హోమ్ /వార్తలు /బిజినెస్ /

Stock Recommendations: బ్యాంక్ షేర్లతో భారీ లాభాలు.. ఈ 3 స్టాక్స్‌తో మీ పంట పండినట్లే!

Stock Recommendations: బ్యాంక్ షేర్లతో భారీ లాభాలు.. ఈ 3 స్టాక్స్‌తో మీ పంట పండినట్లే!

Stock Recommendations: బ్యాంక్ షేర్లతో భారీ లాభాలు.. ఈ 3 స్టాక్స్‌తో మీ పంట పండినట్లే!

Stock Recommendations: బ్యాంక్ షేర్లతో భారీ లాభాలు.. ఈ 3 స్టాక్స్‌తో మీ పంట పండినట్లే!

Bank Stocks | మీరు స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టాలని భావిస్తున్నారా? అయితే బ్యాంక్ షేర్లను ఒకసారి పరిశీలించొచ్చు. బ్యాంక్ షేర్ల హవా కొనసాగుతోంది. నిపుణులు 3 స్టాక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Stocks To Buy | మీరు స్టాక్ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారా? లేదంటే ఇప్పటికే షేర్లు కొనడం, అమ్మడం వంటివి చేస్తున్నారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ప్రస్తుతం బ్యాంక్ (Bank) షేర్ల హహ కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. స్టాక్ మార్కెట్ (Stock Market) నిపుణులు కూడా బ్యాంక్ షేర్లు కొనొచ్చని సిఫార్సు చేస్తున్నారు. ఏ ఏ షేర్లు కొనుగోలు చేయవచ్చొ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో కొనసాగుతోంది. నవంబర్ 17న 42622 పాయింట్ల స్థాయికి చేరింది. బ్యాంకుల అసెట్ క్వాలిటీ మెరుగపడటం, మార్జిన్ ఔట్‌లుక్ సానుకూలముగా ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దీని వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల షేర్లు గత కొన్ని నెలలుగా ర్యాలీ చేస్తూ వస్తున్నాయి. వీటిల్లో మనం ఎస్‌బీఐ , ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి 3 స్టాక్స్ గురించి చూద్దాం.

క్రెడిట్ కార్డు వాడే వారికి ఝలక్.. చార్జీలు పెంచేసిన 2 బ్యాంకులు, రివార్డు పాయింట్లలో కోత!

యాక్సిస్ బ్యాంక్ లోన్ డిమాండ్ బాగుంది. అధిక మార్జిన్ విభాగంలో బ్యాంక్ మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉంది. అసెట్ క్వాలిటీ అంశం గురించి ఆలోచించాల్సిన పని లేదు. అందువల్ల ఈ షేరు పైపైకి చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. మోర్గాన్ స్టాన్లీ ఈ షేరుకు ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చింది. టార్గెట్ ప్రైస్‌ను రూ. 1150గా నిర్ణయించింది. హెచ్ఎస్‌బీసీ కూడా బై రేటింగ్ ఇచ్చింది. టార్గెట్ ప్రైస్‌ను రూ. 1075 నిర్ణయించింది. శుక్రవారం ఈ షేరు దర రూ. 859 వద్ద ఉంది.

పోస్టాఫీస్‌లో 4 అదిరే స్కీమ్స్.. రూ.400 పొదుపుతో చేతికి రూ.కోటి!

ఐసీఐసీఐ బ్యాంక్ షేరు కూడా ర్యాలీ చేయొచ్చు. ఈ షేరు రూ. 1200కు చేరొచ్చు. మెరుగైన అసెట్ క్వాలిటీ వల్ల బ్యాంక్ స్టాక్ జోరు మీద ఉంది. నికర వడ్డీ మార్జిన్లపై పాజిటివ్ ఔట్‌లుక్ కూడా సానుకూల అంశం. శుక్రవారం ఈ షేరు ధర రూ. 921 వద్ద ఉంది. అలాగే ఎస్‌బీఐ స్టాక్ కూడా పైపైకి చేరొచ్చు. ఈ బ్యాంక్ షేరు ధర శుక్రవారం రూ. 602 వద్ద క్లోజ్ అయ్యింది. నిపుణుల ప్రకారం చూస్తే.. ఈ షేరును కొనొచ్చని సిఫార్పు చేస్తున్నారు. ఈ షేరు టార్గెట్ ప్రైస్ రూ. 715గా ఉంది. కాగా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే వారు భారీ రిస్క్ ఉంటుందని గుర్తించుకోవాలి. అందువల్ల డబ్బులు పెట్టడానికి ముందు ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహాలు తీసుకోండి. లేదంటే పెట్టిన డబ్బులు కూడా తిరిగిరాకపోవచ్చు.

First published:

Tags: Banks, Share Market Update, Stock Market, Stocks

ఉత్తమ కథలు