SHOCK TO THE YOUNG MAN WHO BOOKED THE IPHONE 13 WHEN HE SAW THE BOX OPEN MK
Fraud in Online Shopping: iPhone 13 బుక్ చేసిన యువకుడికి షాక్...బాక్స్ తెరిచి చూడగానే...
తాను బుక్ చేసిన ఐఫోన్ డెలివరీ అయ్యింది. ఆత్రుతగా బాక్స్ తెరిచి చూశాడు. చూడగానే ఫ్యూజులు ఎగిరిపపోయాయి. ఐఫోన్ ఉండాల్సిన స్థానంలో చాక్లెట్ ఉంది. అది చూసి యువకుడు లబోదిబో మని మొత్తుకున్నాడు. 1 లక్ష కంటే ఎక్కువ విలువైన iPhone13 Pro Max ఆర్డర్ చేస్తే రూ. 595 విలువైన డైరీ మిల్క్ చాక్లెట్ దక్కింది.
తాను బుక్ చేసిన ఐఫోన్ డెలివరీ అయ్యింది. ఆత్రుతగా బాక్స్ తెరిచి చూశాడు. చూడగానే ఫ్యూజులు ఎగిరిపపోయాయి. ఐఫోన్ ఉండాల్సిన స్థానంలో చాక్లెట్ ఉంది. అది చూసి యువకుడు లబోదిబో మని మొత్తుకున్నాడు. 1 లక్ష కంటే ఎక్కువ విలువైన iPhone13 Pro Max ఆర్డర్ చేస్తే రూ. 595 విలువైన డైరీ మిల్క్ చాక్లెట్ దక్కింది.
Fraud in Online Shopping: ఈ మధ్యకాలంలో ఈ కామర్స్ సైట్స్ ద్వారా చేసిన షాపింగుల్లో మోసం చేసిన ఘటనలు పెరిగిపోతున్నాయి. సప్లయి చెయిన్ ఎంత పకడ్బందీగా మెయిన్ టెయిన్ చేసినప్పటికీ, కొందరు దుండగులు కస్టమర్ల విలువైన వస్తువులను మాయం చేస్తున్నారు. తాజాగా యూకేకు చెందిన ఓ వ్యక్తి క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రకటించిన ఆఫర్స్ చూసి మోజుపడి ఐఫోన్ బుక్ చేసుకున్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా లక్ష రూపాయలు పెట్ట మరీ కొన్నాడు. ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతుందా తన కొత్త ఐఫోన్ తో సెల్ఫీలు దిగి స్నేహితులతో పంచుకుందామా అని యువకుడి ఎదురుచూపులు ఫలించాయి. తాను బుక్ చేసిన ఐఫోన్ డెలివరీ అయ్యింది. ఆత్రుతగా బాక్స్ తెరిచి చూశాడు. చూడగానే ఫ్యూజులు ఎగిరిపపోయాయి. ఐఫోన్ ఉండాల్సిన స్థానంలో చాక్లెట్ ఉంది. అది చూసి యువకుడు లబోదిబో మని మొత్తుకున్నాడు. 1 లక్ష కంటే ఎక్కువ విలువైన iPhone13 Pro Max ఆర్డర్ చేస్తే రూ. 595 విలువైన డైరీ మిల్క్ చాక్లెట్ దక్కింది. అంతేకాదు ఆ ఫోన్ బాక్స్‌లో ఓ టాయిలెట్ పేపర్ కూడా దొరికింది. .
పూర్తి వివరాల్లోకి వెళితే UKకి చెందిన డేనియల్ కారోల్ iPhone 13 Pro Maxని క్రిస్మస్ సందర్భంగా ఆర్డర్ చేశారు. డేనియల్ డిసెంబర్ 2న Apple యొక్క అధికారిక వెబ్సైట్ నుండి సుమారు రూ. 1 లక్షా పాతిక వేలు ఖర్చు చేసి iPhone 13 Pro Maxని ఆర్డర్ చేశాడు. డెలివరీకి మొదటి తేదీ డిసెంబర్ 17 అని సదరు ఈ కామర్స్ వెబ్ సైట్ పేర్కొంది. కానీ డెలివరీ మాత్రం ఆ రోజు జరగలేదు.
రెండు వారాలు గడిచినా ఫోన్ డెలివరీ కాకపోవడంతో డేనియల్ స్వయంగా స్టోర్ కు వెళ్లి పార్శిల్ కలెక్ట్ చేసుకున్నాడు. అది ఓపెన్ చేసి చూడగానే, అందులో 120 గ్రాముల బరువున్న పార్శిల్లో రెండు డెయిరీ మిల్క్ ఓరియో చాక్లెట్లు దుర్వాసనతో కూడిన టాయిలెట్ పేపర్లో చుట్టి కనిపించాయి.
పార్శిల్ బాక్స్‌ను పూర్తిగా పరిశీలించిన డేనియల్ డెలివరీ విషయంలో ఏదో ట్యాంపరింగ్ జరిగిందని భావించాడు. ప్యాకేజీ చేసిన టేప్‌లు కూడా చాలా వదులుగా ఉన్నాయని, డేనియల్ తెలిపాడు. ఈ విషయాన్ని డేనియల్ తన ట్వీట్లో తెలియజేశాడు, అయితే ట్వీట్‌ను తొలగించాడు. ఇక డెలివరీ సంస్థ DHL, ఫోన్ తయారీ దారు Apple రెండింటికీ డేనియల్ ఫిర్యాదు చేశారు. దీనిపై DHL, ఆపిల్ కస్టమర్ కు జరిగిన నష్టానికి చింతించాయి. అంతే కాదు సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.