SBI Card: క్రెడిట్ కార్డ్ వాడుతున్నవారికి ఎస్‌బీఐ షాక్

SBI Card | క్రెడిట్ కార్డ్ నియమనిబంధనల్లో ఫ్యూయెల్ ట్రాన్సాక్షన్స్‌పై 0.75% క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ గురించి ప్రత్యేకంగా వివరిస్తుంది ఎస్‌బీఐ.

news18-telugu
Updated: September 25, 2019, 5:15 PM IST
SBI Card: క్రెడిట్ కార్డ్ వాడుతున్నవారికి ఎస్‌బీఐ షాక్
SBI Card: క్రెడిట్ కార్డ్ వాడుతున్నవారికి ఎస్‌బీఐ షాక్ (ప్రతీకాత్మక చిత్రం, image: SBI Card)
news18-telugu
Updated: September 25, 2019, 5:15 PM IST
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? మీకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డును పెట్రోల్ బంకులో వాడుతూ 0.75% క్యాష్‌బ్యాక్ పొందుతున్నారా? అయితే మీకు షాకే. ఈ స్కీమ్‌ను రద్దు చేస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి ఈ స్కీమ్ నిలిపివేస్తున్నట్టు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు ఎస్ఎంఎస్‌లు పంపుతోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. "ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సూచనల మేరకు ఫ్యూయెల్ ట్రాన్సాక్షన్స్‌పై 0.75% క్యాష్‌బ్యాక్‌ను 2019 అక్టోబర్ 1 నుంచి తొలగిస్తున్నాం" అని ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కర్టమర్లకు ఎస్ఎంఎస్‌లు వస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డ్ నియమనిబంధనల్లో ఫ్యూయెల్ ట్రాన్సాక్షన్స్‌పై 0.75% క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ గురించి ప్రత్యేకంగా వివరిస్తుంది ఎస్‌బీఐ. ఇప్పుడు మధ్యలో ఈ స్కీమ్ తొలగించడంపై కస్టమర్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

sbi fuel cashback, sbi petrol card, sbi bpcl card benefits, bpcl sbi card, bpcl sbi platinum credit card limit, sbi bpcl credit card benefits, sbi fuel cashback, sbi petrol cashback, ఎస్‌బీఐ ఫ్యూయెల్ క్యాష్‌బ్యాక్, ఎస్‌బీఐ పెట్రోల్ కార్డ్, ఎస్‌బీఐ బీపీసీఎల్ కార్డ్ బెనిఫిట్స్, బీపీసీఎల్ ఎస్‌బీఐ కార్డ్, బీపీసీఎల్ ఎస్‌బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్ లిమిట్, ఎస్‌బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్, ఎస్‌బీఐ ఫ్యయెల్ క్యాష్‌బ్యాక్, ఎస్‌బీఐ పెట్రోల్ క్యాష్‌బ్యాక్
కస్టమర్లకు ఎస్‌బీఐ పంపిన ఎస్ఎంఎస్


ఎస్‌బీఐ నుంచి వేర్వేరు రకాల క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఎస్‌బీఐ బీపీసీఎల్, ఎస్‌బీఐ ప్రీమియర్, ఎస్‌బీఐ యాత్ర, ఎస్‌బీఐ ఎయిర్ ఇండియా, ఎస్‌బీఐ చెన్నై మెట్రో, ఎస్‌బీఐ ముంబై మెట్రో, ఎస్‌బీఐ ఐఆర్‌సీటీసీ క్రెడిట్ కార్డులపై పెట్రోల్, డీజిల్ కొన్నవారికి 0.75% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన పెట్రోల్ బంకుల్లో ఈ ఆఫర్ ఉండేది. అక్టోబర్ 1 నుంచి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ ఆగిపోనుంది. వాస్తవానికి ఈ నిర్ణయం ఈ ఏడాది మార్చిలోనే అమలులోకి రావాల్సి ఉంది. కానీ... కాస్త ఆలస్యమైంది.

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Amazon Sale: స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లివే...
Loading...
Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... కొత్త రేట్లు ఇవే

Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఆఫర్ ధరలివే
First published: September 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...