Home /News /business /

SHOCK FOR FIXED DEPOSIT ACCOUNT HOLDERS STATE BANK OF INDIA SBI CUTS INTEREST RATES ON FIXED DEPOSITS SS

SBI: ఎస్‌బీఐలో డబ్బులు దాచుకున్నవారికి షాక్

SBI: ఎస్‌బీఐలో డబ్బులు దాచుకున్నవారికి షాక్
(ప్రతీకాత్మక చిత్రం)

SBI: ఎస్‌బీఐలో డబ్బులు దాచుకున్నవారికి షాక్ (ప్రతీకాత్మక చిత్రం)

SBI Interest Rates | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డబ్బులు దాచుకున్నవారికి బ్యాంక్ షాకిచ్చింది. వడ్డీ రేట్లను మరోసారి తగ్గించింది.

    మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? మంచి వడ్డీ రేటు వస్తుందని డబ్బులు దాచుకున్నారా? ఎస్‌బీఐ షాకిచ్చింది. మరోసారి వడ్డీ రేట్లను తగ్గించింది బ్యాంకు. కొత్తగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారితో పాటు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లను రెన్యువల్ చేసేవారికి ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడం నెల రోజుల్లో ఇది రెండో సారి. తగ్గించిన వడ్డీ రేట్లు మార్చి 10 నుంచి అమలులోకి వచ్చేశాయి. కొత్త వడ్డీ రేట్ల ప్రకారం 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీపై వడ్డీని 4.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది ఎస్‌బీఐ. ఏడాది నుంచి 5 ఏళ్ల లోపు డిపాజిట్లపై వడ్డీని 6 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గించింది. 5 నుంచి 10 ఏళ్ల డిపాజిట్లపై వడ్డీని 6 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గించింది. ఎస్‌బీఐ లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

    7 రోజుల నుంచి 45 రోజులు- 4%
    46 రోజుల నుంచి 179 రోజులు- 5%
    180 రోజుల నుంచి 210 రోజులు- 5.5%
    211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 5.5%
    1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 5.9%
    2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 5.9%
    3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 5.9%
    5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 5.9%

    సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్స్ ఎక్కువగా వడ్డీ లభిస్తుంది. ఎస్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించిన తర్వాత సీనియర్ సిటిజన్లకు లభించే వడ్డీ రేట్లు ఇవే.

    7 రోజుల నుంచి 45 రోజులు- 4.5%
    46 రోజుల నుంచి 179 రోజులు- 5.50%
    180 రోజుల నుంచి 210 రోజులు- 6.00%
    211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 6.00%
    1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 6.4%
    2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 6.4%
    3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 6.4%
    5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 6.4%

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ వడ్డీ రేట్లు మార్చి 10 నుంచి అమలులోకి వచ్చాయి.

    ఇవి కూడా చదవండి:

    SBI Home Loan: హోమ్ లోన్ కస్టమర్లకు గుడ్ న్యూస్... మళ్లీ వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ

    PMVVY Scheme: ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10,000 పెన్షన్... మార్చి 31 చివరి తేదీ

    Google Tips: ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేస్తున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank, Banking, Investment Plans, Personal Finance, Save Money, Sbi, State bank of india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు