందుకు అనుమతి కల్పించారు. ఈ గ్లోబల్ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టిన వారికి నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌, ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ సెంటర్‌ డిపాజిటరీ రసీదులు(DRs) అందజేస్తుంది. అయితే, గ్లోబల్‌ మార్కెట్‌లో ఇంటర్నేషనల్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ స్కీములలో పెట్టుబడులు పెట్టే అవకాశం లేదు. ఓవర్‌సీస్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించిన పరిమితులను తొలగించాల్సి ఉంది. పోర్టిఫోలియోలకు అంతర్జాతీయ కంపెనీల షేర్లను చేర్చే కొత్త అవకాశాన్ని ఎన్‌ఎస్‌సీ, ఐఎఫ్‌ఎస్‌సీ కల్పిస్తోంది. అయితే ఈ అవకాశం అందరు ఇన్వెస్టర్లకు ఉపయోగపడుతుందా? ఎన్‌ఎస్‌సీ, ఐఎఫ్‌ఎస్‌సీ ద్వారా గ్లోబల్‌ కంపెనీల షేర్లు కొనడం ఎలా అనే అంశాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

Edible Oil Prices: భారీగా పెరిగిన వంట నూనెల ధరలు : Russia Ukraine warతో ఆహార సంక్షోభం!

ఇంటర్నేషనల్‌ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాలంటే ఎలా?

పెట్టుబడిదారులు గుజరాత్‌లోని GIFT సిటీలోని డిపాజిటరీతో తప్పనిసరిగా డీమ్యాట్ ఖాతాను తెరవాలి. డిపాజిటరీలో వారి బ్రోకర్ ఉన్నారా? లేదా? అని తనిఖీ చేయాలి. పెద్ద రిటైల్ బ్రోకరేజ్‌లు ఎన్‌ఎస్‌సీ, ఐఎఫ్‌ఎస్‌సీ నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. ప్రస్తుతం GIFT సిటీలో ఒక డిపాజిటరీ మాత్రమే ఉంది, ఎన్‌ఎస్‌సీ, బీఎస్‌సీ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ మరియు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పెట్టుబడిదారులు ఎన్‌ఎస్‌సీ ఐఎఫ్‌ఎస్‌సీలోని బ్రోకర్‌తో ట్రేడింగ్‌ అకౌంట్‌ తెరవాల్సి ఉంటుంది. యూఎస్‌ కంపెనీల షేర్లకు బదులుగా, పెట్టుబడిదారులు డిపాజిటరీ రసీదులు(DR) పొందుతారు. అది పెట్టుబడిదారుల డీమ్యాట్ ఖాతాలలో ఉంటుంది. ఆయా గ్లోబల్‌ కంపెనీలు అందించే డివిడెండ్‌, ఇతర అవకాశాలు ఏదైనా వారి డీఆర్‌ హోల్డింగ్‌ మేరకు వారి ఖాతాలకు జమ అవుతుంది. అయితే పెట్టుబడిదారులు ఎలాంటి ఓటింగ్ హక్కులను పొందలేరు.

బ్రోకరేజ్‌ సంస్థలు అందించే సేవలకు గ్లోబల్‌ కంపెనీలలో షేర్లు కొనుగోలు చేయడానికి మధ్య తేడాఏంటి?

ఇండియాలోని బ్రేకరేజ్‌ సంస్థలు అందించే అంతర్జాతీయ పెట్టుబడి సేవల్లో షేర్లు పెట్టుబడిదారు పేరుపై కాకుండా బ్రోకరేజ్‌ సంస్థ థర్డ్‌ పార్టీపై ఉంటాయి. బ్రోకరేజ్‌ సంస్థ ద్వారా ఏదైనా సమస్య ఎదురైతే రికవరీ ప్రక్రియ సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడిదారులు తమ నిధులను తిరిగి పొందడానికి యూఎస్‌ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌ను సంప్రదించవలసి ఉంటుంది. దేశీయ బ్రోకర్లు తమ భాగస్వాముల ద్వారా నష్టాలను కవర్ చేయడానికి బీమా తీసుకోవచ్చు. ఇన్వెస్టర్లు తమ బ్రోకర్ అటువంటి బీమా కవర్ తీసుకున్నారో లేదో తనిఖీ చేయాలి. ఎన్‌ఎస్‌సీ ఐఎఫ్‌ఎస్‌సీ అనేది ఐఎఫ్‌ఎస్‌సీ అథారిటీ ద్వారా నియంత్రించబడే ఒక సంస్థ. డిపాజిటరీ రసీదులు లేదా NSE IFSC రసీదులు పెట్టుబడిదారు పేరు మీద ఉంటాయి. NSE IFSC క్లియరింగ్ కార్పొరేషన్ NSE IFSC ప్లాట్‌ఫారమ్‌లో అమలు చేయబడిన అన్ని ట్రేడ్‌లకు సంబంధించి సెటిల్‌మెంట్ హామీని అందిస్తుంది. అన్ని ట్రేడ్‌లు కూడా NSE IFSCలో ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫ్రేమ్‌వర్క్ కింద భద్రత కల్పిస్తాయి.

Jio World Center:జియో వరల్డ్‌ సెంటర్‌ ప్రారంభం..ముంబైకి అంకితమిచ్చిన నీతా అంబానీ

కనీస పెట్టుబడి ఎంత చేయాలి?

NSE IFSC ఒక DRకి 5 డాలర్లు మరియు 15 డాలర్ల మధ్య ధరలను ఉంచడానికి ప్రయత్నిస్తోంది. ఇది లోయర్‌ ఎండ్‌లో రూ.375గా ఉంటుంది. ఒక DR సాధారణంగా అసలు వాటాలో కొంత భాగం. DRని కొనుగోలు చేయడం ద్వారా, పెట్టుబడిదారుడు మొత్తం వాటాకు చెల్లించాల్సిన అవసరం లేదు. పెట్టుబడిదారులు అంతర్లీన వాటా విలువలో కొంత భాగాన్ని కొనుగోలు చేయవచ్చు. క్రమంగా పెట్టబడులు పెంచుకోవచ్చు. ఒక Apple షేర్ ప్రస్తుతం సుమారు 166 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది రూ.12,500, NSE IFSC రసీదుల పరంగా 200 DRలకు సమానం. DRల కింద ఉన్న షేర్లకు HDFC బ్యాంక్‌ కస్టోడియన్‌గా వ్యవహరిస్తుంది. ఆర్డర్‌లను ఉంచేటప్పుడు విదేశీ మారకపు హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.

ఇతర యూఎస్‌ కంపెనీలలో ట్రేడింగ్‌కు అవకాశం ఉందా?

పెట్టుబడిదారుల ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది. NSE IFSC త్వరలోనే ఎనిమిది కంపెనీల నుంచి దాదాపు 50 వరకు పెంచే అవకాశం ఉంది. తర్వాత US ఎక్స్ఛేంజీల నుంచి టాప్ 300 స్టాక్‌లను, లేదా ఎక్కువ సంఖ్యలో యాడ్ చేయవచ్చు.. రాబడులపై విధించే పన్నులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Business, India, Personal Finance, Share Market Update, Stock Market, Us

ఉత్తమ కథలు