Home /News /business /

SHOCK FOR THE PENSIONERS PAYMENTS FROM CREDIT CARDS WILL BE STOPPED FOR THEM FROM NOW ON READ THAT UMG GH

NPS Rules: పెన్షనర్లకు షాక్.. ఇకపై వాటికి క్రెడిట్ కార్డుల నుంచి చెల్లింపులు నిలిపివేత ! అదేంటో చదవండి..

 పెన్షనర్లకు షాక్.. ఇకపై వాటికి క్రెడిట్ కార్డుల నుంచి చెల్లింపులు  నిలిపివేత ! అదేంటో చదవండి..

పెన్షనర్లకు షాక్.. ఇకపై వాటికి క్రెడిట్ కార్డుల నుంచి చెల్లింపులు నిలిపివేత ! అదేంటో చదవండి..

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)కు సంబంధించిన పేమెంట్ ప్రాసెస్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టైర్-2 అకౌంట్స్‌కు క్రెడిట్ కార్డ్స్ ద్వారా కాంట్రిబూషన్ చేసే సదుపాయాన్ని నిలిపివేయాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నిర్ణయించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)కు సంబంధించిన పేమెంట్(Payment) ప్రాసెస్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టైర్-2 అకౌంట్స్‌కు క్రెడిట్ కార్డ్స్(Credit card) ద్వారా కాంట్రిబూషన్ చేసే సదుపాయాన్ని నిలిపివేయాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాలను PFRDA ఆగస్టు 3న వెల్లడించిన అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇప్పుడు NPS టైర్-1 అకౌంట్స్‌ కోసం క్రెడిట్ కార్డ్ నుంచి చెల్లింపు చేసే సదుపాయం అలాగే ఉంటుంది. అయితే టైర్-2 అకౌంట్‌కు క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్ చేసే అవకాశం ఇకపై NPS ఖాతాదారులకు అందుబాటులో ఉండదు.

టైర్-2 ఎన్‌పీఎస్ అకౌంట్స్‌కు క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ నిలిపివేయడం గురించి PFRDA సర్క్యులర్‌లో కీలక వివరాలను వెల్లడించింది. ‘నేషనల్ పెన్షన్ సిస్టమ్‌కు సంబంధించిన టైర్-II అకౌంట్స్‌కు క్రెడిట్ కార్డ్‌ను పేమెంట్ మోడ్‌గా ఉపయోగించి సబ్‌స్క్రిప్షన్స్/కంట్రిబ్యూషన్స్ చెల్లించే సదుపాయాన్ని నిలిపివేయాలని అథారిటీ నిర్ణయించింది. దీని ప్రకారం NPS టైర్-II అకౌంట్‌కు పేమెంట్ మోడ్‌గా క్రెడిట్ కార్డ్‌ను అంగీకరించడాన్ని తక్షణమే నిలిపేయాలని అన్ని పాయింట్‌ ఆఫ్‌ పర్చేజ్‌(PoP)లకు సూచిస్తున్నాం.’ అని సర్క్యులర్ పేర్కొంది.

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం- 2013లోని సెక్షన్ 14 కింద లభించిన అధికారాలను అమలు చేస్తూ PFRDA తాజా సర్క్యులర్‌ను జారీ చేసింది. చందాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, జాతీయ పెన్షన్ సిస్టమ్, పెన్షన్ స్కీమ్‌ల క్రమబద్ధమైన వృద్ధిని క్రమబద్ధీకరించడానికి, ప్రోత్సహించడానికి, నిర్ధారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.

అయితే NPS టైర్-1 అకౌంట్స్‌కు క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్ చేసే విధానం కొనసాగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్‌లో పెట్టుబడి (Investment)కోసం క్రెడిట్ కార్డ్ పేమెంట్‌ను ఇప్పటి నుంచి ప్రోత్సహించరు. ఎందుకంటే అటువంటి పేమెంట్స్‌ అధిక వడ్డీతో డబ్బును పరపతిగా ఉపయోగిస్తాయి. ఉదాహరణకు క్రెడిట్ కార్డ్ పేమెంట్‌ను ఎంచుకునే NPS ఖాతాదారులు 0.60 శాతం పేమెంట్ గేట్‌వే ఛార్జీని చెల్లించాలి. దానికి GST కలిపితే ఓవర్-లెవరేజింగ్ మరింత ఎక్కువగా ఉంటుంది.

ఇదీ చదవండి: Politicians Promises: దేశంలో ఉచిత పథకాల లిస్ట్ ఇదే..! కలర్ టీవీల నుంచి రోబోల వరకూ ఉచితంగా పంచినవే ఇవే..!!



టైర్-2 NPS అకౌంట్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
టైర్-2 NPS అకౌంట్ స్వచ్ఛందంగా (వాలంటరీగా) ఉంటుంది. టైర్-2 ఎన్‌పీఎస్ అకౌంట్ తెరవడానికి టైర్-1 ఎన్‌పీఎస్ అకౌంట్ అర్హతగా ఉంటుంది. టైర్-2 అకౌంట్ ఉన్న ఎన్‌పీఎస్ ఖాతాదారులు దీంట్లో చేసే పెట్టుబడులపై ఆదాయ పన్ను మినహాయింపు పొందేందుకు అర్హులు కారు. అయితే టైర్-1 ఎన్‌పీఎస్ అకౌంట్‌తో పోలిస్తే టైర్-2 ఎన్‌పీఎస్ అకౌంట్‌ ఎగ్జిట్‌కు బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. విత్‌డ్రా రూల్స్ కూడా టైర్ 1 అకౌంట్‌తో పోలిస్తే సులభంగా ఉంటాయి.



టైర్-1 అకౌంట్ ఉన్న ఎన్‌పీఎస్ ఖాతాదారులు మాత్రమే టైర్-2 ఎన్‌పీఎస్ అకౌంట్ ఓపెన్ చేయగలరు. కనీసం రూ.1000 పెట్టుబడితో టైర్-2 NPS ఖాతాను తెరవవచ్చు. ఆ తర్వాత ఎటువంటి గరిష్ట పరిమితి లేకుండా టైర్-2 ఖాతాలో రూ.250 గణాంకాలతో ఎంతైనా కాంట్రిబూషన్ చేయవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Cibil score, Credit cards, Debit cards, NPS Scheme, Pensions

తదుపరి వార్తలు