హోమ్ /వార్తలు /బిజినెస్ /

Car Loan: బ్యాంకుల చౌక బేరం.. ఈ కార్లు కొనేందుకు అతితక్కువ వడ్డీ రుణాలు!

Car Loan: బ్యాంకుల చౌక బేరం.. ఈ కార్లు కొనేందుకు అతితక్కువ వడ్డీ రుణాలు!

 ఎలక్ట్రిక్ వెహికల్స్ vs పెట్రోల్, డీజిల్ కార్లు.. బ్యాంకులు వేటిని కొనేందుకు చౌక వడ్డీకే రుణాలు ఇస్తున్నాయంటే..

ఎలక్ట్రిక్ వెహికల్స్ vs పెట్రోల్, డీజిల్ కార్లు.. బ్యాంకులు వేటిని కొనేందుకు చౌక వడ్డీకే రుణాలు ఇస్తున్నాయంటే..

EV | కారు కొనేందుకు సిద్ధం అవుతున్నారా? అయితే మీకు సులభంగానే రుణం పొందొచ్చు. ఎలక్ట్రిక్ కారు కొనుగోలు లేదా పెట్రోల్, డీజిల్ కారు.. రెంటింటిలో వేటిని కొంటే తక్కువ వడ్డీకే లోన్ వస్తుందో తెలుసుకుందాం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Electric Vehicle | దసరా వస్తోంది. పండుగకు కొత్తగా బైక్, స్కూటర్, కారు వంటివి కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే ఎలక్ట్రిక్ వెహికల్ (EV) అయితే బాగుంటుందా? లేదంటే పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) వాహనాన్ని కొనుగోలు చేయాలా? అనే ఆలోచనలో ఉన్నారా? ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. బ్యాంకులు వేటి కొనుగోలుకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నాయో చూద్దాం.

  ఇటీవల కాలంలో చాలా మంది ఈవీలను కొనుగోలు చేస్తున్నారు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి పర్యావరణ అనుకూలం. అంతేకాకుండా ప్రతి రోజూ డబ్బులు ఖర్చు చేయాల్సిన పని లేదు. రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ఇవి నడుస్తాయి. అంటే చార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే వీటి మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది.

  కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఎస్‌బీఐ .. ఇలా చేస్తే గండం గట్టెక్కవచ్చు!

  అంతేకాకుడా కొన్ని రాష్ట్రాలు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలుకు రాయితీలు కూడా అందిస్తున్నాయి. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను నడపడం ఈజీ. ఎందుకంటే వీటిల్లో గేర్లు అనేవి ఉండవు. అయితే వీటికి కొనుగోలు చేయాలంటే మాత్రం ఎక్కువగానే చెల్లించుకోవాలి. అందువల్ల కొంత మంది వీటికి కొనలేకపోవచ్చు. ఇంకా సరైన చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం మరో ఇబ్బంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లోకి తెచ్చాయి. అయితే కొనుగోలుదారులకు మాత్రం ఇంకా తక్కువ ఆప్షన్లే అందుబటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదే సాంప్రదాయ వాహనాలు అయితే అందరికీ అందుబాటు ధరలో లభిస్తున్నాయి. అయితే వీటిల్లో మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ. ఫ్యూయెల్ ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే బాదుడు భరించాల్సిందే.

  హమ్మయ్యా.. బంగారం కొనాలనుకునే వారికి ఊరట.. పడిపోయిన ధరలు!

  లోన్ తీసుకొని ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయాలని భావించే వారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకే లోన్ లభిస్తోందో చెక్ చేసుకోవాలి. యాక్సిస్ బ్యాంక్‌లో ఎలక్ట్రిక్ వెహికల్‌పై 7.7 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభం అవుతోంది. ఎస్‌బీఐలో ఈవీలపై వడ్డీ రేటు 7.95 శాతం నుంచి, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 7.95 శాతం నుంచి, పీఎన్‌బీలో 8.05 శాతం నుంచి, యూనియన్ బ్యాంక్‌లో 8.2 శాతం నుంచి, ఇండియన్ బ్యాంక్‌లో 8.25 శాతం నుంచి కెనరా బ్యాంక్‌లో 8.3 శాతం నుంచి, కర్నాటక బ్యాంక్‌లో 8.61 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం అవుతున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ కాకుండా పెట్రోల్, డీజిల్ వెహికల్ కొనుగోలు చేయాలంటే మాత్రం ఎక్కువ వడ్డీ చెల్లించుకోవాలి. పైన పేర్కొన్న బ్యాంకుల్లో వీటిపై అధిక వడ్డీ పడుతుంది. వడ్డీ రేటు 8.2 శాతం నుంచి 8.71 శాతం వరకు ఉంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Banks, Car loans, Electric bike, Electric Car, Electric Scooter, Electric Vehicles

  ఉత్తమ కథలు