news18-telugu
Updated: December 18, 2020, 11:00 AM IST
ఫ్రతీకాత్మకచిత్రం
స్టాక్ మార్కెట్లో కాలం కలిసి వస్తే మీ పెట్టుబడి ఊహకు అందని రేంజులో లాభాలను అందిస్తుంది. రూపాయి వందరూపాయలు అవ్వడం కేవలం స్టాక్ మార్కెట్లోనే సాధ్యం అవుతందని నిపుణులు అంటున్నారు. అయితే, స్టాక్ మార్కెట్ నిస్సందేహంగా ప్రమాదకర పెట్టుబడి తెలుసుకోండి, కానీ సరైన షేర్ లో పెట్టుబడి పెడితే, మిమ్మల్ని ధనవంతులు అవ్వకుండా ఎవరూ ఆపలేరు. అయితే ఎందులో పెట్టుబడి పెట్టాలి అనేది పెద్ద ప్రశ్న. చాలా మంది లార్జ్ క్యాపిటల్ షేర్లలో పెట్టుబడులు పెట్టమని సిఫార్సు చేస్తుంటారు. అయితే లార్జ్ కాప్ స్టాక్స్ లో పెట్టుబడి పెడితే, పెద్దగా రిస్క్ ఉండదు. కానీ లాభాలు మాత్రం స్థిరంగా వస్తాయి. అయితే మల్టీ బ్యాగర్లుగా కలిసి రావాలంటే మాత్రం స్మాల్ మరియు మిడ్ క్యాప్ స్టాక్స్ మాత్రమే మంచి లాభాలను ఇవ్వగలవు. అయితే లార్జ్ కాప్ స్టాక్స్ తో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ప్రమాదం కూడా ఎక్కువే. గత ఒక సంవత్సరంలో బలంగా లాభం పొందిన స్టాక్స్ లలో చెప్పుకోదగ్గ అటువంటి స్టాక్ Transglobe Foods (BOM: 519367) గురించి తెలుసుకుందాం.
రూ.1 లక్షకు రూ.75 లక్షల లాభం...Transglobe Foods ఓ మైక్రో క్యాపిటల్ సంస్థ. కానీ దీని స్టాక్ కేవలం రూ.2.80 నుండి 210.60 వరకు ఎగిసింది. అది కూడా కేవలం ఒకే సంవత్సరంలో అంటే ఆశ్చర్యపోతారు. ఈ స్టాక్ ఏడాది క్రితం రూ .2.80 వద్ద ఉండగా, శుక్రవారం రూ .210.60 వద్ద ముగిసింది. ఈ ఏడాది సమయంలో Transglobe Foods రూ .1 లక్ష పెట్టుబడి పెడితే ప్రస్తుతం అది రూ .75.21 లక్షలుగా మారింది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ స్టాక్ బాగా పడిపోయింది. అక్టోబర్ 28 నుండి ఈ స్టాక్ వరుసగా పడిపోతోంది. కానీ ఈ రకమైన ధోరణి తరచుగా చిన్న కంపెనీలలో సర్వసాధారణం అనే చెప్పాలి. అయితే, ఈ స్టాక్ ప్రస్తుత క్షీణతకు కారణం లాభాల బుకింగ్ అనే చెప్పాలి. ఈ స్టాక్ గణనీయంగా పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను అమ్మారు.
మార్కెట్ క్యాప్ ఎంత
ఈ సంస్థ మార్కెట్ క్యాపిటల్ కేవలం రూ. 3.05 లక్షల కోట్లు. గత 52 వారాలుగా ఈ స్టాక్ గరిష్టంగా రూ. 302.25 వరకూ ఎదిగింది. ఈ శుక్రవారం మార్కెట్ ముగిసే నాటికి Transglobe Foods షేరు ధర రూ .214.85 వద్ద ముగిసింది.
సంస్థ ఆర్థిక డేటా
2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థకు రూ. 0.19 కోట్ల నష్టం ఉండగా, 2019-20లో రూ. 0.18 కోట్ల నికర లాభం నమోదైంది. అంతకుముందు 2017-18లో దీని నికర నష్టం రూ .0.25 కోట్లు. ఈ గణాంకాలు సంస్థ యొక్క పరిమాణాన్ని సూచిస్తాయి.
34 సంవత్సరాల సంస్థ
ఈ సంస్థ ఎన్ఎస్ఇలో లిస్ట్ కాలేదు. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ. కూరగాయలు, పండ్లు లాంటి అనేక ఇతర ఉత్పత్తులపై దృష్టి పెడుతుంది. గుజరాత్ లోని బరోడాలో ఉన్న ఈ సంస్థ 1986లో స్థాపించారు. పెట్టుబడికి సంబంధించినంతవరకు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు మీ రిస్క్ ప్రొఫైల్ను అంచనా వేయండి. పెట్టుబడి పెట్టడానికి ముందు, ఆర్థిక సలహాదారులు మరియు బ్రోకింగ్ సంస్థల సలహా ప్రకారం పెట్టుబడి పెట్టండి. స్టాక్ మార్కెట్లో ఇతర ఎంపికల మాదిరిగానే, ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడం మంచిది.
Published by:
Krishna Adithya
First published:
December 18, 2020, 11:00 AM IST