సుప్రీంకోర్టును తీర్పును నిలిపివేస్తారా?... టెలికం కంపెనీలకు సుప్రీం బెంచ్ సూటి ప్రశ్న

Supreme Court : టెలికం శాఖకు బకాయిలు చెల్లించాల్సిన టెలికం కంపెనీలు... చెల్లించకుండా మాఫీ చెయ్యాలని చాలా కాలంగా అడుగుతున్నాయి. అందుకు ఒప్పుకోని సుప్రీంకోర్టు... బకాయిలు వడ్డీతో సహా చెల్లించాలని ఇదివరకు తీర్పు ఇచ్చింది.

news18-telugu
Updated: February 14, 2020, 2:59 PM IST
సుప్రీంకోర్టును తీర్పును నిలిపివేస్తారా?... టెలికం కంపెనీలకు సుప్రీం బెంచ్ సూటి ప్రశ్న
  • Share this:
New Delhi : టెలికం కంపెనీలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వొడాఫోన్, ఎయిర్‌టెల్ సహా కొన్ని టెలికం కంపెనీలకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. రూ.1.5లక్షల కోట్ల బకాయిలు... కేంద్ర టెలికం శాఖకు ఎందుకు చెల్లించలేదో చెప్పాలని కోరింది. ఈ బకాయిలు చెల్లించాలని 2019 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశించింది. వీటిలో వొడాఫోన్ ఐడియా... రూ.50,000 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. అలాగే భారతీ ఎయిర్‌టెల్... రూ.35,586 కోట్లు చెల్లించాల్సి ఉంది. టెలికం కంపెనీల CMDలు, MDలు... మార్చి 17న కోర్టుకు హాజరు కావాల్సిందిగా... జస్టిస్ అరుణ్ మిశ్రా ఆదేశించారు. ఇదే చివరి అవకాశం అని చెప్పిన సుప్రీంకోర్టు... హాజరుకాకపోతే... చర్యలుంటాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల్ని ధిక్కరించడం సరికాదన్న జస్టిస్... అవినీతి ఎలాంటిదైనా దాన్ని అడ్డుకోవాల్సిందే అన్నారు. కోర్టు ఇదివరకు ఇచ్చిన తీర్పు ప్రక్రియను నిలిపివేస్తూ... ఆర్డర్ జారీ చేసిన ఓ టెలికం విభాగంలోని అధికారిపైనా ఈ ధర్మాసనంలోని ఇతర జడ్జిలు నజీర్, ఎంఆర్ షా మండిపడ్డారు. ఇలాంటి ఆర్డర్ ఎందుకు జారీ చేశారో కోర్టుకు వచ్చి చెప్పాలని నోటీస్ ఇచ్చారు. ఈ ఆర్డర్‌ను సొలిసిటర్ జనరల్ తుషార్ మిశ్రా... సాయంత్రం కల్లా విత్ డ్రా చేయాలన్న సుప్రీంకోర్టు... లేదంటే జైలుకు పంపుతామని తెలిపింది.

బకాయిలు చెల్లించాల్సిన టెలికం కంపెనీలు... చెల్లించకుండా మాఫీ చెయ్యాలని చాలా కాలంగా అడుగుతున్నాయి. అందుకు ఒప్పుకోని సుప్రీంకోర్టు... బకాయిలు వడ్డీతో సహా చెల్లించాలని ఇదివరకు తీర్పు ఇచ్చింది. తాజాగా జడ్జిలు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టును రద్దు చేసేద్దామా? అలాంటి చట్టం ఏదైనా ఈ దేశంలో ఉందా? అని ప్రశ్నించారు. ఓ ప్రభుత్వ అధికారి... సుప్రీంకోర్టు తీర్పును ఎలా నిలుపుదల చేస్తారని ప్రశ్నించారు. అతనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించింది.

దాదాపు 15 ఏళ్లుగా టెలికం కంపెనీలు... కేంద్ర టెలికం శాఖకు చెల్లించాల్సిన డబ్బును చెల్లించకుండా వాయిదాలు వేస్తున్నాయి. ఫలితంగా రుణాలతోపాటూ... వడ్డీలూ పెరుగుతున్నా్యి. తాము నష్టాల్లో ఉన్నామనీ... నిలదొక్కుకోవాలంటే... తమ రుణాలపై వడ్డీలు మాఫీ చేసి... తమను ఆదుకోవాలని కంపెనీలు కోరుతున్నాయి. అది రూల్స్‌కి విరుద్ధమంటున్న సుప్రీంకోర్టు... ఎందుకు డబ్బు చెల్లించరో చూస్తామంటోంది. వడ్డీ మాఫీ చెయ్యడాన్ని అవినీతి చర్యగా భావిస్తున్న సుప్రీంకోర్టు బెంచ్... నెక్ట్స్ 17న ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
Published by: Krishna Kumar N
First published: February 14, 2020, 1:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading