మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మంచి ఐడియా ఉండి, స్టార్టప్ కోసం సరైన పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఫండింగ్ కోసం మీ బిజినెస్ ఐడియాను పంచుకోవడానికి ఒక వేదికగా పనిచేస్తున్న షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2 వచ్చేసింది. అందులో మీ ప్రతిభను ప్రదర్శించి, ఆలోచనకు రూపం ఇచ్చే అవకాశం కలుగుతుంది.
సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో జనవరి 2న ఈ షో ప్రీమియర్ చేయబడింది. స్టార్టప్ రియాలిటీ టెలివిజన్ సిరీస్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో సీజన్ అనేది వర్ధమాన ఎంటర్ ప్రెన్యూయర్స్ తమ బిజినెస్ ఐడియాలను పెట్టుబడిదారుల (షార్క్స్) ప్యానెల్ ముందు పంచుకోవడానికి ఒక వేదికగా పనిచేయనుంది. కాగా, షో మొదటి సీజన్ డిసెంబర్ 2021లో లాంచ్ అయింది. అప్పటి నుంచి ఇది చాలా పాపులర్ అయింది. చాలా మంది దృష్టిని ఆకర్షించింది. దేశంలో ఎక్కువగా మంది మాట్లాడుకునే షోలలో ఇది ఒకటిగా నిలిచింది.
New Rules: ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? ఈ కొత్త రూల్స్ గుర్తుంచుకోండి
మొదట www.sharktank.sonyliv.com కు లాగిన్ అవ్వాలి. లేదా SonyLIV యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, సిక్స్ డిజిట్ ఓటీపీని జనరేట్ చేయాలి. ఓటీపీని సబ్మిట్ చేసి, మీ భాషను ఎంచుకోవాలి. ఇంగ్లీష్ లేదా హిందీ ఆప్షన్స్ అక్కడ ఉంటాయి. అనంతరం టర్మ్స్ అండ్ కండీషన్స్ అంగీకరించిన తరువాత, కొత్త పేజీలో ఆన్‌లైన్ రిజిస్ర్టేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. నెక్ట్స్ పేజీలో ఇన్‌స్ట్రక్షన్స్ వస్తాయి. వాటిని పరిశీలించిన తరువాత ‘స్టార్ట్ ’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీ ప్రొఫైల్ సమాచారాన్ని ఫారమ్‌లో ఎంటర్ చేయాలి.
ఆ తరువాత ‘అబౌట్ యువర్ బిజినెస్’ అనే ఫారమ్ వస్తుంది. ఇందులో మీరు ఇచ్చే సమాచారం ఆధారంగా మీ బిజినెస్ మోడల్‌పై షో నిర్వహకులు ఓ అంచనాకు వస్తారు. తద్వారా బిజినెస్ ఐడియాను యాక్సెస్ చేయడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తారు. ఈ ఫారమ్‌లో మీ బిజినెస్ ఐడియాను ఒక వాక్యంలో వివరించాల్సి ఉంటుంది. 250 వర్డ్స్ మించని బిజినెస్ ప్లాన్ సారాంశాన్ని కూడా వివరించాల్సి ఉంటుంది. మీరు మీ ప్రొడక్ట్ సంబంధించిన ఫోటోలు ఏవైనా ఉంటే వాటిని కూడా అప్‌లోడ్ చేయవచ్చు.
LIC Agent: ఎల్ఐసీ ఏజెంట్‌గా పార్ట్ టైమ్ జాబ్... ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ప్రాసెస్ ఇదే
షార్క్ ట్యాంక్ ఇండియా రెండో ఎడిషన్‌లోని పెట్టుబడిదారులు లేదా షార్క్స్‌లలో షాదీ.కామ్‌కి చెందిన అనుపమ్ మిట్టల్, మమేర్త్‌కు చెందిన గజల్ అలగ్, లెన్స్‌కార్ట్‌కు చెందిన పీయుష్ బన్సల్, బోట్‌కు చెందిన అమన్ గుప్తా, షుగర్ కాస్మటిక్స్‌కు చెందిన వినీతా సింగ్, కార్దేఖో సహ సీఈఓ అమిత్ జైన్ ఉండనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business Ideas, Shark Tank India, Start-Up, Startups