హోమ్ /వార్తలు /బిజినెస్ /

Multiple Life Policies: ఒకటికి మించి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చా? నిపుణుల సలహా తెలుసుకోండి

Multiple Life Policies: ఒకటికి మించి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చా? నిపుణుల సలహా తెలుసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికీ అవసరమని ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే హెల్త్ ఇన్సూరెన్స్‌తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఎక్కువ కవరేజీ కోసం కొందరు ఒకటి కంటే ఎక్కువ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎంచుకుంటున్నారు. ఇలాంటి మల్టిపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తాయని ప్రజలు నమ్ముతున్నారు.

ఇంకా చదవండి ...

కరోనా మహమ్మారి వల్ల మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ బారిన పడి ట్రీట్‌మెంట్ చేయించుకునేందుకు డబ్బులు లేక, ఆక్సిజన్ సిలిండర్స్ అందక చనిపోయిన వారు సైతం ఎందరో ఉన్నారు. కుటుంబ పెద్ద చనిపోయిన ఇలాంటి సందర్భాల్లో, కుటుంబ సభ్యుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మన దేశంలో ఇన్సూరెన్స్ గురించి ఇటీవల కాలంలో జనాల్లో అవగాహన బాగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికీ అవసరమని ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే హెల్త్ ఇన్సూరెన్స్‌తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఎక్కువ కవరేజీ కోసం కొందరు ఒకటి కంటే ఎక్కువ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎంచుకుంటున్నారు. ఇలాంటి మల్టిపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తాయని ప్రజలు నమ్ముతున్నారు.

ఒకటి కంటే ఎక్కువ జీవిత బీమా పాలసీలు ఒకరి పేరు మీద చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తుల కుటుంబ ఆర్థిక ప్రణాళికలో మల్టిపుల్ లైఫ్ పాలసీలు ఉండటం మంచిదేనని సూచిస్తున్నారు మైఇన్సూరెన్స్ క్లబ్ సంస్థ సీఈఓ దీపక్ యొహన్నన్. అయితే ఇవి అందరికీ అక్కర్లేదని, అవసరం ఉంటేనే మల్టిపుల్ పాలసీల ఎంపికపై నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. మల్టిపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రయోజనాలను ఆయన వివరించారు.

పూర్తి ఆర్థిక భద్రత

పాలసీలు తీసుకునేటప్పుడు ఎలాంటి బెనిఫిట్లు పొందుతున్నామనేది చూసుకోవాలి. ఒక పాలసీ వల్ల రాని బెనిఫిట్ వేరే పాలసీ వల్ల కవర్ అవుతుందంటే.. అప్పుడు మరో పాలసీ తీసుకోవడం మంచిది. అయితే మనం కట్టే ప్రీమియం మీద పాలసీ ఆధారపడి ఉంటుంది. ప్రీమియం కట్టడం అనేది మన ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల మనకు ఆర్థికంగా పూర్తి భద్రత లభిస్తుంది.

వివిధ అవసరాలకు వివిధ ప్లాన్లు

వివిధ అవసరాల కోసం వివిధ ప్లాన్లను కస్టమర్లు ఎంచుకోవచ్చు. అప్పటికప్పుడు అవసరానికి ఉపయోగపడేవి, భవిష్యత్తులో ఉపయోగపడేవి, లేదంటే పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే కార్పస్ ఫండ్ కోసం పనికి వచ్చే ఇన్సూరెన్స్ ప్లాన్లు.. వంటివాటిని నిర్ణీత అవసరాల కోసం ఎంచుకోవచ్చు. పెట్టుబడి రాబడుల కోసం చూసేవారు ULIP లలో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతి ఇన్సూరెన్స్ పాలసీ ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్కువ పాలసీలు ఉన్న వారు ఓ పోర్ట్ ఫోలియోను తయారు చేసుకోవచ్చు. దీని వల్ల అన్ని పాలసీల మీద స్పష్టత వస్తుంది.

ట్యాక్స్ బెనిఫిట్లు

లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల జీవితానికి భద్రతతో పాటు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. కట్టే ప్రీమియం మీద ట్యాక్స్ డిడక్షన్(సెక్షన్ 80సి కింద గరిష్టంగా రూ.1.50లక్షల వరకు) పొందవచ్చు. ఎక్కువ పాలసీలు ఉన్న వారు ఎక్కువ ట్యాక్స్ బెనిఫిట్లు పొందవచ్చు.

First published:

Tags: Health Insurance

ఉత్తమ కథలు