Home /News /business /

SHOCKING NEWS FOR WOMEN GOLD PRICES ROSE AGAIN WANT TO KNOW GOLD PRICES TODAY THEN CLICK HERE PRV

Gold Prices today: మగువలకు షాకింగ్​ న్యూస్​.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం బంగారం ఎంత ఉందంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు కూడా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధ‌ర‌లు అమాంతం పెరిగాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణం అయింది.

ఇంకా చదవండి ...
పండుగ సీజన్​ కావడంతో బంగారం (Gold) కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు కూడా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధ‌ర‌లు అమాంతం పెరిగాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణం అయింది.  తాజాగా బుధవారం (అక్టోబర్‌ 6) దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర (Gold price)పై రూ.240 వరకు పెరిగింది. ఇక వెండి కూడా అదే దారిలో పయనిస్తోంది. ఇక దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌ (Hyderabad)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 ఉంది. విజయవాడ (vijayawada)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,730 ఉంది.

ఇతర నగరాల్లో..

ఢిల్లీ (delhi)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,080 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,060 ఉంది. ముంబై (Mumbai)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,680 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,850 ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 ఉంది.

వెండి ధరలు పరిశీలిస్తే..

ఢిల్లీలో కిలో వెండి (silver) రూ.60,600 ఉండగా, చెన్నైలో రూ.64,800 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.60,600 ఉండగా, కోల్‌కతాలో రూ.60,600 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.60,600 ఉండగా, కేరళలో రూ.64,800 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,800 ఉండగా, విజయవాడలో రూ. 64,800 వద్ద కొనసాగుతోంది.

బంగారం ధర (gold rates)ల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: BUSINESS NEWS, Gold price, Gold Prices Today, Silver price

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు