షెల్, రిలయన్స్, ఓఎన్జీసీ జాయింట్ వెంచర్ తాము నిర్వహిస్తున్న పన్నా-ముక్త గ్యాస్ చమురు క్షేత్రాలను ఓఎన్జీసీకి డిసెంబర్ 21, 2019న అప్పగించనున్నారు. గత 25 సంవత్సరాలుగా కార్యకలాపాల తర్వాత పన్నా-ముక్త క్షేత్రాలను ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీకి బదిలీ చేయనున్నారు. పన్నా-ముక్త, పన్నా ముక్త తపతి (పిఎంటి) జాయింట్ వెంచర్ భాగస్వాములుగా పన్నా- ముక్త గ్యాస్ క్షేత్రాలను ఓఎన్జీసీకి అప్పగించనున్నారు. పీఎమ్టీ జేవీ విభాగాలలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు (ఓఎన్జీసీ)40శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు(ఆర్ఐఎల్)30శాతం, బీజీ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ ఇండియా లిమిటెడ్‌కు(బీజీఈపీఐఎల్)30 శాతం వాటా ఉంది. ఈ సందర్భంగా బీజీఈపీఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ త్రివిక్రమ్ అరుణ్ మాట్లాడుతూ భారతదేశపు అతిపెద్ద జాతీయ ఆయిల్ కంపెనీ (ఒఎన్‌జిసి), అతిపెద్ద ప్రైవేట్ సంస్థ (రిలయన్స్) అంతర్జాతీయ ఆయిల్ కంపెనీల (షెల్)మధ్య విజయవంతమైన భాగస్వామ్యానికి పీఎమ్టీ జేవీ గొప్ప ఉదాహరణగా నిలిచిందని తెలిపారు.
పన్నాముక్త క్షేత్రాలను ఓఎన్జీసీకి సురక్షితంగా అప్పగించేలా తమ బృందాలు కృషి చేశాయని అరుణ్ కొనియాడారు. దేశంలోని చమురు ఉత్పత్తిలో పన్నా ముక్తా క్షేత్రాలు దాదాపు 6%, గ్యాస్ ఉత్పత్తిలో 7% దోహదం చేసిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ బీ గంగూలీ పేర్కొన్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.